న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిబంధన తీసేయండి: Zinger bails ఘటనపై మైకేల్ వాన్ ట్వీట్

IPL 2019: Michael Vaughan comes up with a suggestion to solve Zinger bails woes

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో గత కొన్ని రోజులుగా Zinger bails సమస్య బౌలర్లను ఇబ్బంది పెడుతోంది. "బంతి వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్‌ కింద పడితేనే బ్యాట్స్‌మన్‌ ఔట్" అనే నిబంధనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మండిపడుతున్నాడు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇలాంటి సంఘటనలు మూడు సార్లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధన తొలిగిస్తే మంచిదని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

Zinger bails ఘటనపై

ఆదివారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ Zinger bails ఘటన జరగడంతో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ స్పందించాడు. "నిబంధన మారిస్తే మంచింది... బౌలర్‌ వేసిన బంతి బ్యాట్స్‌మన్‌ను తప్పించుకుంటూ వికెట్‌ను తాకింది. అయితే కేవలం బెయిల్స్‌ పడనంత మాత్రానా బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కాదని ఆనడం నిజంగా హాస్యాస్పదం. ఈ నిబంధన తీసేస్తేనే క్రికెట్‌కు మంచిది" అని ట్వీట్ చేశాడు. ఈ నిబంధన వల్ల ఈ సీజన్‌లో ఎక్కువగా నష్టపోయిన జట్టుగా రాజస్థాన్ నిలిచింది.

క్రిస్ లిన్‌పై లైఫ్

క్రిస్ లిన్‌పై లైఫ్

టోర్నీలో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 140 పరుగుల లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ వేసేందుకు ధావల్ కులకర్ణి బౌలింగ్‌కు వచ్చాడు. ధావల్ కులకర్ణి వేసిన రెండో బంతి బ్యాట్‌కు ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకొని స్టంప్స్‌ను తాకింది. బంతి స్టంప్స్‌ను తాకినా బెయిల్స్ కిందపడలేదు. బంతి వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు. దీంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ సమయంలో క్రిస్‌లిన్‌ కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. తనకు లభించిన లైఫ్‌తో క్రిస్ లిన్ చెలరేగాడు. హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ధోనికి సైతం

జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ధోనికి సైతం

ఇక, మార్చి 31న చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా Zinger bails ఘటన చోటు చేసుకుంది. ధోని మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో బంతి ధోని పాదాలకు తాకి వికెట్‌ను తాకింది. కానీ బెయిల్స్‌ మాత్రం కింద పడలేదు. దీంతో అంఫైర్ ధోనిని నాటౌట్‌గా ప్రకటించాడు.

ధోని కొట్టిన బంతి వికెట్లకు తాకినప్పటికి

ధోని కొట్టిన బంతి వికెట్లకు తాకినప్పటికి

అంతకముందు కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని కొట్టిన బంతి వికెట్లకు తాకినప్పటికి బెయిల్స్‌ కిందపడలేదు. దీంతో కేఎల్‌ రాహుల్‌కు లైఫ్‌ లభించింది. ఐపీఎల్‌లో చోటు చేసుకుంటున్న ఈ Zinger bails ఘటనలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Monday, April 8, 2019, 18:51 [IST]
Other articles published on Apr 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X