న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KXIP: అరుదైన రికార్డుకి చేరువలో రషీద్, సన్‌రైజర్స్ గెలిచి నిలిచేనా?

IPL 2019 : Rashid khan Ahead Of Rare Record In IPL || Oneindia Telugu
IPL 2019: Match 48, SRH vs KXIP - All the important stats for tonight’s game

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు పదకొండు మ్యాచ్‌లాడి చెరో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌ని కలిగి ఉండటంతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా... పంజాబ్ మాత్రం ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో SRH vs KXIP గణాంకాలను ఒక్కసారి పరిశీద్దాం...

ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ మెరుగైన రికార్డు

ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ మెరుగైన రికార్డు

ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా... ఐదు సార్లు సన్‌రైజర్స్‌ విజయం సాధించింది.

ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ సన్‌రైజర్స్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్ వద్ద ఉంది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ (611 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుపై వార్నర్ తొమ్మిది హాఫ్ సెంచరీలు సాధించాడు.

గెలిచి నిలిచేనా?

గెలిచి నిలిచేనా?

పంజాబ్ జట్టుపై సన్‌రైజర్స్ పేస్ బౌలర్ భువనేశ్వర్ 16.14 యావరేజితో మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, క్రిస్ గేల్‌ను త్వరగా ఔట్ చేస్తే సన్‌రైజర్స్‌దే విజయం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ యావరేజి 45.75గా ఉంది. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌పై 5 మ్యాచ్‌లాడిన కేఎల్ రాహుల్ 183 పరుగులు చేశాడు. కాబట్టి, ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విజృంభించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

అరుదైన రికార్డుకి చేరువలో రషీద్

అరుదైన రికార్డుకి చేరువలో రషీద్

గత రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి ఈ సీజన్‌లో మనీష్ పాండే ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు పంజాబ్ జట్టుపై 34.54 యావరేజితో మనీష్ పాండే 485 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఒక వికెట్ తీస్తే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 50 వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ (104 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తాడు.

సన్‌రైజర్స్‌పై మెరుగైన రికార్డు లేని క్రిస్ గేల్

సన్‌రైజర్స్‌పై మెరుగైన రికార్డు లేని క్రిస్ గేల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై క్రిస్ గేల్‌కు మెరుగైన రికార్డు లేకపోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా సందీప్ శర్మ బౌలింగ్‌లో క్రిస్ గేల్ ఎక్కువసార్లు ఔటయ్యాడు. సన్‌రైజర్స్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో క్రిస్ గేల్‌ను నాలుగు సార్లు సందీప్ శర్మనే ఔట్ చేయడం విశేషం.

Story first published: Monday, April 29, 2019, 17:10 [IST]
Other articles published on Apr 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X