న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెంగళూరుపై విజయం.. ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2019 : Kolkata Knight Riders Defeat Mumbai Indians By 34 Runs, Keep Playoffs Hope Alive
IPL 2019, RCB vs DC: Delhi Capitals first time since 2012 to reach play offs

ఫెరోజ్ షా కోట్లా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో ఢిల్లీ 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరింది. ఢిల్లీ జట్టు 2012 తర్వాత మళ్లీ ఇప్పుడు ఫ్లేఆఫ్స్‌కు చేరుకుంది. డిల్లీ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో ఎనిమిది విజయాలు సాధించింది. మరోవైపు బెంగళూరు ఆడిన 12 మ్యాచుల్లో ఎనిమిది ఓటములతో ప్లేఆఫ్‌ అవకాశాలను దాదాపు కోల్పోయింది.

పార్థీవ్ మెరుపులు:

పార్థీవ్ మెరుపులు:

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు పార్థీవ్ పటేల్, విరాట్ కోహ్లీలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా పార్థీవ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించింది. అయితే రబడా వేసిన 6వ ఓవర్ ఐదో బంతికి పార్థీవ్ 39(20 బంతుల్లో 7x4, 1x6) అవుట్ అయ్యాడు. అనంతరం అక్షర్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి కోహ్లీ 23(17 బంతుల్లో 2x4, 1x6) కూడా పెవిలియన్ చేరాడు.

స్టోనిస్ విఫలం:

స్టోనిస్ విఫలం:

కష్టాల్లో పడ్డ బెంగళూరును డివిలియర్స్, దూబేలు ఆదుకున్నారు. ధాటిగా ఆడే క్రమంలో రూతర్‌ ఫోర్డ్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి డివిలియర్స్ (17) వెనుదిరిగాడు. ఆ వెంటనే క్లాసెన్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో గుర్‌కీరత్, స్టోనిస్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. గుర్‌కీరత్ ధాటిగా ఆడినా.. స్టోనిస్ మాత్రం బ్యాట్ జులిపించలేకపోయాడు. మరోవైపు ఇన్నింగ్స్ చివరలో ఢిల్లీ బౌలర్లు రబాడా, ఇషాంత్ కట్టుదిట్టంగా బంతులేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఓడిపోయింది.

ధావన్‌, అయ్యర్‌ల అర్ధ శతకాలు:

ధావన్‌, అయ్యర్‌ల అర్ధ శతకాలు:

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్ పృథ్వీషా (18) త్వరగానే ఔటైనా.. మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌(50; 37 బంతుల్లో 5 x4, 2x6), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (52; 37 బంతుల్లో 2x4, 3x6) అర్ధ శతకాలు చేసి పెవిలియన్ చేరారు. అనంతరం పంత్‌ (7), కొలిన్‌ ఇంగ్రామ్‌(11) నిరాశపరిచినా.. ఇన్నింగ్స్ చివరలో రూథర్‌ ఫోర్డ్‌(28; 13 బంతుల్లో 1x4, 3x6), అక్షర్‌ పటేల్‌ (16; 9 బంతుల్లో 3x4) మెరుపు బ్యాటింగ్‌ చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు తీసాడు.

Story first published: Sunday, April 28, 2019, 21:04 [IST]
Other articles published on Apr 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X