న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లోనే ఐపీఎల్ 2019: మార్చి 23న ప్రారంభం, త్వరలోనే షెడ్యూల్

IPl 2019 : Going To Be In India & Begins Before Elections | Oneindia Telugu
 IPL 2019 to be staged in India, begins from March 23

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌కి ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్‌ని విదేశాల్లో నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బీసీసీఐ బ్రేక్ వేసింది.

<strong>ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌కు పంత్‌ని తప్పించడంపై చీఫ్ సెలక్టర్ ఇలా!</strong>ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌కు పంత్‌ని తప్పించడంపై చీఫ్ సెలక్టర్ ఇలా!

బోర్డు మాత్రం ఐపీఎల్ 2019 సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ వేదికల విషయమై చర్చించేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు.

ఐపీఎల్ 2019 సీజన్‌ను

ఐపీఎల్ 2019 సీజన్‌ను

"ఐపీఎల్ 2019 సీజన్‌ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై మంగళవారం బీసీసీఐ పాలకుల కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ప్రాథమిక చర్చల అనంతరం జాతీయ, రాష్ట ఏజెన్సీల అంచనా ప్రకారం 12వ ఎడిషన్‌ను భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు" అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం

"మార్చి 23, 2019న ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభమవుతుంది. బోర్డు అధికారులతో సమావేశమైన తర్వాత పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం. ఐపీఎల్ 2019 షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు స్టేక్ హోల్డర్స్‌తో బీసీసీఐ పాలకుల కమిటీ సమావేశం కానుంది" అని బీసీసీఐ అందులో పేర్కొంది.

గతేడాది కంటే ముందే ప్రారంభం

గతేడాది కంటే ముందే ప్రారంభం

గత సీజన్‌ను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించగా.. ఈసారి అంతకు ముందే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే ఎన్నికలు కూడా జరగనుండటంతో.. భద్రతా ఏర్పాట్లు చేయలేమని ఇప్పటికే నిర్వాహకులకి అధికారులు తేల్చి చెప్పేశారు. టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు.. భారత్ వెలుపల మ్యాచ్‌లు నిర్వహిస్తే? భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆ నిర్ణయంపై విముఖత వ్యక్తం చేశాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు ఐపీఎల్ 2019 సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది.

గతంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇలా

గతంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇలా

గతంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలిసారి 2009లో టోర్నీ దక్షిణాఫ్రికాలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2014లో సగం టోర్నీ యూఏఈలో, మిగతా సగం భారత్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి కూడా అలానే జరగనుందని వార్తలు వచ్చాయి. కాగా, మార్చిలో ఐపీఎల్ మొదలవడం ఇది రెండోసారి. 2010లో తొలిసారి టోర్నీని మార్చిలోనే ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికాగ మే 30 వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 15 రోజుల గ్యాప్ ఉండేలా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

Story first published: Tuesday, January 8, 2019, 17:04 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X