న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: తొలి క్వాలిఫయిర్‌లో షేన్ వాట్సన్ చెత్త రికార్డు

IPL 2019,Qualifier 1 : Shane Watson Worst Record In Power Play || Oneindia Telugu
Watson

హైదరాబాద్: చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయిర్ 1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు కోల్పోయిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయంది. దీంతో ఈ సీజన్‌లో మొత్తం కలిపి పవర్‌ప్లేలో 29 వికెట్లు కోల్పోయింది. దీంతో పాటు చెన్నై ఆటగాడు షేన్ వాట్సన్‌ కూడా మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో సీజన్‌లో పవర్‌ప్లేలో ఎక్కువసార్లు ఔట్ అయిన ఆటగాడిగా వాట్సన్‌ రికార్డు సాధించాడు.

1
45946

ఐపీఎల్ 12వ సీజన్‌‌లో షేన్ వాట్సన్ పవర్‌ప్లేలో 11సార్లు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌ విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పులతో బరిలోకి దిగాయి.

చెన్నై జట్టులోకి కేదార్ జాదవ్ స్థానంలో మురళీ విజయ్, ముంబై జట్టులోకి మెక్లన్‌గన్ స్థానంలో జయంత్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్లు 14 పాయింట్లు సాధించినప్పటికీ... రన్ రేట్ విషయంలో మాత్రం ముంబై ఇండియన్స్ మెరుగ్గా ఉంది.

దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు ఇరు జట్లు 7 మ్యాచ్‌లాడగా ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచ్‌ల్లో నెగ్గింది.

Story first published: Tuesday, May 7, 2019, 21:14 [IST]
Other articles published on May 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X