న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: Eliminator: DC VS SRH: ఢిల్లీ విజయ లక్ష్యం 163

Vijay

హైదరాబాద్: విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో మార్టిన్ గుప్టిల్ 19 బంతుల్లో 36(ఫోర్, 4 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 163 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా(8) మరోసారి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(36) పరుగులతో రాణించాడు. దూకుడుగా ఆడే క్రమంలో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కీమో పాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్... మనీశ్‌ పాండేతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

సన్‌రైజర్స్ స్కోరు బోర్డు ఊపందుకున్న తరుణంలో మనీశ్ పాండే(30)ను కీమో పాల్‌ ఔట్‌ చేశాడు. మనీష్‌ పాండే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్‌ శంకర్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి అక్సర్‌ పటేల్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు.

అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్‌(28) ఔటయ్యాడు. అయినప్పటికీ విజయ్ శంకర్.... మహ్మద్‌ నబీతో కలిసి స్కోర్‌ బోర్డుని పరుగులు పెట్టించాడు. జట్టు స్కోరు 147 పరుగుల వద్ద విజయ్ శంకర్(25) ఔటవ్వగా... ఆ తర్వాత వెంటనే నబీ(20) కూడా పెవిలియన్‌కు చేరాడు. కీమో పాల్‌ వేసిన చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్‌ మూడు వికెట్లు కోల్పోయింది.

చివర్లో విజయ్ శంకర్, నబీలు దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ 162 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్‌ మూడు వికెట్లు తీయగా.. ఇషాంత్‌ శర్మ రెండు.. బౌల్ట్‌, మిశ్రాలు తలో వికెట్‌ తీశారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఢిల్లీ జట్టులో కొలిన్‌ ఇంగ్రామ్‌ స్థానంలో కొలిన్‌ మన్రో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

1
45947

మరోవైపు సన్‌రైజర్స్ తుది జట్టులో ఈ సీజన్‌లో వరుసగా విఫలమవతుతున్న యూసఫ్‌ ఫఠాన్‌ స్థానంలో దీపక్‌ హుడాకు చోటు కల్పించింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుండగా... నెగ్గిన జట్టు శుక్రవారం ఇదే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరగనున్న రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో తలపడనుంది.

ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది విజయాలతో 18 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు సన్‌రైజర్స్ కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి 12 పాయింట్లతో అదృష్టం కొద్దీ నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌లో విజయం సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. విశాఖ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది.

జట్ల వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్

పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ మున్రో, రూథర్‌ఫర్డ్, అక్షర పటేల్, కీమో పాల్, ట్రెంట్ బౌల్డ్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్
మార్టిన్ గుప్టిల్, సాహా, మనీష్ పాండే, విలియమ్సన్, విజయ్ శంకర్, దీపక్ హుడా, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, బసిల్ థంపి

Story first published: Wednesday, May 8, 2019, 22:04 [IST]
Other articles published on May 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X