బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్‌ అవకాశం ఉంది: చాహల్‌

ఈ ఐపీఎల్‌ సీజన్‌-12లో అన్ని జట్ల కంటే ముందే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు టోర్నీ నుండి నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. వరుసగా ఆరు ఓటమిల తర్వాత పంజాబ్‌తో జరిగిన ఏడవ మ్యాచ్‌లో గెలిచి తొలి విజయం అందుకున్న బెంగళూరు.. ఎనిమిదవ మ్యాచ్‌లో మళ్లీ పరాజయంను ఎదుర్కొంది. దీంతో లీగ్‌లో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయి ప్లేఆఫ్‌ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.

ఇంకా ఛాన్స్‌ ఉంది:

ఇంకా ఛాన్స్‌ ఉంది:

అయితే తాజాగా బెంగళూరు స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ తమ జట్టు ప్లేఆఫ్‌ అవకాశాలపై స్పందించాడు. 'వచ్చే ఆరు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. గత సంవత్సరం ఓ జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు వెళ్లింది. కాబట్టి మా దారులు ఇంకా మూసుకుపోలేదు. తర్వాతి మ్యాచ్‌ల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు' అని చాహల్‌ పేర్కొన్నారు.

ఒక్కరినే నిందించడం సరికాదు:

ఒక్కరినే నిందించడం సరికాదు:

'పిచ్‌ స్పిన్నర్లకు సహకరించింది. స్పిన్నర్ల బౌలింగ్ లో పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. 18వ ఓవర్‌ వరకు బాగానే బౌలింగ్ చేసాం. 2 ఓవర్లలో 22 పరుగులు కావాలి కాబట్టి విజయంపై నమ్మకంగా ఉన్నాం. హార్దిక్ చాలా బాగా బ్యాటింగ్ చేసాడు. ఓటమికి ఒక్కరినే (స్పిన్నర్ లేదా పేసర్) నిందించడం సరికాదు. ఇది జట్టు ఆట' అని చాహల్‌ చెప్పుకొచ్చారు.

 ఏడో ఓటమి:

ఏడో ఓటమి:

సోమవారం రాత్రి వాంఖెడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో బెంగళూరు ఖాతాలో ఏడో పరాజయం చవిచూసింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 ఓవర్లలో ఛేదించింది. డికాక్‌ (40), రోహిత్‌ (28), పాండ్యా (37 నాటౌట్‌; 16 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. డివిలియర్స్‌, మొయిన్‌ అలీలు అర్థ సెంచరీలు చేశారు.

కనీసం 14 పాయింట్లు కావాలి:

కనీసం 14 పాయింట్లు కావాలి:

ఐపీఎల్‌ సీజన్‌-12లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటికి ఎనమిది మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒకటి గెలిచి.. ఏడు మ్యాచ్‌లలో ఓడింది. బెంగళూరు ఖాతాలో ప్రస్తుతం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే 16 పాయింట్లు అవసరం. ఒకవేళ లీగ్‌లో అన్ని జట్ల మధ్య రసవత్తరపోరు జరిగినా.. ఏదైనా మ్యాచ్‌లు టై అయినా కనీసం 14 పాయింట్లు కావాలి, అదనంగా మెరుగైన రన్ రేట్ కూడా ఉండాలి.

ఓడితే దారులు మూసుకుపోయినట్టే:

ఓడితే దారులు మూసుకుపోయినట్టే:

పై గణాంకాలు అన్ని పరిగణలోకి తీసుకుంటే.. బెంగళూరుకు ఇంకా ఆరు మ్యాచ్‌లు (కలకత్తా, చెన్నై, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, హైదరాబాద్) మిగిలి ఉన్నాయి. ఈ ఆరు మ్యాచ్‌లలో బెంగళూరు విజయం సాదించినా.. మొత్తం 14 పాయింట్లు అవుతాయి. అలా అయినా మిగతా జట్ల ఫలితాల మీద ఆధారపడక తప్పదు. ఇక ఒక్క మ్యాచ్‌లో ఓడితే బెంగళూరు ముందుకెళ్లే దారులు మూసుకుపోయినట్టే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, April 16, 2019, 14:10 [IST]
Other articles published on Apr 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X