న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 11వ సీజన్ తొలి వారాన్ని ఎంత మంది వీక్షించారో తెలుసా?

 IPL 2018 witnesses highest ever opening week viewership, claims broadcaster

హైదరాబాద్: అన్ని సీజన్లలాగే ఈ సారి కూడా ఐపీఎల్ 11 భారీగా సిద్ధమై క్రికెట్ అభిమానుల ముందుకు వచ్చింది. జనవరి 27వ తేదీ వేలం దగ్గరి నుంచి ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందా అనే కుతూహలంతో ఎదరుచూశారు ఔత్సాహికులు. కన్నుల పండుగగా ఏప్రిల్ 7వ తేదీ ఆరంభ వేడుక నుంచి ఐపీఎల్ ప్రారంభం అయింది. దీంతో విదేశాల నుంచి, స్వదేశంలోనూ వీక్షించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయిందట.

37 కోట్లు దాటిన వీక్షకుల సంఖ్య:

37 కోట్లు దాటిన వీక్షకుల సంఖ్య:

11వ సీజన్‌లో అడుగుపెట్టిన ఐపీఎల్‌ను తొలి వారంలో టెలివిజన్లు, ఆన్‌లైన్‌లో హాట్‌స్టార్‌ ద్వారా ఏకంగా 37 కోట్ల పది లక్షల మంది వీక్షించారట. ఐపీఎల్‌ ఆరంభమైయ్యాక మొదటి వారంలో ఇంతమంది ఈ ‘వేసవి వినోదా'న్ని ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించడం రికార్డు. తొలి వారంలో మొత్తం టెలివిజన్‌ వ్యూయర్‌షిప్‌ 28 కోట్ల 84 లక్షలుగా ఉంది. ఇక హాట్‌స్టార్‌ ద్వారా మరో 8 కోట్ల 24 లక్షలమంది ఐపీఎల్‌ను చూసినట్టు టెలివిజన్‌ రేటింగ్‌ ఏజెన్సీ బ్రాడ్‌కాస్టింగ్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ఇండియా (బార్క్‌) వెల్లడించింది.

వీక్షకుల సంఖ్య 76శాతం పెరిగి:

వీక్షకుల సంఖ్య 76శాతం పెరిగి:

సరిగ్గా పరీక్షలన్నీ పూర్తయ్యాక సమయం చూసుకుని ఐపీఎల్ ను ప్రారంభించారు ఐపీఎల్ నిర్వహకులు. ఇప్పటికే దేశీవాలీ లీగ్ లోనే అత్యంత ధనిక లీగ్ పేరొందిన ఐపీఎల్ బీసీసీఐకి మంచి లాభాలే తెచ్చిపెడుతుంది. ఈ సీజన్ గత ఏడాదితో పోలిస్తే 76శాతం వీక్షకుల సంఖ్య పెరిగింది.

 చరిత్రలో ఇదే అత్యుత్తమం:

చరిత్రలో ఇదే అత్యుత్తమం:

ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యుత్తమం. గతంతో పోల్చుకుంటే దక్షిణాదిలో ఈసారి 30శాతం టీవీ వీక్షకుల సంఖ్య పెరిగినట్లు బార్క్ తెలిపింది. స్టార్ ఇండియా ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ ప్రసారహక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పది టీవీ చానళ్లలో ఆరు భాషల్లో ఐపీఎల్ ప్రసారమవుతున్నది.

ఆరంభం కాస్త చప్పగానే గడిచిందనే:

ఆరంభం కాస్త చప్పగానే గడిచిందనే:

ఆరంభంలో కాస్త తటాపటాయించిన మాట వాస్తవమే. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే.. ఏప్రిల్ 7నుంచి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లపై వీక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ, అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే.. ఆరంభం కాస్త చప్పగానే గడిచిందనే చెప్పాలి. ఐపీఎల్ 10సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లకే 185.7 మిలియన్ వీక్షకులు చూశారు. అలాంటిది ఈ ఏడాది పదమూడు రోజుల మ్యాచ్‌లు చూసిన వారి సంఖ్య కేవలం దీనికి రెట్టింపు మాత్రమే.

Story first published: Friday, April 20, 2018, 15:22 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X