న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారీ షాట్లే మా కొంప ముంచాయ్: అశ్విన్

 IPL 2018: ‘We have a problem with our batting’, says Kings XI Punjab skipper R Ashwin

హైదరాబాద్: ఇండోర్ వేదికగా ఆడిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న పంజాబ్ జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో ఓటమి పాలైంది. ఈ వైఫల్యంపై కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఇలా స్పందించాడు. బెంగళూరుపై మెరుగైన స్కోరు చేయాలనే తలంపుతో భారీ షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు పేలవరీతిలో 88 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్యాన్ని బెంగళూరు జట్టు వికెట్ నష్టపోకుండా 8.1 ఓవర్లలోనే ఛేదించిన విషయం తెలిసిందే. టోర్నీలో పంజాబ్‌ జట్టు‌కి ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంది.

'ఇండోర్‌ మైదానంలో ఛేదనకు దిగిన జట్టుని నిలువరించడం చాలా కష్టం. అందుకే స్కోరు బోర్డుపై సురక్షితమైన స్కోరు ఉంచాలనే ఉద్దేశంతో భారీ షాట్లు ఆడి.. ఆరంభంలోనే కీలక వికెట్లు చేజార్చుకున్నాం. మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడటంలో జట్టు మిడిలార్డర్‌ విఫలమైంది. మా జట్టుకి బ్యాటింగ్ సమస్య ఉంది. ఇంకా నిజాయతీగా చెప్పాలంటే మేము టైటిల్‌‌కి గట్టి పోటీదారులం కాదు. కానీ.. టోర్నీ ఆరంభంలోనే అగ్రశ్రేణి జట్ల‌ని మేము ఓడించాం. ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసి 14 లేదా 16 పాయింట్లు సాధించడంపై దృష్టి పెడతాం' అని అశ్విన్ వెల్లడించాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తదుపరి మ్యాచ్ ముండై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ ఇరుజట్లు పోటీపడనున్నాయి. ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Tuesday, May 15, 2018, 20:27 [IST]
Other articles published on May 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X