న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమి.. ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం

IPL 2019, RCB vs SRH: Hetmyer-Manns 144-run stand helps RCB beat SRH by 4 wickets

ఐపీఎల్‌ సీజన్‌-12 చివరి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అద్భుతంగా ఆడి లీగ్‌ను విజయంతో ముగించింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసింది. సన్‌రైజర్స్‌ చేతులారా ఉన్న చివరి అవకాశాన్ని వదులుకుంది. సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్‌ చేరేది. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో.. ఈ రోజు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓడితేనే హైదరాబాద్‌ మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ముంబైపై కోల్‌కతా గెలిస్తే హైదరాబాద్‌ టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.

ఆరంభంలోనే షాక్:

ఆరంభంలోనే షాక్:

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే భువీ బౌలింగ్‌లో పార్థివ్‌ (0) డకౌటయ్యాడు. రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌ బాదిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (7 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్‌)ని ఖలీల్‌ అహ్మద్‌ ఔట్‌ చేశాడు. డివిలియర్స్‌ (1) మూడో ఓవర్లో భువికి చిక్కాడు. బెంగళూరు 20 పరుగులకే కీలకమైన 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న హెట్‌మయర్‌, గుర్‌కీరత్‌ సింగ్‌:

ఆదుకున్న హెట్‌మయర్‌, గుర్‌కీరత్‌ సింగ్‌:

ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెట్‌మయర్‌ (75; 47 బంతుల్లో 4×4, 6×6), గుర్‌కీరత్‌ సింగ్‌ (65; 48 బంతుల్లో 8×4, 1×6) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. బౌండరీల మోత మోగిస్తూ స్కోరు వేగం పెంచారు. మరోవైపు హైదరాబాద్ ఫీల్డర్లు చేతికొచ్చిన క్యాచ్‌ల్ని వదిలేశారు. ఇది వాళ్ళు సద్వినియోగం చేసుకుని మరింత రెచ్చిపోయారు. ఇక 24 బంతుల్లో 30 పరుగులే కావాలి. ఈ దశలో హెట్‌మైర్, గురుకీరత్, సుందర్‌ (0) ఔటవ్వడంతో హైదరాబాద్ ఆటగాళ్లలో ఆశలు చిగురించాయి. కానీ చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయల్సి ఉండగా.. ఉమేశ్‌ (4 బంతుల్లో 9 నాటౌట్‌; 2 ఫోర్లు) వరుసగా 2 ఫోర్లు బాది బెంగళూరుకు విజయాన్ని అందించాడు.

విలియమ్సన్‌ దూకుడు:

విలియమ్సన్‌ దూకుడు:

మొదటగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సాహా (20), గప్తిల్‌ (30) మంచి ఆరంభమే ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్‌ మధ్యలో సన్‌రైజర్స్‌ తడబడింది. గప్తిల్‌, పాండే (9)లను సుందర్‌ (3/24) ఒక్క పరుగు వ్యవధిలో ఔట్‌ చేయడంతో.. 62పరుగులకే సన్‌రైజర్స్‌ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విజయ్‌ శంకర్‌ (27)తో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మూడు సిక్సర్లు బాది ఊపుమీద కనిపించిన శంకర్‌ ఔటైనప్పటికీ విలియమ్సన్‌ దూకుడు కొనసాగించాడు. మరోవైపు యూసుఫ్‌ పఠాన్‌ (3), నబి (4), రషీద్‌ ఖాన్‌ (1)లు త్వరగానే పెవిలియన్‌ చేరారు. విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో ఏకంగా 28 పరుగులు బాదడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. హెట్‌మైర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Sunday, May 5, 2019, 8:05 [IST]
Other articles published on May 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X