న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీపై సెంచరీ: గర్వంగా ఉంది, మాటలు రావడం లేదు: వార్నర్ భార్య

IPL 2019: David Warner’s wife is proud of her husband after his masterclass against RCB

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌లో మరింత కసిని పెంచినట్లు ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన ఏడాదిపాటు నిషేధం ముగిసిన తర్వాత ఐపీఎల్ 2019 సీజన్‌లో పునరాగమనం చేసిన డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో సెంచరీ సాధించడంతో పాటు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 32 ఏళ్ల వార్నర్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 127 యావరేజితో 254 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికిచ్చే ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వార్నర్‌పై ట్విట్టర్‌లో ప్రశంస

ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ భార్య క్యాండీస్ అతడిపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించింది. "ఈ మనిషి గురించి చెప్పడానికి నేనెంత గర్వంగా ఉన్నానో చెప్పేందుకు మాటలు రావడం లేదు. నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోలేదు. సెంచరీ సాధించినందుకు అభినందనలు. సన్‌రైజర్స్ అబిమానులు డేవిడ్‌‌తో పాటు మా కుటుంబానికి ఇచ్చిన మద్దతు మరువలేనిది. థ్యాంక్యూ. తర్వలోనే హైదరాబాద్‌లో కలుస్తా" అంటూ ట్వీట్ చేశారు.

ఈ సీజన్‌లో సెంచరీ నమోదు చేసిన వార్నర్

ఈ సీజన్‌లో సెంచరీ నమోదు చేసిన వార్నర్

ఆదివారం సాయంత్రం ఉప్పల్‌ స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్( 55 బంతుల్లో 100 నాటౌట్) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(56 బంతుల్లో 114) కూడా సెంచరీతో రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 231 పరుగుల భారీ స్కోరు చేసింది.

తొలి వికెట్‌కు 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం

తొలి వికెట్‌కు 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం

వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 185 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 118 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, క్యాండీస్‌ను డేవిడ్ వార్నర్ ఏప్రిల్ 2015న వివాహం చేసుకున్నాడు. వార్నర్-క్యాండీస్ దంపతులకు ఇప్పటికే ఐవీ మే, ఇండీ రే అనే ఇద్దరు పిల్లలున్నారు.

బాల్ ట్యాంపరింగ్‌ ఉదంతం నుంచి బయటకు

బాల్ ట్యాంపరింగ్‌ ఉదంతం నుంచి బయటకు

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో వార్నర్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఆస్ట్రేలియా జట్టులో చోటు కోల్పోయినప్పుడు క్యాండీస్ గర్భవతిగా ఉన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఏర్పడిన ఒత్తిడితో ఆమెకు గర్భస్రావం అయింది. ఒత్తిడి కారణంగా తనకు గర్భస్రావం అయినట్టు క్యాండీస్ స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొంది.

Story first published: Tuesday, April 2, 2019, 15:34 [IST]
Other articles published on Apr 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X