న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: రిషబ్ పంత్ భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణం: యువీ

IPL 2019 : Risabh Pant Is An Outstanding Talent Batsmen For India, Says Yuvraj Singh
IPL 2019: Rishabh Pant is the next big thing in Indian Cricket, important to groom him, opines Yuvraj Singh

హైదరాబాద్: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణమని ముంబై ఇండియన్స్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అన్నారు. ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ 27 బంతుల్లో 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్ మాట్లాడుతూ పంత్‌లో అద్భుత ప్రతిభ దాగుందని.. తనికి సరైన అవకాశాలు కల్పిస్తే భారత క్రికెట్‌కు ఫ్యూచర్‌లో స్టార్ అవుతాడని చెప్పుకొచ్చారు. "రిషబ్ పంత్‌లో అద్భుత ప్రతిభ దాగుంది. ఎదిగేందుకు సరైన అవకాశాలిస్తే అతడు భారత క్రికెట్‌కు ఫ్యూచర్‌ స్టార్‌ అవుతాడు" అని యువీ అన్నారు.

పంత్ వరల్డ్ కప్ ఎంపికపై

పంత్ వరల్డ్ కప్ ఎంపికపై

వరల్డ్‌కప్ ఎంపిక గురించి తాను చెప్పలేనని, కానీ పంత్‌ ప్రస్తుత ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉందని యువీ అభిప్రాయపడ్డాడు. 21 ఏళ్ళ వయసులోనే విదేశాల్లో రెండు సెంచరీలు నమోదు చేయటం అతని సూపర్ టాలెంట్‌కి నిదర్శనమని యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ముంబై ఓటమిపై యువీ మాట్లాడుతూ

ముంబై ఓటమిపై యువీ మాట్లాడుతూ

ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమిపై యువీ మాట్లాడుతూ "రోహిత్‌ శర్మ త్వరగా ఔటవడం తమ అవకాశాల్ని దెబ్బతీసింది. డికాక్‌, పొలార్డ్‌లు తమకు లభించిన ఆరంభాల్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. సరైన భాగస్వామ్యాల్ని నెలకొల్పలేకపోవడంతో 215 పరుగల భారీ స్కోరును చేధించడం తమకు కష్టమైపోయింది" అని అన్నాడు.

హాఫ్ సెంచరీతో రాణించిన యువీ

214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) నిరాశపరిచాడు. ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డికాక్ (27) కూడా ఔటడంతో ముంబై 45/3తో కష్టాల్లో పడింది.

37 పరుగుల తేడాతో ఓడిన ముంబై

ఈ క్రమంలో వెటరన్‌ ఆటగాళ్లు యువరాజ్‌, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్య (0) కూడా ఔటవడంతో మ్యాచ్‌పై ముంబయి పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసి 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Monday, March 25, 2019, 16:42 [IST]
Other articles published on Mar 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X