న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ మ్యాచ్ ఆపేయాలంటూ.. చెపాక్ స్టేడియం బయట ఆందోళనకారులు

IPL 2018: Pro Tamil activists protest outside stadium against CSK home matches

హైదరాబాద్: మరి కొద్ది గంటల్లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై, కోల్‌కతా జట్టు ఐపీఎల్‌లో తమ రెండో మ్యాచ్‌ను ఆడనున్నాయి. ఇప్పటికే మ్యాచ్‌ను నిలిపివేయాలంటూ కోర్టులో కేసు ఫైల్ చేసినా, బీసీసీఐకి విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో చెన్నై ఆందోళనకారులు చెన్నైలోని స్టేడియం బయట మ్యాచ్ ను నిలిపివేస్తామంటూ సిద్ధమయ్యారు. కావేరీ నది ప్లెక్సీలు, ప్లకార్డులతో స్టేడియం బయట తమ నిరసన తెలుపుతున్నారు.

నినాదాలు చేస్తున్న కొందరిని

నినాదాలు చేస్తున్న కొందరిని

ఇప్పటికే ఆందోళన మొదలుపెడుతున్న కొంతమందిని పోలీసులు అదుపుచేసి అదుపులోకి తీసుకున్నారు. వారంతా చెన్నైలో మ్యాచ్ జరగకూడదంటూ నినాదాలతో ఉద్యమాన్ని రేకెత్తిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు స్టేడియంను కూడా ముట్టడిస్తామని కొన్ని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. దీంతో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రతికూలతను ముందుగానే ఊహించిన బీసీసీఐ దాదాపు 4000మంది పోలీసులతో భద్రతా దళాన్ని సిద్ధం చేసింది.

 పోలీసులు ఆంక్షలు విధించారు

పోలీసులు ఆంక్షలు విధించారు

అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించాయి. కొన్ని ప్రజా సంఘాలు మ్యాచ్‌ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో టిక్కెట్లు కొన్నట్లు సమాచారం కూడా ఉందట. అందుకే స్టేడియంలోకి వచ్చేవారిపై పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు.

 వాటర్ బాటిల్స్, ప్లకార్డులు

వాటర్ బాటిల్స్, ప్లకార్డులు

వాటర్ బాటిల్స్, ప్లకార్డులు వంటివాటిని తీసుకు రాకూడదని సూచించారు. అలాగే నల్ల దుస్తుల్ని కూడా అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. మొత్తం మీద కావేరీ సెగల ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్‌ల మీద కూడా పడింది.

కేవలం ఆరు వారాల గడువే

కేవలం ఆరు వారాల గడువే

కావేరీ జలాల పంపకాలపై కర్ణాటకకు, చెన్నైకు మధ్య సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రివర్స్ బేసిన్ గుండా 10టీఎంసీల నీరు తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో కర్ణాటకకు 270టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. అంటే 14.75టీఎంసీల వాటాను చెన్నైకు తగ్గించినట్లే. అయితే మినహాయించిన వాటాను వాడుకునేందుకు కేవలం ఆరు వారాల గడువే ఉండటంతో చెన్నై వాసులు ఆందోళనపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతుండటం దీనికి ఆటంకంగా మారుతుండటంతో వాటిని నిలిపివేయాలంటూ నిరసనకు యోచిస్తున్నారు.

Story first published: Tuesday, April 10, 2018, 16:55 [IST]
Other articles published on Apr 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X