న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరస్పర విరుద్ధ ప్రయోజనాలు: గంగూలీకి నోటీసులు

IPL 2019: BCCI’s Ethics officer sends notice to Sourav Ganguly over conflict of interest issue

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా వ్యవహరిస్తోన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. కోల్‌కతా అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) క్యాబ్‌ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభానికి ముందు సలహాదారుగా నియమించుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో క్యాబ్‌ పదవిలో ఉంటూ ఐపీఎల్‌ జట్టుకు సలహాదారుగా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందంటూ గంగూలీపై ముగ్గురు క్రికెట్‌ అభిమానులు ఫిర్యాదు చేశారు. టోర్నీలో భాగంగా ఏప్రిల్‌ 12న(శుక్రవారం) కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుకూలంగా

ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుకూలంగా

ఈ మ్యాచ్‌‌లో ఈడెన్ పిచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుకూలంగా తయారు చేయించడం లేదా క్యాబ్ అధ్యక్షుడి హోదాలో మరో రకంగా ఆ జట్టుకు సాయపడటానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఏంటి అన్న సందేహాన్ని వారు వెలిబుచ్చారు. దీంతో ఈ విషయంపై బీసీసీఐలో కొత్త అంబుడ్స్‌మన్‌గా నియమితుడైన జస్టిస్‌ జైన్‌... సౌరవ్ గంగూలీకి నోటీసులు పంపించారు.

గంగూలీపై నాకు ఫిర్యాదు అందింది

గంగూలీపై నాకు ఫిర్యాదు అందింది

"అవును.. గంగూలీపై నాకు ఫిర్యాదు అందింది. ఇలా రెండు పదవుల్లో ఉంటూ విరుద్ధ ప్రయోజనాలు పొందడంపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి గంగూలీ వివరణ కోరాను. అతడు సమాధానం చెప్పేందుకు గాను వారం రోజుల గడువు ఇచ్చాను. గంగూలీ నుంచి సమాధానం వచ్చిన తర్వాత ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటాం" అని జైన్‌ అన్నారు.

సౌరవ్ గంగూలీ ఇప్పటికే వివరణ

సౌరవ్ గంగూలీ ఇప్పటికే వివరణ

తన ఎంపిక పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని సౌరవ్ గంగూలీ ఇప్పటికే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. గంగూలీ మాట్లాడుతూ "ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలేమీ లేవు. ఇంతకు ముందే ఐపీఎల్‌ పరిపాలనా మండలికి రాజీనామా చేశా. సలహాదారు పాత్ర చేపట్టే ముందే సీఓఏను సంప్రదించా" అని చెప్పాడు.

కాఫీ విత్ కరణ్ టాక్ షోలో వివాదంపై

కాఫీ విత్ కరణ్ టాక్ షోలో వివాదంపై

మరోవైపు టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు నోటీసులు జారీ చేశారు. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. వీటిపై స్పందించిన హార్దిక్, రాహుల్‌లు తమ బిజీ షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా హాజరుకాలేమని సమయం కావాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు గైర్హాజరీ

ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు గైర్హాజరీ

మరోవైపు హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌లు ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు గైర్హాజరీ అయ్యే అవకాశం ఉండటంతో వారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చిస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ విషయంపై జస్టిస్ జైన్ మాట్లాడుతూ "హార్దిక్.. రాహుల్‌లకు వారం క్రితమే నోటీసులు జారీ చేశాం. విచారణకు వారు కూడా ఉండాలని ఆదేశించాం. సహజ న్యాయం ప్రకారం. వారి వాదనను వినాల్సి ఉంది. విచారణకు హాజరై వారి వాదనను వినిపించాల్సిన బాధ్యత వారిదే. ఎప్పుడు వస్తారో చూడాలి" అని తెలిపారు.

Story first published: Wednesday, April 3, 2019, 15:14 [IST]
Other articles published on Apr 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X