చెన్నైకు దెబ్బ: గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు రైనా దూరం

Posted By:
IPL 2018: Suresh Raina to miss Chennai Super Kings’ next two games due to injury

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడంతో పాయింట్ల లిస్టులో చెన్నైసూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) తొలిస్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో జట్టు కీలక ఆటగాడు సురేన్‌ రైనా గాయంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దీంతో వచ్చే ఆదివారం(ఏప్రిల్‌ 15న) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌, ఏప్రిల్‌ 20న రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లకు రైనా లేకుండానే సీఎస్‌కే బరిలోకి దిగుతుంది.

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ వేసిన 10వ ఓవర్‌లో సింగిల్‌ తీసే సమయంలో రైనా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కాలి గాయానికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో సీఎస్‌కే ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎస్‌కే ఆటగాడు కేదార్‌ జాదవ్‌ సీజన్‌ మొత్తానికి దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా రైనా కూడా గాయపడటం సీఎస్‌కేకి పెద్ద ఎదురు దెబ్బే.

 చేతివేలి గాయంతో ఫాఫ్‌ డుప్లెసిస్‌:

చేతివేలి గాయంతో ఫాఫ్‌ డుప్లెసిస్‌:

చేతివేలి గాయంతో బాధపడుతున్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఆదివారం మ్యాచ్‌ నాటికి కోలుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్‌ సమయంలో గాయపడిన మురళీ విజయ్‌ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆడేందుకు వీలు కాలేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. రైనా గాయపడటంతో మళ్లీ ఆ స్థానంలో మురళీ విజయ్‌కు ఆడే అవకాశం రావచ్చు.

 ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం మేరకు:

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం మేరకు:

బుధవారం తమిళ పార్టీలు చేపట్టిన రైల్‌రోకోలో ఓ ఉద్యమకారుడు అనూహ్య రీతిలో దుర్మరణం చెందాడు. దీంతో ఆందోళనకారుల ఆవేశం తారాస్థాయికి చేరింది. ఉద్యమం తీవ్రతరం కావడంతో మున్ముందు జరగబోయే మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని పోలీసు శాఖ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లను చెన్నైలో నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను పూణెకు తరలించడంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎలాంటి వ్యతిరేకతా లేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.

 ప్రత్యామ్నాయంగా నాలుగు నగరాలు ఎంపిక:

ప్రత్యామ్నాయంగా నాలుగు నగరాలు ఎంపిక:

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ హోం మ్యాచ్‌ల నిర్వహణ కోసం నాలుగు నగరాలను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసినట్టు సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు. ఈ నాలుగు ప్రధాన నగరాలు అవి విశాఖపట్నం, త్రివేండ్రం, పుణె, రాజ్‌కోట్‌. అయితే, ఈ నాలుగింటిలో చెన్నై ఫ్రాంచైజీ దృష్టిలో మొదటి పేరు మాత్రం విశాఖపట్నంగానే ఉందనే వార్తలు కూడా వెలువడ్డాయి.

 విశాఖపట్నం కంటే పూణె మెరుగైనదన్న బీసీసీఐ:

విశాఖపట్నం కంటే పూణె మెరుగైనదన్న బీసీసీఐ:

రాకపోకలు సాగించడానికి కూడా విశాఖపట్నం కంటే పూణె మెరుగైన నగరమని బీసీసీఐ భావించింది. వైజాగ్ నుంచి ఇండోర్ వెళ్లాలంటే ముందుగా ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి ఇండోర్ చేరుకోవాల్సి ఉంటుంది. పూణెకు మిగతా నగరాలతో మెరుగైన కనెక్టివిటీ ఉంది. ఈ కారణంగానే బీసీసీఐ వైజాగ్‌ను కాదని పూణె ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టోర్నీలో భాగంగా చెన్నై తమ తదుపరి హోం మ్యాచ్‌ను ఏప్రిల్ 20న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 16:25 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి