న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్‌పై విజయం రాజస్థాన్‌ విజయం.. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం

IPL 2019: Rajasthan won by 7 wkts and keep playoff hopes alive

టోర్నీలో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బంతితో ఉనద్కత్‌.. ఛేదనలో సంజు శాంసన్‌, లివింగ్‌స్టోన్‌లు అదరగోట్టారు. దీంతో టోర్నీలో రాజస్థాన్‌ ఐదో విజయంను ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరోవైపు సన్‌రైజర్స్‌ ఓడిపోయి ప్లే ఆఫ్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

లివింగ్‌స్టోన్‌ మెరుపులు:

లివింగ్‌స్టోన్‌ మెరుపులు:

161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు లివింగ్‌స్టోన్‌, రహానెలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 2 ఓవర్లలో 8 పరుగులు చేశారు. భువీ వేసిన మూడో ఓవర్లో రహానే 2 బౌండరీలు బాదాడు. స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ వేసిన 4వ ఓవర్లో రహానే, లివింగ్‌స్టోన్‌లు చెరో సిక్సర్‌ కొట్టారు. సిద్ధార్థ్‌ కౌల్ వేసిన ఆరో ఓవర్లో లివింగ్‌స్టోన్‌ 4, 0, 6, 0, 4, 6తో 20 పరుగులు రాబట్టాడు. దీంతో 6 ఓవర్లలోనే 60 పరుగులు చేసి రాజస్థాన్‌ మంచి స్థితిలో నిలిచింది.

మెరిసిన శాంసన్‌:

మెరిసిన శాంసన్‌:

రషీద్‌ వేసిన పదో ఓవర్లో లివింగ్‌స్టోన్‌ (44; 26 బంతుల్లో 4×4, 3×6) అవుట్ అయ్యాడు. అనంతరం రహానే (39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) షకీబ్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఈ సమయంలో క్రిజులోకి వచ్చిన సంజు శాంసన్‌, స్టీవెన్‌ స్మిత్‌లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రాజస్థాన్‌ను లక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే ఖలీల్‌ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన స్మిత్‌ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు) సిద్ధార్థ్‌ కౌల్‌ చేతికి చిక్కాడు. అప్పటికి రాయల్స్‌ విజయానికి 13 పరుగులు చేయాలి. మిగతా లాంఛనాన్నిటర్నర్‌ (3)తో కలిసి శాంసన్‌ (48 నాటౌట్‌; 32 బంతుల్లో 4×4, 1×6) పూర్తి చేశాడు. 19.1 ఓవర్లలో లక్షాన్ని అందుకుని రాజస్థాన్‌ పాంట్లను మెరుగుపరుచుకుంది.

పాండే అర్ధ శతకం:

పాండే అర్ధ శతకం:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లు ఉనద్కత్‌ (2/26), థామస్‌ (2/28), శ్రేయస్‌ గోపాల్‌ (2/30)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్‌ ఆటగాళ్ళు ధాటిగా పరుగులు చేయలేకపోయారు. మనీష్‌ పాండే (61; 36 బంతుల్లో 9×4) అర్ధ శతకం చేసాడు. వార్నర్‌ (37) ధాటిగా ఆడలేకపోయాడు. ఇన్నింగ్స్ చివరలో వరుస వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ సాధారణ పరుగులకే పరిమితమైంది.

Story first published: Sunday, April 28, 2019, 9:33 [IST]
Other articles published on Apr 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X