న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: ఆదుకున్న డుప్లెసెస్, ఫైనల్‌ చేరిన చెన్నై సూపర్‌కింగ్స్

By Nageshwara Rao
CSK

హైదరాబాద్: రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్‌ 11వ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్ నిలిచింది. ప్లేఆఫ్‌లో భాగంగా వాంఖడె వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి ఫైనల్‌ బెర్తును సీఎస్‌కే ఖరారు చేసుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఫా డుప్లెసిస్(42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సులు)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి మూడు ఓవర్లలో చెన్నై విజయానికి 43 పరుగులు అవసరమైన తరుణంలో డుప్లెసిస్‌ చెలరేగాడు.

బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే విజయాని కావాల్సిన స్కోరును తగ్గించుకుంటూ వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా, డుప్లెసిస్‌ తొలి బంతినే సిక్స్‌ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. అతనికి జతగా శార్దూల్‌ ఠాకూర్‌(15 నాటౌట్‌) చక్కటి సహకారం అందించడంతో చెన్నై ఐదు బంతులుండగానే విజయం సాధించింది.

1
43467

ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్... ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. శుక్రవారం (మే 25)న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకోగా భువీకి ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.


15 ఓవర్లకు చెన్నై 92/7
ప్లేఆఫ్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్లు జోరు కొనసాగిస్తున్నారు. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లో వాట్సన్(0) కీపర్ గోస్వామికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

అనంతరం ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ బౌలింగ్‌కి వచ్చిన సిద్ధార్థ కౌల్ వరుస బంతుల్లో సురేశ్ రైనా (22), అంబటి రాయుడు (0)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్‌పైకి వెళ్లి ఆడేందుకు ప్రయత్నించే క్రమంలో సురేశ్ రైనా బౌల్డ్ అవ్వగా, యార్కర్ బంతిని అర్థం చేసుకోలేక రాయుడు(0) ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు.

దీంతో చెన్నై 24 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని (9) ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ వేసిన గూగ్లీని అంచనా వేయడంలో విఫలమైన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డ్వేన్ బ్రావో (7), జడేజా (3), దీపక్ చహర్ (10) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 7 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.


ధోని ఔట్: 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై
ప్లేఆఫ్‌లో భాగంగా వాంఖడె వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్లు జోరు కొనసాగిస్తున్నారు. పవర్‌ప్లే ముగిసేలోపే మూడు కీలక వికెట్లు చేజార్చుకున్న చెన్నై.. ఎనిమిదో ఓవర్‌లో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ధోనీ (9) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్‌ (13), డ్వేన్‌ బ్రావో (3) పరుగులతో ఉన్నారు.


మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై
ప్లేఆఫ్‌లో భాగంగా వాంఖడె వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తడబడుతోంది. సన్‌రైజర్స్ బౌలింగ్‌ను ఎదుర్కొనలేక చెన్నై బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.

భువీ వేసిన తొలి ఓవర్‌లో వాట్సన్(0) కీపర్ గోస్వామికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన సురేష్ రైనా(22) సిద్ధార్ద్‌ కౌల్‌ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే రాయుడు(0) ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో చెన్నై 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజులో ధోనీ(7), డుప్లెసిస్(3) ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
వాంఖడె వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ వికెట్ కీపర్ గోస్వామికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి ఓవర్ ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టానికి ఒక పరుగు చేసింది. క్రీజులో రైనా (1), డుప్లెసిస్(0) పరుగుతో ఉన్నారు.


చెన్నై విజయ లక్ష్యం 140
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చివర్లో కార్లోస్ బ్రాత్‌వైట్ (43 29 బంతుల్లో, 4 సిక్సులు, ఒక ఫోర్) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 140 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టుకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే శిఖర్ ధావన్ బౌల్డవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (24 దూకుడుగా ఆడినా జట్టు స్కోరు 36 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శ్రీవాత్స గోస్వామి (12) పెవిలియన్‌కు చేరాడు.

ఒత్తిడిలో పడిన హైదరాబాద్ జట్టుని మనీశ్ పాండే (3)తో కలిసి ఆదుకునేలా కనిపించిన షకీబ్(12) వైడ్‌గా వెళ్తున్న బంతిని హిట్ చేయబోయి ఔటయ్యాడు. ఈ దశలో చెన్నై బౌలింగ్‌లో భారీ స్కోర్ సాధించడంలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు తడబడ్డారు. జడేజా వేసిన 12వ ఓవర్‌ మూడో బంతికి మనీశ్ పాండే(8) జడేజాకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత యూసుఫ్ పఠాన్(24) బ్రావో బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాత్‌వైట్ చెలరేగాడు. 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సుల సాయంతో 43 పరుగులు చేసి జట్టు గౌరవప్రద స్కోరుని అందించాడు. లేకుంటే.. ఆ జట్టు ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. చెన్నై బౌలింగ్‌లో బ్రావో రెండు, చాహర్, ఎంగిడి, ఠాకూర్, జడేజా తలో వికెట్ తీశారు.


15 ఓవర్లకు హైదరాబాద్ 88/6
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా వికెట్లు చేజార్చుకుంటోంది. 15 ఓవర్లకు గాను హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. బ్రావో వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఆఖరి బంతికి యూసఫ్ పఠాన్ (24) పరుగుల వద్ద అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కార్లోస్ బ్రాత్ వైట్(4), భువనేశ్వర్ కుమార్(0) పరుగులతో ఉన్నారు.


69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా వికెట్లు చేజార్చుకుంటోంది. 12 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ మూడో బంతికి మనీష్ పాండే(8) పరుగుల వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో యూసఫ్ పఠాన్(10), కార్లోస్ బ్రాత్‌వైట్(0) పరుగులతో ఉన్నారు.


10 ఓవర్లకు హైదరాబాద్ 64/4
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా వికెట్లు చేజార్చుకుంటోంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే శిఖర్ ధావన్ బౌల్డవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (24 దూకుడుగా ఆడినా జట్టు స్కోరు 36 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శ్రీవాత్స గోస్వామి (12) పెవిలియన్‌కు చేరాడు. ఒత్తిడిలో పడిన హైదరాబాద్ జట్టుని మనీశ్ పాండే (3)తో కలిసి ఆదుకునేలా కనిపించిన షకీబ్(12) వైడ్‌గా వెళ్తున్న బంతిని హిట్ చేయబోయి ఔటయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. క్రీజులో యూసఫ్ పఠాన్(9), మనీష్ పాండే(6) పరుగులతో ఉన్నారు.


50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 50 పరుగులకే హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డ్వేన్ బ్రావో వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ నాలుగో బంతికి షకీబ్ ఉల్ హాసన్(12) పరుగుల వద్ద వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యూసఫ్ పఠాన్(1), మనీష్ పాండే(2) పరుగులతో ఉన్నారు.


మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ రెండో బంతికి కేన్ విలియమ్సన్(24) పరుగుల వద్ద వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 5 ఓవర్లకు గాను హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షకీబ్ ఉల్ హాసన్(5), మనీష్ పాండే(0) పరుగులతో ఉన్నారు.


గోస్వామి ఔట్: రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. లుంగి ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ ఐదో బంతికి శ్రీవత్స్ గోస్వామి (12) పరుగుల వద్ద అతడికే నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(22), మనీష్ పాండే(0) పరుగులతో ఉన్నారు.


3 ఓవర్లకు హైదరాబాద్ 28/1
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 3 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ తొలి బంతికే ధావన్ ఔట్ కావడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్, మరో ఓపెనర్ గోస్వామితో కలిసి స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(21), గోస్వామి(7) పరుగులతో ఉన్నారు.


తొలి బంతికే ధావన్ ఔట్
వాంఖడె వేదిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టుకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ ఛాహర్ వేసిన తొలి బంతికే హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధeవన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 1 ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ 1 వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం విలియమ్సన్(12), గోస్వామి(0) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్ టోర్నీలో భాగంగా కీలకమైన క్వాలిఫైయర్-1 మ్యాచ్ సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతుండగా, చెన్నై మాత్రం తుది జట్టులో ఒక మార్పు చేసింది. సామ్ బిల్లింగ్స్ స్థానంలో షేన్ వాట్సన్‌కు తుది జట్టులో చోటు కల్పించింది.

లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలని చెన్నై ఊవిళ్లూరుతుండగా, లీగ్ దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో చెరో 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 18 పాయింట్లు సమానంగా ఉన్నాయి. అయితే నెట్ రన్‌రేట్ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

తద్వారా క్వాలిఫయిర్-1లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్తుని ఖరారు చేసుకోగా, ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది. క్వాలిఫయిర్-1లో ఓడిన జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడుతుంది కాబట్టి. ఈ మ్యాచ్ శుక్రవారం (మే 25)న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

క్వాలిఫయిర్-1లో తలపడనున్న రెండు జట్లు ఒకటే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ సీజన్‌లో చెన్నై జట్టు ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొడుతోంది. ఇక, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్ బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విలియమ్సన్, శిఖర్ ధావన్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ విలియమ్సన్ (661 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు దూసుకెళ్లడం ఖాయం.


జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్:

అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేష్ రైనా, డుప్లెసిస్, ధోనీ(కెప్టెన్/కీపర్), డ్వెన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్, లుంగి ఎంగిడి.

సన్‌రైజర్స్ హైదరాబాద్:
శిఖర్ ధవన్, శ్రీవత్స్ గోస్వామి(కీపర్), కేన్ విలియమ్‌‌సన్(కెప్టెన్), మనీశ్ పాండే, కరోల్స్ బ్రాత్‌వైట్, షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్త్ కౌల్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ.

Story first published: Tuesday, May 22, 2018, 23:11 [IST]
Other articles published on May 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X