న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 11లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన ప్రదర్శన ఇదే

IPL 2018: Royal Challengers Bangalore: Promised plenty but failed to deliver

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి సీజన్ ఆరంభంలో టైటిల్‌ను గెలుచుకునేంత స్థాయిలో ఆర్భాటం చేస్తుంది. చివరికి సాధారణంగానే మామూలు స్థాయి ప్రదర్శనతో సర్దేసుకుంటుంది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడి ఓడిపోయింది. దీంతో ఉన్న ఆఖరి అవకాశాన్ని కూడా కోల్పోయి ప్లేఆఫ్ బెర్త్‌ను గాలికొదిలేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంతవరకూ రాణించిందో పూర్తి సమీక్ష మీకోసం..

ఎంత వరకూ చేయగలిగారు:

మొత్తం జట్టులో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన ముగ్గురు వ్యక్తులు డివిలియర్స్, విరాట్ కోహ్ల, ఉమేశ్ యాదవ్. జట్టు కోసం బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకుంటూ ఓపెనర్ దగ్గర్నుంచి పలు రకాలుగా కష్టపడ్డాడు కెప్టెన్ కోహ్లీ. స్థాయికి తగ్గ ప్రదర్శన చేసిన ఉమేశ్ యాదవ్ పవర్ ప్లేలో కూడా మంచి ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేసి కీలకమైన వికెట్లను తీసి మెప్పించాడు. అతనితో పాటుగా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కాస్తంత పరవాలేదనిపించాడు.

చేతులెత్తేసిన సంగతులు:

చేతులెత్తేసిన సంగతులు:

చేయకూడని విషయాల్లో కోహ్లీ చేసిన పెద్ద పొరబాటు సీజన్ ఆరంభం నుంచి దూకుడు చూపించకపోవడం ఒకటి. ఆ సందర్భంలో డేనియల్ వెట్టోరి, ఆశిష్ నెహ్రాలపై ఆశలు పెట్టుకుని జట్టుని నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని కోహ్లీ తనంతట తానే డెత్ ఓవర్లలో బౌలింగ్ ఎలా వేయాలనే నిర్ణయాన్ని బౌలర్లకే వదిలేశానని అతనే ఒప్పుకున్నాడు. ఈ విషయంలో డెత్ ఓవర్లలో బెంగళూరు ఫెయిల్ అయిందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

విదేశీ ఆటగాళ్లను వాడుకునే ప్రయత్నంలో

విదేశీ ఆటగాళ్లను వాడుకునే ప్రయత్నంలో

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... విదేశీ ఆటగాళ్లను వాడుకునే ప్రయత్నంలో చాలా ప్రయోగాలు చేసి విఫలమైంది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్‌ను టోర్నమెంట్ ఆరంభంలో ఐదు మ్యాచ్‌లు ఆడించి ఆశించిన ఫలితం రాకపోవడంతో బెంచ్‌కే పరిమితం చేసింది. అప్పటికి వోక్స్ 8 వికెట్లు తీశాడు. ఆ తర్వాత మొయిన్ అలీ జట్టుకు మరో ప్రధాన బలం ఈ ఆల్ రౌండర్. మొయిన్ అలీ లీగ్ ఆఖరి మ్యాచ్ వరకూ తుది జట్టులో కొనసాగి చక్కటి ప్రదర్శనే ఇచ్చాడు. దీంతో పాటుగా ఐపీఎల్ వేలంలో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్‌ను జట్టు యాజమాన్యం కొనుగోలు చేయకపోవడం ప్రధాన లోపం. వారిద్దరూ ప్రత్యర్థులలో ఒకరైన పంజాబ్ జట్టుకు ప్రధాన బలంగా మారారు.

అసంతృప్తిపరచిన ఆటగాడు:

అసంతృప్తిపరచిన ఆటగాడు:

సర్ఫరాజ్ ఖాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్‌ను నిలుపుకుంది. ఈ మేరకు క్రిస్ గేల్, రాహుల్‌లను వదిలేసి పెద్ద తప్పు చేసింది. సర్ఫరాజ్ లీగ్ మొత్తంలో ఏడు మ్యాచ్‌లు ఆడి 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇక జరగాల్సింది:

ప్రస్తుతం ఐపీఎల్ 11 నుంచి బెంగళూరు పూర్తిగా నిష్క్రమించినట్లే. మున్ముందు రాబోయే సీజన్ల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలి. స్వదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నట్లైతే ప్రభావాలు ఇంకొంచెం సానుకూలంగానే ఉండేవి.

అత్యధిక పరుగులు చేసింది: విరాట్ కోహ్లీ: 530 (50s: 4)

అత్యధిక వికెట్లు తీసింది: ఉమేశ్ యాదవ్: 0 (Eco: 7.86, Best: 3/23)

Story first published: Monday, May 21, 2018, 14:21 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X