న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలింగే వారి బలం, ఆ వ్యూహాలు నన్నెంతో ఆకట్టుకుంటాయి: సన్‌రైజర్స్‌పై కుంబ్లే

IPL 2019: SRH’s Ploy Of Backing Their Bowling Has Impressed Anil Kumble | Oneindia Telugu
IPL 2019: SRH’s ploy of backing their bowling has impressed Anil Kumble

హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌లో అనుసరించే వ్యూహాలు తననెంతో ఆకట్టుకున్నాయని భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. ఐపీఎల్‌లో మిగతా జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫేవరెట్ హోదా లేకపోయినా.. నిలకడైన విజయాలు సాధించడంలో ముందుంటుంది. తక్కువ స్కోరు మ్యాచ్‌లనూ కాపాడుకోవడంలో దిట్ట.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ నేపథ్యంలో కుంబ్లే మాట్లాడుతూ "బౌలర్లను తెలివిగా ఉపయోగించుకోవడంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను మించిన జట్టు లేదు. వారి ప్రధాన బౌలర్లను కాపాడుకుంటూ అవసరమైన సమయంలో వారిని ఉపయోగించుకునే తీరు నన్నెంతో ఆకట్టుకుంది. ఆ జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. మళ్లీ వేలానికి వచ్చినా.. సన్‌రైజర్స్‌ తన బ్యాటింగ్‌పై కాకుండా బౌలింగ్‌పైనే దృష్టి సారిస్తుందని భావిస్తున్నా" అని అన్నాడు.

టీ20ల్లో బౌలింగ్‌ చాలా కీలకం

టీ20ల్లో బౌలింగ్‌ చాలా కీలకం

"ఎందుకంటే టీ20ల్లో బౌలింగ్‌ చాలా కీలకం. వీలైనంత మంది బ్యాకప్‌ బౌలర్లు ఉంటే ఆ జట్టుకు ఎంతో లాభం. అయితే, టీ20ల్లో బౌలర్లకు రాణించడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. వారికి లభించే నాలుగు అంతకంటే తక్కువ ఓవర్లలోనే వాళ్లు సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ విషయంలో సన్‌రైజర్స్‌ బౌలర్లది ముందంజలో ఉన్నారు" అని కుంబ్లే అన్నాడు.

స్టార్ ప్లేయర్లు లేకపోయినా

స్టార్ ప్లేయర్లు లేకపోయినా

నిజానికి స్టార్ ప్లేయర్లు లేకపోయినా... జట్టులో ఉన్న వాళ్లే అద్భుతాలు చేస్తారు. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టినప్పట్నించీ సన్‌రైజర్స్ బలం, బలగం మొత్తం బౌలింగే. టోర్నీలోని మిగతా జట్లతో పోలిస్తే బౌలింగ్‌తో పోలిస్తే టాప్-3లో కచ్చితంగా ఉంటుంది. భువీ సారథ్యంలో పేస్ అటాక్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. ముఖ్యంగా యువ బౌలర్లు ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్.. భువీకి చక్కని సహకారం అందిస్తున్నారు.

సంచలనాలు నమోదు

ఈ ముగ్గురూ కలిసి చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలాంటి జట్లపై సంచలనాలు నమోదు చేశారు. సన్‌రైజర్స్ విజయాల్లో స్పిన్నర్ల పాత్ర కూడా మరువలేనిది. ఆప్ఘన్ స్పిన్ సంచనలం రషీద్ ఖాన్ జట్టుకు ఓ తురుపు ముక్క లాంటివాడు. ప్రత్యర్థి వేదికల్లోనే ఆయా జట్లను చిత్తుగా ఓడించడంలో ఇతని పాత్ర ఎంతో కీలకం. బంగ్లా ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ కూడా తక్కువేమీ కాదు.

సన్‌రైజర్స్ జట్టు సమతూకంతో

వికెట్లు తీయడంతో పాటు పరుగులు నిరోధించడంలో షకీబుల్ హసన్ దిట్ట. దీంతో పాటు సన్‌రైజర్స్ జట్టు సమతూకంతో ఉంటుంది. ఆల్‌రౌండర్లు విజయ్ శంకర్, దీపక్ హుడా, యూసుఫ్ పఠాన్‌ను బౌలింగ్‌లో ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మే30న ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో వార్నర్, మనీష్ పాండే, విజయ్ శంకర్‌లాంటి ఆటగాళ్లకు ఇదో గొప్ప అవకాశం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), వార్నర్, అభిషేక్ శర్మ, ఖలీల్ అహ్మద్, జానీ బెయిర్‌స్టో, బాసిల్ థంపీ, రికీ భుయ్, శ్రీవాస్త గోస్వామి, మార్టిన్ గుప్తిల్, దీపక్ హుడా, సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్, మహ్మద్ నబీ, షాబాజ్ నదీమ్, నటరాజన్, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, వృద్ధిమాన్ సాహా, సందీప్ శర్మ, విజయ్ శంకర్, షకీబ్ ఉల్ హాసన్, బిల్లీ స్టాన్‌లేక్.

Story first published: Friday, March 22, 2019, 13:19 [IST]
Other articles published on Mar 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X