న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్‌కు ఏడోసారి: చెన్నైపై ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?

By Nageshwara Rao
IPL 2018: Twitterati hail Chennai Super Kings as they pip SRH to make their 7th IPL Final

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబైలో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై అద్భుతం చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుస్లెసిస్‌ (67 నాటౌట్‌; 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు)లతో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

అయితే వెస్టిండిస్‌ హిట్టర్‌ కార్లోస్ బ్రాత్‌వైట్‌ ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు రాబట్టి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే బ్రాత్‌వైట్ చెన్నై ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్‌‌లో 20 పరుగులిచ్చి సన్‌రైజర్స్ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన సిద్ధార్థ్‌ కౌల్‌ 19వ ఓవర్‌లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 19వ ఓవర్‌లో అతడు కూడా 17 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ హైదరాబాద్ చేజారిపోయంది. ఇక, ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 6 పరుగులు కావాల్సిన సమయంలో భువి వేసిన తొలి బంతికే డుప్లెసిస్‌ సిక్సర్‌ బాది చెన్నైని ఫైనల్‌‌కు చేర్చేశాడు.

తాజా విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ధోని తొమ్మిదోసారి ఐపీఎల్ ఫైనల్స్ ఆడబోతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఈ ఘతన సాధించలేదు. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Wednesday, May 23, 2018, 15:52 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X