న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీకి ఊహించని షాక్: టోర్నీ మొత్తానికి డేల్ స్టెయిన్ దూరం

IPL 2019: Dale Steyn Ruled Out For The Season Due to Shoulder Injury

హైదరాబాద్: ఇప్పుడిప్పుడే ఈ సీజన్‌లో విజయాల బాట పడుతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఊహించని షాక్ తగిలింది. భుజం గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. ఈ మేరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గాయపడిన ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ కౌల్టర్-నైల్ స్థానంలో ఆర్సీబీ జట్టులో చోటు దక్కించుకున్న డేల్ స్టెయిన్ ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే, తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

అయితే, గాయం కారణంగా బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌కి సైతం డేల్ స్టెయిన్ దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ స్థానంలో తుది జట్టులో టిమ్ సౌథీ చోటు దక్కించుకున్నాడు. స్టెయిన్ గాయంపై ఆర్సీబీ అధికారిక ప్రకటన చేసింది.

"భుజం వాపు గాయం కారణంగా డేల్ స్టెయిన్‌కి విశ్రాంతినిచ్చాం. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం జరుగుతన్న ఐపీఎల్ సీజన్ మొత్తానికి అత్డు అందుబాటులో ఉండటం లేదు. అతడి రాకతో ఆర్సీబీ జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకు అతడికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మైదానంలో అతడి ఎనర్జీని ఎంతగానో మిస్సవుతున్నాం. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ సీజన్‌లో ఆర్సీబీ తరుపున రెండు మ్యాచ్‌లాడిన డేల్ స్టెయిన్ 17.25 యావరేజితో 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డేల్ స్టెయిన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే పవర్ ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్లను తక్కువ స్కోరుకే కట్టిడి చేశాడు. ఈ సీజన్ కోసం జనవరిలో జరిగిన వేలంలో స్టెయిన్‌ను ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

అయితే, టోర్నీ మధ్యలో ఆస్ట్రేలియా పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ గాయపడటంతో అతడి స్థానంలో డేల్ స్టెయిన్‌కు పిలుపొచ్చింది. డేల్ స్టెయిన్ వచ్చిన తర్వాత ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం.

Story first published: Thursday, April 25, 2019, 17:22 [IST]
Other articles published on Apr 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X