న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: కోల్‌కతా vs రాజస్థాన్ మ్యాచ్‌లో నమోదైన రికార్డులివే!

Rajasthan Royals finally ended their Eden Gardens spell defeating the Kolkata Knight Riders by three wickets on Thursday. The struggling KKR team got off to a poor start scoring only 49/3 after ten overs due to some brilliant piece of bowling from Varun Aaron. However, skipper Dinesh Karthik powered the team to 175/6 scoring an unbeaten 97 from only 50 deliveries. The KKR spinners kept striking in the middle-overs but short partnerships took the Royals over the finishing line.

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కేకేఆర్ నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించి విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మరోవైపు కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం విశేషం. ఛేదనలో రాజస్థాన్‌ ఓపెనర్లు రహానే (34), సంజు శాంసన్‌ (22) చక్కటి శుభారంభం ఇచ్చారు. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద రహానే సునీల్ నరేన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికే సంజూ శాంసన్ కూడా పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 57 పరుగులకే రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌(2), బెన్‌స్టోక్స్‌ (11) వెంట వెంటనే ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ 31 బంతుల్లో 47 (5ఫోర్లు, 2సిక్సులు) స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు.

చివర్లో జోఫ్రా ఆర్చర్‌తో కలిసి రన్‌రేట్‌ను అదుపులోకి తీసుకొచ్చాడు. జట్టు స్కోరు 167 పరుగుల వద్ద హిట్‌వికెట్‌ రూపంలో రేయాన్ పరాగ్ వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి చివర్లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా జోఫ్రా 10 బంతుల్లో 17(ఫోర్, సిక్స్) బాది విజయాన్ని అందించాడు.

అంతకముందు కెప్టెన్ దినేశ్ కార్తీక్ 50 బంతుల్లో 97(7 ఫోర్లు, 9 సిక్సులు)తో సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

కోల్‌కతా vs రాజస్థాన్ మ్యాచ్‌ హైలెట్స్:

ఈడెన్‌లో రాజస్థాన్‌కు రెండో విజయం

ఈడెన్‌లో రాజస్థాన్‌కు రెండో విజయం

2 - ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలవడం ఇది రెండోసారి. అంతకముందు 2008లో ఇదే స్టేడియంలో కోల్‌‌కతాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2010 నుంచి 2018 వరకు ఈ స్డేడియంలో ఇరు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా కేకేఆర్ 6 సార్లు, రాజస్థాన్ ఒకసారి మాత్రమే విజయం సాధించింది.

4 - ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ఈ సీజన్‌కు ముందు అంటే గత సీజన్లలో ఈ వేదికలో వరుసగా రెండుకుమించి ఓడిన సందర్భాలు లేవు.

కేకేఆర్‌కు వరుసగా ఆరో ఓటమి

కేకేఆర్‌కు వరుసగా ఆరో ఓటమి

6 - ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం విశేషం. 2009 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ చెత్త రికార్డుని ఈ సీజన్‌లో అధిగమించేలా కనిపిస్తోంది.

97 నాటౌట్ - టీ20ల్లో దినేశ్ కార్తీక్‌కు ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాదు ఐపీఎల్‌లో ఓ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు సాధించిన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరుపున బ్రెండన్ మెక్‌కల్లమ్ 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

కేకేఆర్ కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు

కేకేఆర్ కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు

97 నాటౌట్ - దినేశ్ కార్తీక్ నమోదు చేసిన ఈ వ్యక్తిగత స్కోరు ఐపీఎల్‌లో ఓ కేకేఆర్ కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు కావడం విశేషం. 2012 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ చేసిన 93 పరుగులను దినేశ్ కార్తీక్ ఈ మ్యాచ్‌తో అధిగమించాడు.

2 - దినేశ్ కార్తీక్ నమోదు చేసిన 97 నాటౌట్... ఐపీఎల్‌లో ఓ వికెట్ కీపర్-కెప్టెన్ నమోదు చేసిన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2011 సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 106 పరుగులు నమోదు చేశాడు.

ఐపీఎల్‌లో 2000 పరుగులు చేసిన స్మిత్

ఐపీఎల్‌లో 2000 పరుగులు చేసిన స్మిత్

స్మిత్ @ 2000 - ఈ మ్యాచ్‌లో 2 పరుగులు చేయడంతో రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌లో 2000 పరుగులు సాధించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో రెండువేల పరుగులు చేసిన 31వ ఆటగాడు కాగా విదేశీ ఆటగాళ్లలో 12వ వాడు కావడం విశేషం. ఈ 12 మంది విదేశీ ఆటగాళ్లలో ఐదుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లే ఉండటం విశేషం.

Story first published: Friday, April 26, 2019, 17:41 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X