న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సుల సీక్రెట్ చెప్పేసిన రిషబ్‌ పంత్‌

IPL 2019 : Rishabh Pant Reveals Secret behind His Sixes ! || Oneindia Telugu
IPl 2019, DC vs SRH: Rishabh Pant reveals secret behind his six-hitting prowess

ఐపీఎల్‌-12లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్‌, యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. బౌలర్ ఎవరని చూడకుండా ఫోర్లు, సిక్సులు అలవోకగా బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. పంత్ ధాటికి ప్రత్యర్ధులు విజయంపై నమ్మకంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ఉదాహరనే ఐపీఎల్‌-12 ఎలిమినేటర్‌ మ్యాచ్‌.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మొదటగా 162 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీకి మంచి ఆరంభమే దక్కినా.. మధ్య ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ గెలవాలంటే 6 ఓవర్లలో 52 పరుగులు చేయాలి. 15వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మన్రో, అక్షర్‌ పటేల్‌ (0)ను ఔట్‌ చేసాడు. ఇక ఢిల్లీ చివరి 3 ఓవర్లలో 34 పరుగులు చేయాలి. థంపి వేసిన 18వ ఓవర్లో పంత్‌ వరుసగా 4, 6, 4, 6 బాది ఢిల్లీని విజయానికి దగ్గర చేసి అవుట్ అయ్యాడు. పంత్‌ (49; 21 బంతుల్లో 2×4, 5×6) మెరుపులకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

అనతి కాలంలోనే స్టార్:

అనతి కాలంలోనే స్టార్:

క్రికెట్‌లో హిట్టర్లు అంటే క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, ఎంఎస్ ధోనీ, గ్లెన్ మాక్స్ వెల్ పేర్లు గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ జాబితాలో రిషబ్‌ పంత్‌ పేరు కూడా చేరిపోయింది. గత సంవత్సరమే అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన పంత్.. అనతి కాలంలోనే స్టార్ అయ్యాడు. దీనికి కారణం భారీ సిక్సులు బాదడమే. తాజాగా తన సిక్సుల సీక్రెట్ ఏంటో పంత్ చెప్పాడు.

కండ బలంతోనే కొట్టగలుగుతున్నా:

కండ బలంతోనే కొట్టగలుగుతున్నా:

'టీ20లలో 20 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి వచ్చినపుడు ఒక బౌలర్‌పై దాడి చేయాలి. అప్పుడు బౌలర్‌ ఎవరని చూడకుండా బాదుతాను. భారీ సిక్సర్లు నా కండ బలంతోనే కొట్టగలుగుతున్నా. ఇక నెట్స్‌లో కూడా బాగా సాధన చేస్తా' అని తన సిక్సుల సీక్రెట్ పంత్ తెలిపాడు.

బలంగా బాదడానికి ప్రయత్నించలేదు:

బలంగా బాదడానికి ప్రయత్నించలేదు:

'ఈ రోజు మాత్రం నా ఆటకు బిన్నంగా ఆడా. బంతిని బలంగా బాదడానికి ప్రయత్నించలేదు. బంతిని చూసి కొట్టే ప్రయత్నం చేశాను. పరుగులు చేసి ఢిల్లీని విజయాన్ని దగ్గరగా తీసుకెళ్లా కానీ ఇన్నింగ్స్ ఫినిష్ చేయలేదు. వచ్చే మ్యాచ్‌లో ఫినిష్ చేస్తా. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను' అని పంత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, May 9, 2019, 12:31 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X