న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Old Is Gold: ఐపీఎల్‌లో షేన్ వాట్సన్ మూడో సెంచరీ (వీడియో)

By Nageshwara Rao
IPL 2018: Shane Watson cracks his third IPL ton: Twitterati say Old Is Gold, pity RCB

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో రెండో సెంచరీ నమోదైంది. రాజస్థాన్ రాయల్స్‌తో పూణె వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ (106; 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు సెంచరీ నమోదు చేశాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

వాట్సన్ సెంచరీతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో వాట్సన్‌కి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో వాట్సన్‌ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.

తాజా శతకంతో ఐపీఎల్‌లో మూడు శతకాలు సాధించిన ఏబీ డివిలియర్స్‌, డేవిడ్‌ వార్నర్‌ సరసన చేరాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు క్రిస్‌ గేల్‌(6) పేరిట ఉండగా, కోహ్లీ(4) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, ఐపీఎల్ 11వ సీజన్‌లో క్రిస్ గేల్ తర్వాత సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

రాజస్థాన్ రాయల్స్‌పై మూడో సెంచరీ

రాజస్థాన్ రాయల్స్‌పై మూడో సెంచరీ

గత ఐపీఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరుపున రెండు సెంచరీలు సాధించిన షేన్ వాట్సన్... అదే రాజస్థాన్ రాయల్స్‌పై మూడో సెంచరీని సాధించాడు. చెన్నై ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ నుంచే షేన్ వాట్సన్ దూకుడుగా ఆడాడు. స్టువర్ట్ బిన్నీ వేసిన మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన వాట్సన్‌.. ఆ ఓవర్‌లో ఐదో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

రాహుల్ త్రిపాఠి ఇచ్చిన లైఫ్‌తో చెలరేగాడు

రాహుల్ త్రిపాఠి ఇచ్చిన లైఫ్‌తో చెలరేగాడు

షేన్ వాట్సన్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న రాహుల్ త్రిఫాఠి జారవిడిచాడు. ఆ తర్వాత ఓవర్‌లోనూ వాట్సన్ క్యాచ్‌ని మరోసారి త్రిపాఠి జారవిడచడంతో వాట్సన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలతో చెలరేగాడు. వాట్సన్‌ను ఔట్ చేసేందుకు గాను రహానే వరుసగా బౌలర్లను మార్చిన ప్రయోజనం లేకపోయింది.

రాజస్థాన్ విజయ లక్ష్యం 205 పరుగులు

రాజస్థాన్ విజయ లక్ష్యం 205 పరుగులు

51 బంతుల్లో సెంచరీ సాధించిన వాట్సన్ చివర్లో బెన్ లాఫ్లిన్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇదిలా ఉంటే రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

18.3 ఓవర్లలో 140 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్

18.3 ఓవర్లలో 140 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్

అనంతరం లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్‌ ఆటగాళ్లలో బెన్‌ స్టోక్స్‌(45) రాణించగా, జాస్‌ బట్లర్‌(22) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రేవో, కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, వాట్సన్‌, తాహీర్‌లు తలో వికెట్‌ తీశారు.

Story first published: Saturday, April 21, 2018, 14:58 [IST]
Other articles published on Apr 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X