న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వర్షంతో మ్యాచ్‌ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింటు

IPL 2019: Match called off due to rain; Bangalore, Rajasthan settle for a draw

ఐపీఎల్‌ 12లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్ల చెరో పాయింటు లభించింది. ఐపీఎల్‌లో అందరి కంటే ముందే రేసు నుంచి బెంగళూరు జట్టు తప్పుకోవడంతో.. ఆ జట్టుకు వర్షం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో.. మ్యాచ్‌ రద్దవడంతో రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ మిలిగిలిన ఒక మ్యాచ్‌లలో గెలిచినా 13 పాయింట్లు అవుతాయి. 13 పాయింట్లతో ప్లేఆఫ్‌ చేరడం అసాధ్యం. దీంతో రాజస్తాన్‌ 'ప్లేఆఫ్‌' ఆశలు దాదాపుగా కొట్టుకుపోయినట్టే.

ఐదు ఓవర్లకు కుదింపు:

ఐదు ఓవర్లకు కుదింపు:

మంగళవారం రాత్రి 7:30 గంటలకు టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ కెప్టెన్‌ స్మిత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ అనంతరం స్టేడియంలో వర్షం కురిసింది. వర్షం పూర్తిగా తగ్గాక అంపైర్లు పలుమార్లు పిచ్‌ను, ఔట్‌ ఫీల్డ్‌ను పరిశీలించారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు.

గోపాల్‌ హ్యాట్రిక్‌:

గోపాల్‌ హ్యాట్రిక్‌:

మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు 5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (25; 7 బంతుల్లో 1×4, 3×6) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఏబీ డివిలియర్స్‌ (10; 4 బంతుల్లో 2×4) ఆకట్టుకున్నాడు. ఈ జంట తొలి ఓవర్లోనే 23 పరుగులు చేశారు. రెండో ఓవర్‌ వేసిన రాజస్థాన్‌ బౌలర్‌ శ్రేయాస్‌ గోపాల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. చివరి మూడు బంతుల్లో కోహ్లీ, డివిలియర్స్‌, మార్కస్‌ స్టొయినిస్‌ (0)లను ఔట్‌ చేశాడు. అనంతరం వచ్చిన ఆటగాళ్లు వేగంగా ఆడే క్రమంలో త్వరత్వరగా పెవిలియన్ చేరారు.

మళ్లీ వర్షం.. మ్యాచ్‌ రద్దు:

మళ్లీ వర్షం.. మ్యాచ్‌ రద్దు:

అనంతరం 63 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 3.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మళ్లీ పడడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. రాజస్థాన్‌ ఓపెనర్ సంజు శాంసన్‌ (28: 13 బంతుల్లో 2×4, 3×6) చెలరేగాడు. మరో ఓపెనర్ లివింగ్‌ స్టన్‌ (11 నాటౌట్‌: 7 బంతుల్లో 1×4, 1×6) రాణించాడు. మ్యాచ్ మొత్తం జరిగిగుంటే రాజస్థాన్‌కు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే రాజస్థాన్‌ ప్లేఆఫ్‌ అవకాశాలను వర్షం దూరం చేసినట్టే.

Story first published: Wednesday, May 1, 2019, 9:54 [IST]
Other articles published on May 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X