న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'తల్లిదండ్రులను నిరాశపర్చిన దానికంటే నువ్వే ఎక్కువ చేస్తున్నావ్'

IPL 2018, SRH vs RCB: Manish Pandey brutally trolled on Twitter after another flop show

హైదరాబాద్: ఐపీఎల్‌-11లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్‌.. సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయంతో ప్లేఆఫ్‌ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. చావోరేవో అనే మ్యాచ్ లో కోహ్లీ జట్టు అంతటి ప్రదర్శన చేయకపోవడంతపో లీగ్ లో ఏడో పరాజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఆర్‌సీబీ దాదాపు లీగ్‌ నుంచి నిష్క్రమించినట్లే కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా సన్‌రైజర్స్ అద్భుతమైన బౌలింగ్‌తో వరుసగా ఐదో విజయాన్ని సాధించినా.. బ్యాటింగ్‌లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌, విలియమ్సన్‌, యూసుఫ్‌ పఠాన్‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. మనీశ్‌ పాండే మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. హిట్టింగ్‌ చేస్తాడనే కారణంతో సన్‌రైజర్స్‌ ఇతడిని వేలంలో ఏకంగా రూ.11కోట్లకు కొనుగోలు చేసింది. కానీ పాండే‌ మాత్రం ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఒక్కటి కూడా ఆడలేదు.

చాహల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ రెండో బంతిని:

చాహల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ రెండో బంతిని:

సోమవారం మ్యాచ్‌లో అతను ఎంచుకున్న షాట్‌ మరింత పేలవం. చాహల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ రెండో బంతిని ఆడిన పాండే(5) పేస్‌ ఫీల్డింగ్‌లో ఉన్న కోహ్లికి సులభ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 38పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ నిలబెడతాడనే నమ్మకంతో కెప్టెన్‌ విలియమ్సన్‌.. అతనిని నాలుగో స్థానంలో దింపాడు. కానీ పాండే మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక మరోసారి విఫలమయ్యాడు.

విశ్రాంతి సమయం ఆసన్నమైందంటూ:

విశ్రాంతి సమయం ఆసన్నమైందంటూ:

దీంతో నిరాశకు గురైన అభిమానులు ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మనీశ్‌ పాండే మనస్సు ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోనే సమయం ఆసన్నమైందంటూ' కొందరు ట్వీట్‌ చేశారు.

నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ:

నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ:

మరికొందరైతే వేలంలో నీకు చెల్లించిన డబ్బును తిరిగి ఫ్రాంఛైజీకి ఇవ్వు. నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

 తల్లిదండ్రుల కంటే.. మనీశ్‌ పాండేనే

తల్లిదండ్రుల కంటే.. మనీశ్‌ పాండేనే

ఒక అభిమానైతే ఏకంగా ‘మా తల్లిదండ్రులను నిరాశపరుస్తున్న దాని కంటే.. మనీశ్‌ పాండేనే నన్ను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడంటూ' ట్వీట్‌ చేశాడు. ఇలా అభిమానులు ట్విటర్‌ వేదికగా ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌పై విమర్శలు కొనసాగిస్తున్నారు.

బౌలింగ్‌తో నెట్టుకొచ్చిన సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లోనూ:

బౌలింగ్‌తో నెట్టుకొచ్చిన సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లోనూ:

ఈ సీజనులో ఇప్పటివరకూ 10మ్యాచ్‌లాడిన మనీశ్‌ పాండే.. 9 ఇన్నింగ్సుల్లో కలిపి 184 పరుగులు మాత్రమే చేశాడు. బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌కు తర్వాతి మ్యాచ్‌లలోనైనా తన వంతుగా తోడ్పాటునందిస్తే అతనిపై పెట్టిన ఖర్చుకు న్యాయం చేసినట్లే. మరోవైపు ప్లే ఆఫ్‌ సమీపిస్తున్న తరుణంలో ప్రతి మ్యాచ్‌ కీలకమే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బౌలింగ్‌తో నెట్టుకొచ్చిన సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది.

Story first published: Tuesday, May 8, 2018, 12:50 [IST]
Other articles published on May 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X