ఉప్పల్‌లో చేదు అనుభవం: చెన్నై సూపర్ కింగ్స్ జెండాకు అనుమతి లేదన్న సిబ్బంది

IPL 2019: CSK Flags, MS Dhoni Posters Not Allowed At Uppal Stadium | Oneindia Telugu

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్‌కి నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అయితే, ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఇందులో భాగంగా సీఎస్‌కేకి చెందిన పలువురు అభిమానులు సైతం స్టేడియానికి చేరుకున్నారు. చెన్నై అభిమానుల పట్ల స్టేడియం సిబ్బంది అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సీఎస్‌కే జెండాలతో పాటు ధోని ఫోటోలను స్టేడియం సిబ్బంది లోపలికి అనుమతించలేదు.

దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌కే జండాలను తీసుకున్న స్టేడియం సిబ్బంది వాటని పక్కకు విసిరేశారని ఓ అభిమాని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. మరోవైపు సన్‌రైజర్స్ జెండాలను మాత్రం యధావిధిగా స్టేడియంలోకి అనుమతిస్తున్నారు.

ఇదేంటని క్రికెట్ అభిమానులు అఢిగితే, తమకు ఉన్నతాధికారులు ఇలానే ఆదేశాలు ఇచ్చారని సిబ్బంది అంటున్నారు. ఇదే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్ల రూపంలో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ సీజన్‌లో సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింట మాత్రమే విజయం సాధించింది.

దీంతో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఏడింట విజయం సాధించింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక, సన్‌‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఇంకా ఐదు మ్యాచుల్లో విజయం సాధించాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 17, 2019, 19:27 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X