సన్‌రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిన చెన్నై, ఐపీఎల్‌లో వార్నర్ అరుదైన ఘనత

IPL 2019: Sunrisers Hyderabad Won By 6 Wickets On Chennai Super Kings | Match Highlights

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‎లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 (10 ఫోర్లు), జానీ బెయిర్ స్టో 44 బంతుల్లో 61 (3 ఫోర్లు, 3 సిక్సులు) అజేయంగా నిలవడంతో చెన్నైపై అలవోక విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చెన్నై నిర్దేశించిన 133 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 (10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు ఈ మైలురాయిని అందుకోవడానికి వార్నర్‌కి 21 పరుగుల దూరంలో ఉన్నాడు.

ముఖ్యంగా పవర్‌ప్లేలో డేవిడ్ వార్నర్‌ దూకుడుగా ఆడాడు. చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 66 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్... దీపక్ చాహర్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

1
45909

అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌ (3), విజయ్ శంకర్‌ (7) మాత్రం నిరాశపరిచారు. మరోవైపు దీపక్‌ హుడా 16 బంతుల్లో 13 ఫరవాలేదనిపించాడు. వార్నర్ ఔటైనప్పటికీ.. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో 44 బంతుల్లో 61 మాత్రం చివరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు.


ఉప్పల్‌లో సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 133

అంతకముందు ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 45 (3 ఫోర్లు, 3 సిక్సులు) రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 45 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దీంతో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 133 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు డుప్లెసిస్‌ (45), వాట్సన్‌ (31) శుభారంభం అందించినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (13), రాయుడు(25), జాదవ్(1), జడేజా(10) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ఖాన్‌ రెండు, విజయ్‌శంకర్‌, షాబాజ్‌ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌ తలో వికెట్ తీశారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధోని లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. ధోనికి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో సురేశ్ రైనాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పులు చేసింది. ధోని స్థానంలో శామ్ బిల్లింగ్స్‌ని, మిచెల్ శాంట్నర్ స్థానంలో కర్న్ శర్మని తుది జట్టులోకి తీసుకుంది.

ఇక సన్‌రైజర్స్ కూడా మార్పులు చేసింది. రికీ భుయ్, అభిషేక్ శర్మల స్థానంలో యుసుఫ్ పఠాన్, షాబాజ్ నదీమ్‌లను జట్టులోకి తీసుకుంది. చివరగా 2010లో ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే... సీఎస్‌కే తరుపున 121 మ్యాచ్‌లు ఆడిన ధోనికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 17, 2019, 23:38 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X