న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘డాడీస్ ఆర్మీ’మళ్లీ టైటిల్‌ సాధిస్తుందా?: నెటజన్ల జోకులపై డ్వేన్ బ్రావో

IPL 2019 : Dwayne Bravo Reveals The Secret Behind Chennai Super Kings Success | Oneindia Telugu
IPL 2019: Dwayne Bravo Reveals the Secret Behind CSK’s Success

హైదరాబాద్: 'డాడీస్ ఆర్మీ' ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అనుకుంటున్నారా? గత ఐపీఎల్ సీజన్‌లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టుకి అభిమానులు పెట్టిన ముద్దు పేరు. ఇందుకు కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్ల సరాసరి వయసు 30 ఏళ్లకు పైబడి ఉండటమే. అయితే, ఆ డాడీస్ ఆర్మీనే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత ఏడాది ఫైనల్‌కి చేరడంతో పాటు ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిచింది. తాజా సీజన్ కోసం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కూడా ఎక్కువ మార్పులకు చోటివ్వకుండా.. పాత జట్టువైపే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మొగ్గుచూపింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

‘డాడీస్ ఆర్మీ'మళ్లీ టైటిల్‌ సాధిస్తుందా?

‘డాడీస్ ఆర్మీ'మళ్లీ టైటిల్‌ సాధిస్తుందా?

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ‘డాడీస్ ఆర్మీ'మళ్లీ టైటిల్‌ సాదిస్తుందా? పలువురు నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. దీంతో డాడీస్ ఆర్మీ అనే పదం తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో స్పందించాడు. బ్రావో మాట్లాడుతూ "మా జట్టును మళ్లీ అలానే అంటున్నారని తెలుసు, కానీ అనుభవం మించిన ఆయుధం లేదు" అని అన్నాడు.

గతేడాది కూడా ఇలానే అన్నారు

గతేడాది కూడా ఇలానే అన్నారు

"గతేడాది కూడా ఇలానే అన్నారు. ఏమైంది? టైటిల్‌ గెలిచాం. ప్రతీ సీజన్‌లోనూ కొత్తగా ఆడటానికి ప్రయత్నిస్తాం. ఈ సీజన్‌లో కూడా గత ఐపీఎల్‌కు మించి ప్రదర్శన చేస్తాం" అని చెప్పుకొచ్చాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ వయసు అనేది ఒక అంకె మాత్రమేనని, అనుభవం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.

అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా బ్రావో

అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా బ్రావో

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో మరో 21 వికెట్లు తీస్తే టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు 438 టీ20 మ్యాచ్‌లాడిన డ్వేన్ బ్రావో 479 వికెట్లు తీశాడు.

యో-యో టెస్టుకు దూరంగా సీఎస్‌కే

యో-యో టెస్టుకు దూరంగా సీఎస్‌కే

ధోని, రాయుడు, రైనా, బ్రేవో, డుప్లెసిస్‌, వాట్సన్‌, తాహీర్‌, జాదవ్‌లతో సహా జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్లు అందరూ మూడు పదుల వయసు పై గలవారే కావడం విశేషం. మిగతా ఫ్రాంచైజీలతో పోలీస్తే సీఎస్‌కే విధానాలు భిన్నంగా ఉంటాయి. అన్ని ఫ్రాంచేజీలు ఆటగాళ్లకు యో-యో టెస్టు తప్పనిసరి చేస్తే.... సీఎస్‌కే మాత్రం యో-యో టెస్టుకు దూరంగా ఉంది.

Story first published: Saturday, March 23, 2019, 15:42 [IST]
Other articles published on Mar 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X