న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాధగా ఉంది: వరల్డ్‌కప్ కోసం ఇంగ్లాండ్‌కు పయనమైన అలీ

 IPL 2019: Leaving RCB for England duties ‘not ideal’, says all-rounder Moeen Ali

హైదరాబాద్: ఐపీఎల్ మధ్యలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును వదిలి వెళ్లడం చాలా బాధగా ఉందని ఆ జట్టు ఆల్‌ రౌండర్‌ మొయిన్‌ అలీ పేర్కొన్నాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతోన్న విదేశీ క్రికెటర్లు అందరూ తమ సొంత దేశాలకు పయనమయ్యారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో మొయిన్ అలీ సభ్యుడిగా ఉన్నాడు. దీంతో వరల్డ్ కప్ టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ మాట్లాడుతూ "బాధగా ఉంది. ఈ సీజన్‌లో మరో మూడు గేమ్‌లు ఉండగా జట్టుని వీడిచి వెళ్లాల్సి వస్తుంది" అని అన్నాడు.

ఆర్సీబీ మ్యాచ్‌లపై చూస్తుంటా

ఆర్సీబీ మ్యాచ్‌లపై చూస్తుంటా

"6 లేదా 7 గేమ్స్ ఉంటే అర్ధం చేసుకోగలం. ఈ సీజన్‌లో మా జట్టు ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాం. తప్పకుండా నేను ఆర్సీబీ ఆడే అన్ని మ్యాచ్‌ల్లో జట్టు ఎలా ఆడుతుందో చూస్తూనే ఉంటా. మిగతా మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గెలవాలని తప్పకుండా కోరుకుంటా" అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు.

ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్‌పై

ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్‌పై

ఐపీఎల్ నెట్స్‌‌లో ప్రాక్టీస్ వరల్డ్‌కప్‌కు సన్నద్ధమయ్యేందుకు గాను ఎంతగానో ఉపయోగపడిందని అలీ తెలిపాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్‌పై అలీ మాట్లాడుతూ "మా జట్టులో ఎక్కువగా కుడి, ఎడమ బ్యాట్స్‌మెన్‌ భాగస్వామ్యం విజయవంతమైంది. అయితే పరిస్థితులను బట్టి ఏస్థానంలో రావడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. బ్యాటింగ్‌కు రావడం, పరుగులు చేయడం వరకే నా బాధ్యత" అని అన్నాడు.

కోహ్లీ, డివిలియర్స్‌ కలిసి మ్యాచ్‌

కోహ్లీ, డివిలియర్స్‌ కలిసి మ్యాచ్‌

"ఆ తర్వాత కోహ్లీ, డివిలియర్స్‌ కలిసి మ్యాచ్‌ను ప్రత్యర్థి జట్ల నుంచి ఎలాగూ లాగేసుకుంటారు. డేల్‌ స్టెయిన్‌ రాక జట్టు బౌలింగ్ విభాగం పటిష్టమైంది. పవర్‌ ప్లేలో వికెట్లు తీయడం ఏ జట్టుకైనా కీలకం. ఆ సమయంలో కనీసం నాలుగు వికెట్లు తీస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. అలా పవర్‌ ప్లేలో వికెట్లు తీసిన జట్లు ఎక్కువ విజయాలను నమోదు చేశాయి" అని అలీ తెలిపాడు.

పవర్‌ ప్లేలో డేల్ స్టెయిన్‌ బాగా బౌలింగ్‌ చేస్తాడు

పవర్‌ ప్లేలో డేల్ స్టెయిన్‌ బాగా బౌలింగ్‌ చేస్తాడు

"పవర్‌ ప్లేలో డేల్ స్టెయిన్‌ బాగా బౌలింగ్‌ చేస్తాడు. అందుకే స్టెయిన్‌ ప్రభావం జట్టుపై చాలా ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం చాలా చిన్న మైదానం. బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించడం పేస్‌ బౌలర్లకు చాలా కష్టం. గత మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్‌కు బౌలింగ్‌ వేసే అవకాశం నాకు రాలేదు. అయితే, ఒక్కసారి విజయాల బాట పడితే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు" అని అలీ చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచులాడిన ఆ జట్టు 3 విజయాలు మాత్రమే సాధించింది. బుధవారం బెంగళూరు వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ సీజన్‌లో మొయిన్‌ అలీకి చివరి మ్యాచ్‌. వరల్డ్‌కప్‌ సన్నాహకంలో భాగంగా సుమారు 18 మంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌ను వీడనున్నారు.

Story first published: Wednesday, April 24, 2019, 18:42 [IST]
Other articles published on Apr 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X