న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుల్దీప్‌ ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జాకస్‌ కలిస్‌

IPL 2019 : Kuldeep Yadav's Omission From IPL Won't Be Affect Him In World Cup Says Jacques Kallis
IPL 2019: Kuldeep Yadhavs omission from IPL wont affect him in World Cup says Jacques Kallis

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జట్టులో సమతూకం కోసమే కుల్దీప్‌ను గత మ్యాచ్‌లలో బెంచ్‌కు పరిమితం చేయాల్సి వచ్చిందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్‌ జాకస్‌ కలిస్‌ స్పష్టం చేసాడు. ఈ ఐపీఎల్‌లో కుల్దీప్‌ యాదవ్‌ 9 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. మరోవైపు పరుగులను కూడా నియంత్రించలేకపోయాడు. దీంతో కుల్దీప్‌ బెంచ్‌కు పరిమితం అయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ప్రపంచకప్‌కు ఎంపికయిన కుల్దీప్‌ బెంచ్‌కు పరిమితం అవడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా కోచ్‌ జాకస్‌ కలిస్‌ స్పందించాడు. 'ఈ సీజన్‌-12లో ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం స్పిన్నర్లకు అనుకూలించలేదు. ఇది స్పిన్నర్లకు కఠినమైనది. ఈ ఏడాది స్పిన్నర్లు చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది. కుల్దీప్‌ కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఈ పరిస్థితులను కుల్దీప్ అర్ధం చేసుకుని నేర్చుకుంటాడు. వన్డేలతో పోల్చితే టీ20 పూర్తిగా భిన్నమైన ఆట' అని కలిస్‌ పేర్కొన్నారు.

'ఐపీఎల్ ప్రభావం ప్రపంచకప్‌లో కుల్దీప్ ప్రదర్శనపై ఏమాత్రం ఉండదు. తిరిగి ఫామ్ అందుకోవడానికి అతను నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రపంచకప్‌లో పుంజుకుని జట్టుకు విజయాలు అందిస్తాడు. కుల్దీప్‌ ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జట్టులో సమతూకం కోసమే అతనిని గత మ్యాచ్‌లలో బెంచ్‌కు పరిమితం చేయాల్సి వచ్చింది' అని కలిస్‌ తెలిపారు.

Story first published: Saturday, May 4, 2019, 8:10 [IST]
Other articles published on May 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X