న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో సూర్యకూమార్‌ ఒకరు: రోహిత్‌ శర్మ

IPL 2019,1st Qualifier: Rohit Sharma Says Surya Kumar Probably One Of Our Best Batsmen Against Spin
IPL 2019, CSK vs MI Match, Qualifier 1: Surya Kumar Yadhav probably one of our best batsmen against spin says Rohit Sharma

ముంబై ఇండియన్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన సూర్య కుమార్‌ యాదవ్‌ (71 నాటౌట్‌; 54 బంతుల్లో 10×4)పై ఆ జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య కూమార్‌ స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడతాడు, మా అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో అతను కూడా ఒకడు అని రోహిత్‌ పేర్కొన్నారు. చెన్నై వేదికగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

అందుకే జయంత్ యాదవ్‌ను తీసుకున్నాం:

అందుకే జయంత్ యాదవ్‌ను తీసుకున్నాం:

మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'ముంబై ఫైనల్‌కు వెళ్లడం ఆనందంగా ఉంది. ఫైనల్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉంది, ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకొని ఫైనల్‌కు సిద్దమవుతాం. చెన్నైని మా స్పిన్నర్లే కట్టడి చేశారు. ఈ విజయంలో వారిదే కీలక పాత్ర. చెన్నై బ్యాట్స్‌మన్‌లలో ఎక్కువ మంది రైట్ హ్యాండర్స్ ఉన్నారని జయంత్ యాదవ్‌ను తీసుకున్నాం. జయంత్ అద్భుత ప్రదర్శన చేసాడు' అని రోహిత్ పేర్కొన్నారు.

సూర్యకూమార్‌ స్పిన్ బౌలింగ్‌ బాగా ఆడతాడు:

సూర్యకూమార్‌ స్పిన్ బౌలింగ్‌ బాగా ఆడతాడు:

'ఇన్నింగ్స్ చివరి వరకు ధోనీ కీలకమైన ఆటగాడు. అందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. మా బౌలర్లు ప్రత్యర్థి జట్టును 140 పరుగులలోపే నియంత్రించడం బాగుంది. వారు బాగా బౌలింగ్ చేశారు. సూర్య కూమార్‌ స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడతాడు, మా అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో అతను కూడా ఒకడు. మ్యాచ్‌లో మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు' అని రోహిత్ తెలిపారు.

జట్టు సమతూకంగా ఉంది:

జట్టు సమతూకంగా ఉంది:

'మా జట్టు సమతూకంగా ఉంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా.. దానికి తగ్గట్టు మా జట్టు కూర్పు ఉంటుంది. పరిస్థితులను బట్టి ఎదురుదాడి చేయగల బ్యాటింగ్‌ లైనప్ ఉంది. చెపాక్ మైదానంలోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం, ఆత్మవిశ్వాసంతో బ్యాట్స్‌మెన్‌ ఆడటమే ఈ విజయానికి అసలు కారణమని' రోహిత్‌ చెప్పుకొచ్చారు.

ఫైనల్లో ముంబై:

ఫైనల్లో ముంబై:

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నచెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్లతో సహా అందరూ విఫలమవ్వగా.. అంబటి రాయుడు (42 నాటౌట్‌; 37 బంతుల్లో 3×4, 1×6), ధోనీ (37 నాటౌట్‌; 29 బంతుల్లో 3×6) లు ఆదుకున్నారు. 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌ 4 వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించి ఫైనల్ చేరింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (71 నాటౌట్‌; 54 బంతుల్లో 10×4) రాణించాడు. సూర్యకుమార్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Wednesday, May 8, 2019, 13:55 [IST]
Other articles published on May 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X