న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీ గ్రేట్ లైనప్ పేపర్‌కే పరిమితం: విజయ్ మాల్యా వ్యంగ్యం

IPL 2019 : Royal Challengers Bangalore Is A Great Lineup But Only On The Paper, Says Vijay Mallya
IPL 2019: RCB is a great lineup but only on the paper, says Vijay Mallya

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి గ్రేట్ లైనప్ ఉందని, అది కేవలం పేపర్‌కే పరిమితమని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చెప్పుకొచ్చాడు. 2008లో బెంగళూరు సిటీలో నిర్వహించిన వేలంలో విజయ్ మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఐపీఎల్ కమిటీ ముందుకొచ్చాడు. తన ప్రాంఛైజీకి చాలా అద్భుతంగా ఉన్న పేరుని సైతం పెట్టాడు. అయితే, ఆరంభ సీజన్‌లో ఆర్సీబీ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఆ జట్టు కేవలం రెండు సార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ... ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్‌లో ఆర్సీబీ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంవత్సరం ఏదైనా ఉందంటే అది 2016. ఆ సీజన్‌లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేయడంతో పాటు జట్టుని ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, పైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఆర్సీబీని ఓడించి సన్‌రైజర్స్ తొలిసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది.

ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2017లో 8, 2018లో 6, 2019లో 8వ స్థానంలో నిలిచింది. భారత్‌లో బ్యాంకులకు పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టి ప్రస్తుతం లండన్‌లో ఉంటోన్న ఆ జట్టు మాజీ యజమాని మాత్రం ఆ జట్టుపై ఉన్న తన ప్రేమను మరిచిపోలేకపోతున్నాడు.

విజయ మాల్యాను ఓ ప్రాడ్‌గా బ్యాంకులు ప్రకటించడంతో ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అతడికి జట్టుతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకునేలా చేసింది. దీంతో పాటు తన ఎఫ్1 టీమ్ అయిన ఫోర్స్ ఇండియా సైతం విజయ్ మాల్యా చేతి నుంచి చేజారింది. ఒకానొక సమయంలో భారత్‌లో గోల్డెన్ లిక్కర్ బాయ్‌గా పేరొందిన విజయ్ మాల్యా ఆ తర్వాత తన వ్యాపారాలు దివాళా తీయడంతో లండన్‌కు పారిపోయాడు.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో ఆర్సీబీ పాయింట్ల పట్టకిలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం తన ట్విట్టర్‌లో "మాపై చూపించిన ప్రేమ, మద్దతకు ధన్యవాదాలు. మొత్తం జట్టుతో పాటు అభిమానులు, గ్రౌండ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్! వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్‌గా వస్తాం" అంటూ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

ఈ ట్వీట్‌పై విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించాడు. తన ట్విట్టర్‌లో "ఆర్సీబీ ఎప్పుడూ గ్రేట్ లైనప్‌ని కలిగి ఉంది. ఇక్కడ చింతించాల్సిన విషయం ఏంటంటే అది పేపర్‌పైనే. చెక్క స్పూన్ నాశనమైంది" అంటూ కామెంట్ పోస్టు చేశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ చెత్త ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో పంజాబ్‌తో మొదటి విజయాన్ని అందుకోవడానికి ముందు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది.

Story first published: Monday, May 6, 2019, 17:39 [IST]
Other articles published on May 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X