న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో 18వ హ్యాట్రిక్ తీసిన ఆటగాడిగా శామ్ కర్రన్ రికార్డు (వీడియో)

 IPL 2019: Sam Curran records 18th hat-trick in IPL history

హైదరాబాద్: మొహాలి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్ రౌండర్ శామ్ కర్రన్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శామ్ కర్రన్ ఖాతాలో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్ జట్టు తరుపున ఆడిన సమయంలో రోహిత్‌ శర్మ హ్యాట్రిక్‌ తీశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రోహిత్ శర్మ వయసు 22 ఏళ్ల 6 రోజులు

రోహిత్ శర్మ వయసు 22 ఏళ్ల 6 రోజులు

అప్పుడు రోహిత్ శర్మ వయసు 22 ఏళ్ల 6 రోజులు. తాజాగా శామ్ కర్రన్ 20 ఏళ్ల 302 రోజుల వయసులోనే హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. అంతేకాదు ఐపీఎల్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన 18వ ఆటగాడిగా శామ్ కర్రన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో శామ్ కర్రన్‌ను పంజాబ్ యాజమాన్యం రూ. 7.20 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది.

గాయం కారణంగా దూరమైన క్రిస్ గేల్

గాయం కారణంగా దూరమైన క్రిస్ గేల్

సోమవారం మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా దూరమైన క్రిస్ గేల్ స్థానంలో చోటు దక్కించుకున్న శామ్ కర్రన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 2.2 ఓవర్లు వేసిన శామ్ కర్రన్ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా... చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి.

రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన శామ్ కర్రన్

ఈ దశలో ఆఖరి ఓవర్ వేసిన శామ్ కుర్రన్ వరుసగా రెండు బంతుల్లో కగిసో రబడ, సందీప్ లామిఛానేలను పెవిలియన్‌కు చేర్చాడు. తొలి బంతిని యార్కర్‌గా సంధించగా రబాడ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాతి బంతికి లమిచానే కూడా బౌల్డయ్యాడు. అప్పటివరకు గెలుస్తామనే ధీమాతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ శామ్ కర్రన్ దెబ్బకు ఓడిపోయింది.

ఐపీఎల్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు

ఐపీఎల్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు

1. Laxmipathy Balaji (CSK) vs Kings XI Punjab - 2008

2. Amit Mishra (DD) vs Deccan Chargers - 2008

3. Makhaya Ntini (CSK) vs Kolkata Knight Riders - 2008

4. Yuvraj Singh (KXIP) vs Royal Challengers Bangalore - 2009

5. Rohit Sharma (DC) vs Mumbai Indians - 2009

6. Yuvraj Singh (KXIP) vs Deccan Chargers - 2009

7. Praveen Kumar (RCB) vs Rajasthan Royals - 2010

8. Amit Mishra (DC) vs Kings XI Punjab - 2011

9. Ajit Chandila (RR) vs Pune Warriors India - 2012

10. Sunil Narine (KKR) vs Kings XI Punjab - 2013

11. Amit Mishra (SRH) vs Pune Warriors India - 2013

12. Pravin Tambe (RR) vs Kolkata Knight Riders - 2014

13. Shane Watson (RR) vs Sunrisers Hyderabad - 2014

14. Axar Patel (KXIP) vs Gujarat Lions - 2016

15. Samuel Badree (RCB) vs Mumbai Indians - 2017

16. Andrew Tye (GL) vs Rising Pune Supergiants - 2017

17. Jaydev Unadkat (RPS) vs Sunrisers Hyderabad - 2017

18. Sam Curran (KXIP) vs Delhi Capitals - 2019*

Story first published: Tuesday, April 2, 2019, 14:20 [IST]
Other articles published on Apr 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X