న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాయ చేసిన ఇమ్రాన్ తాహిర్: ఢిల్లీపై సీఎస్‌కే అలవోక విజయం

IPL 2019 : Chennai Super Kings Defeated Delhi Capitals By 80 Runs At The Chepauk || Oneindia Telugu
CSK

హైదరాబాద్: చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అలవోక విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం


ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ 31 బంతుల్లో44(4ఫోర్లు, 1 సిక్సర్‌) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ధావన్‌(19) పరుగులతో ఫరవాలేదనిపించాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్‌ తాహీర్‌ నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా... భజ్జీ, చాహర్ చెరో వికెట్ తీశారు.

ఢిల్లీ విజయ లక్ష్యం 180
అంతకముందు సురేశ్ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్), ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 180 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

1
45926

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సుచిత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి వాట్సన్ ఖాతా తెరవకుండానే అక్షర పటేల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనాతో కలిసి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.


ఈ క్రమంలో వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 83 పరుగులు జోడించారు. సురేశ్‌ రైనా 37 బంతుల్లో 59(8 ఫోర్లు, సిక్స్)తో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్ మూడో బంతికి డుప్లెసిస్(39) ధావన్‌కు క్యాచ్ ఔటయ్యాడు. దీంతో జట్టు స్కోరు 87 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత కొద్ది సేపటికే జట్టు స్కోరు 102 పరుగుల వద్ద సుచిత్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి రైనా(59) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన జడేజా దూకుడగా ఆడాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 25 పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

వికెట్లు ఉండటంతో చివర్లో అంబటి రాయుడు సహకారంతో చివర్లో ధోని 22 బంతుల్లో 44(4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ట్ర్ంట్ బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు రాబట్టడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో సుచిత్ రెండు, మోరిస్, అక్షర్ తలో వికెట్ తీశారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్‌కు ఇది 200వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి తిరిగొచ్చిన ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు.

దీంతో పాటు చెన్నై మరో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మిషెల్ శాంట్నర్, మురళీ విజయ్‌ల స్థానంలో డుప్లెసిస్, జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మోరవైపు ఢిల్లీ కూడా రెండు మార్పులు చేసింది. ఇషాంత్ శర్మ, కగిసో రబాల స్థానంలో ట్రెంట్ బోల్ట్, సుచిత్‌లకు చోటు కల్పించింది.

Story first published: Wednesday, May 1, 2019, 23:49 [IST]
Other articles published on May 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X