న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: RRvSRH:11 పరుగుల తేడాతో విజయం, మళ్లీ ఫామ్‌లోకి హైదరాబాద్

ipl-2018-rajasthan-royals-vs-sunrisers-hyderabad-28th-match-report-from-jaipur-stadium

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ బీభత్సమైన పోరుకు జైపూర్‌లోని సవాయి మన్‌సింగ్ స్టేడియం వేదికైంది.రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన అలెక్స్ హేల్స్ 39 బంతుల్లో (45), కేన్ విలియమ్సన్ 43 బంతుల్లో (63) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు సన్‌రైజర్స్ 151 పరుగులు చేసింది. మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(2/18) బౌలింగ్ హైలెట్.

14.5 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 3 వికెట్లకు 116 పరుగులు చేసి మెరుగైన స్థితిలోనే ఉంది. విలియమ్సన్, హేల్స్ నిష్క్రమణతో రాజస్థాన్ బౌలర్లు ఎదురుదాడికి దిగారు. బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయకుండా కట్టుదిట్టంగా బంతులేశారు. ఇన్నింగ్స్ ఆఖర్లో మనీశ్ పాండే(16) మినహా మిగతా వారంతా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. కృష్ణప్ప గౌతం రెండు వికెట్లు తీశాడు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి:

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వేగం పెంచింది. ధాటిగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి 70/1తో నిలిచింది. ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ 32 బంతుల్లో (37), మొదటి వికెట్ ధావన్‌ను కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌ 24 బంతుల్లో (27) దూకుడు పెంచారు. స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.


రెండో ఓవర్ మొదటి బంతికే ధావన్ అవుట్:
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన 2.1వ బంతికి ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ (6) 4 బంతులు ఆడి ఔటయ్యాడు. దీంతో మొదటి 3 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి 20 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అలెక్స్ హేల్స్‌ 10 బంతుల్లో (12)2×4) నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ (2)క్రీజులోకి వచ్చాడు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆదివారం రెండు మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగ కానుంది. హైదరాబాద్ జట్టు భారీ పరుగులు చేయలేకపోయిన బౌలింగే బలంగా బరిలోకి దిగనుంది.

హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ స్కోరు కార్డు:

ఆఖరి సారిగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పంజాబ్ జట్టును ఓడించి విజయోత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకూ ఆడిన ఏడు మ్యాచ్‌లలో 5 గెలుపొందింది. ప్రస్తుతం లీగ్ పట్టికలో నంబర్ 1గా ఉన్న హైదరాబాద్ నంబర్ 5 రాజస్థాన్ జట్టుతో పోరాడేందుకు సన్నద్ధమైంది. రాజస్థాన్ జట్టు ఆల్-రౌండర్ కృష్ణప్ప గౌతం ప్రదర్శనతో ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది.

ఇక సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో వచ్చిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ అలెక్స్‌ హేల్స్‌ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. మహ్మద్‌ నబీ స్థానంలో ఈ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఇక రాజస్తాన్‌ జట్టులో ఇద్దరు యువఆటగాళ్లు ఇష్‌ సోది, మహీపాల్ లోమ్మెర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నారు.


రాజస్థాన్ జట్టు:

Ajinkya Rahane (c), Rahul Tripathi, Sanju Samson, Ben Stokes, Jos Buttler (wk), Krishnappa Gowtham, Jofra Archer, Mahipal Lomror, Jaydev Unadkat, Dhawal Kulkarni, Ish Sodhi

హైదరాబాద్ జట్టు:

Shikhar Dhawan, Alex Hales, Kane Williamson (c), Manish Pandey, Shakib Al Hasan, Yusuf Pathan, Wriddhiman Saha (wk), Rashid Khan, Basil Thampi, Siddarth Kaul, Sandeep Sharma

Story first published: Sunday, April 29, 2018, 19:54 [IST]
Other articles published on Apr 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X