న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ సీజన్ 12: అనిల్ కుంబ్లే జట్టు ఇదే!!

IPL 2019: Anil Kumble picks his best XI of the IPL season 12, MS Dhoni Captain

త్వరలో ఇంగ్లాండ్ వేదికగా మెగా టోర్నీ ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తన కలల జట్టును ప్రకటిస్తుండగా.. టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఐపీఎల్ సీజన్ 12కు సంబంధించి తన బెస్ట్ జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఈ సీజన్ ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా కుంబ్లే తన జట్టును ఎంచుకున్నాడు. ఈ జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నము సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు.

కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ:

కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ:

ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, డేవిడ్‌ వార్నర్‌లను ఎంచుకున్నాడు. రాహుల్ పంజాబ్ తరపున, వార్నర్ హైదరాబాద్ తరపున పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌లుగా ఎంఎస్ ధోనీ (చెన్నై), రిషబ్‌ పంత్‌ (ఢిల్లీ)లకు అవకాశం ఇచ్చాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్‌లే అయినా.. కుంబ్లే తన జట్టుకు ధోనీని కీపర్‌గా ఎంచుకున్నాడు.

ఆల్‌రౌండర్‌లకు అవకాశం:

ఆల్‌రౌండర్‌లకు అవకాశం:

అనిల్ కుంబ్లే తన జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్‌లకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుత సీజన్-12లో బౌలర్లపై కనికరం లేకుండా బంతులను స్టాండ్స్ లోకి తరలిస్తున్న భారీ హిట్టర్లు ఆండ్రీ రసెల్ (కలకత్తా), హార్దిక్ పాండ్యా (ముంబై)లను తీసుకున్నాడు. ఇక ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు జట్టులో చోటు కల్పించాడు. స్పిన్ విభాగంలో ఇమ్రాన్ తాహిర్ (చెన్నై), శ్రేయాస్ గోపాల్ (రాజస్థాన్).. పేస్ విభాగంలో రబడ (ఢిల్లీ), బుమ్రా (ముంబై)లు చోటు దక్కించుకున్నారు.

కుంబ్లే జట్టు:

కుంబ్లే జట్టు:

కేఎల్ రాహుల్, డేవిడ్‌ వార్నర్, శ్రేయాస్ అయ్యర్‌, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/కీపర్), రిషబ్‌ పంత్‌, ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా, ఇమ్రాన్ తాహిర్, శ్రేయాస్ గోపాల్, కాగిసో రబడ, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Friday, May 10, 2019, 13:25 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X