న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్ జట్టు కెప్టెన్‌గా యువరాజ్‌కు బదులు అశ్విన్ తీసుకోవడానికి కారణం ఇదే: సెహ్వాగ్

IPL 2018: Virender Sehwag reveals why Kings XI Punjab preferred Ashwin over Yuvraj as captain

హైదరాబాద్: భారత మాజీ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా అశ్విన్ ఎందుకు తీసుకున్నారో తెలిపాడు. జట్టులో అతనికంటే సీనియర్, సెహ్వాగ్‌కు సన్నిహితుడు అయినటువంటి యువరాజ్ సింగ్‌ను తీసుకోకపోవడానికి కారణం వివరించాడు. తన ఫేస్‌బుక్ అధికారిక ఖాతా ద్వారా పంజాబ్ జట్టుకు అశ్విన్ అంటూ ప్రకటించిన సెహ్వాగ్ ఇలా మాట్లాడాడు.

'పంజాబ్ జట్టుకు మేనేజ్‌మెంట్, ఇతర సిబ్బంది, జట్టు సభ్యులు రవి చంద్రన్ అశ్విన్‌ను తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో రూ.7.6కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రవిచంద్రన్ అశ్విన్‌నే జట్టు కెప్టెన్ గా తీసుకుంది. నాకు తెలిసి ఒక బౌలర్‌యే మా జట్టుకు మంచి కెప్టెన్ అవగలడని నేననుకున్నా. ఎందుకంటే నేను వసీం అక్రమ్, వఖర్ యూనిస్, కపిల్ దేవ్‌లకు అభిమానిని. వారు తమ జట్లు కోసం ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు' అని తెలిపాడు.

ఇంకా మాట్లాడుతూ.. యువరాజ్ స్థానిక ఆటగాడు కాబట్టి అతన్ని తీసుకోవాల్సిందిగా సూచించాను. అతనితో క్రీడాపరంగా సాన్నిహిత్యం ఉంది. ఆ విషయానికి సోషల్ మీడియాలో సైతం మద్దతు లభించినా తుది నిర్ణయం అశ్విన్‌కే అనుకూలంగా వచ్చింది. యువరాజ్ సింగ్ ఆటలోనూ, పిచ్ బయట ఒక మంచి ఫ్రెండ్, అలానే రవిచంద్రన్ అశ్విన్ ఒక మంచి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నా..' అని ముగించాడు.

ఇలా అశ్విన్‌ను ఎంపిక చేయడానికి ఒకే ఒక్క ప్రధాన కారణం కొత్తదనం చూపించాలని అనుకోవడమేనని తెలిపాడు.
రవి చంద్రన్ అశ్విన్ ఖాతాలో పలు రికార్డులు:
1. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 50 వికెట్లు తీసిన తొలి భారతీయుడు
2. ఐసీసీ వరల్డ్ కప్, ఛాంపియన్స్ లీగ్ టీ20 విజేత
3. 2014కు గాను అర్జున అవార్డు విజేత
4. 2010-11, 2015-16 సంవత్సరాలకు గాను భారత ఉత్తమ క్రికెటర్‌గా బీసీసీఐ దిలీప్ సర్‌దేశాయ్ అవార్డు గెలుచుకున్నాడు.
5. 2012-13 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా బీసీసీఐ పాలీ ఉమ్రీగర్ అవార్డు అందుకున్నాడు.
6. 2016లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
7. 2016-17లో సీట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్

Story first published: Tuesday, February 27, 2018, 13:11 [IST]
Other articles published on Feb 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X