న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం: రాజస్థాన్ ఇంటికి, సన్‌రైజర్స్‌తో క్వాలిఫయర్‌-2

By Nageshwara Rao
 Kolkata Knight Riders

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌‌నైడర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి, రహానేలు చక్కటి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం చావ్లా బౌలింగ్‌ త్రిపాఠి(20) అతడికే నేరుగా క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో కలిసి రహానే స్కోరు బోర్డుని నడిపించాడు.

ఈ క్రమంలో జట్టు స్కోర్‌ 109 పరుగుల వద్ద రహానే (46) కుల్దీప్‌కు నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌తొ శాంసన్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో శాంసన్‌ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఆ మరుసటి బంతికే భారీషాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. చివర్లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఒత్తిడికిలోనైన రాజస్థాన్ వరుసగా వికెట్లు సమర్పించుకుంది. కోల్‌కతా బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు తీయగా, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌లు తలో వికెట్‌ తీశారు.

ఈ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ శుక్రవారం ఇదే వేదికగా క్వాలిఫయిర్-2లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ముంబైలోని వాంఖడె వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. చెన్నై ఇప్పటికే ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.


రాజస్థాన్ విజయానికి 30 బంతుల్లో 59
కోల్‌కతా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్‌ 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న అజింక్య రహానె (46)ను కుల్దీప్‌ యాదవ్‌ పెవిలియన్‌కు చేర్చగా, సంజూ శాంసన్‌ (43) దూకుడుగా ఆడుతున్నాడు. క్రీజులో హెన్రిచ్‌ క్లాసెన్‌ (1) అతడికి సహకారం అందిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయం సాధించాలంటే ఇంకా 30 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది.


12 ఓవర్లకు రాజస్థాన్ రాయల్స్ 96/1
ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. 12 ఓవర్లు ముగిసే సమయానికి 96/1తో నిలిచింది. ప్రస్తుతం రాజస్థాన్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో రహానే(41), సంజు శాంసన్ (34) పరుగులతో ఉన్నారు.


నిలకడగా రాజస్థాన్‌
ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతన్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ నిలకడగా ఆడుతోంది. 170 పరుగుల లక్ష్య ఛేదనలో 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. రహానె (37), సంజూ శాంసన్‌ (29) పరుగులతో క్రీజులో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
170 లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ జట్టుకు ఓపెనర్లు రహానే, రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే పీయూష్ చావ్లా వేసి ఆరో ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి(20) చావ్లాకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 1 వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో రహానే(28), శాంసన్(2) ఉన్నారు.


రాజస్థాన్ విజయ లక్ష్యం 170
ఈడెన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్(38 బంతుల్లో 52; 4 పోర్లు, 2 సిక్సులు), ఆండ్రి రస్సెల్ (25 బంతుల్లో 49; 3 ఫోర్లు, 5 సిక్సులు) రాణించడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లోతొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టుకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణప్ప గౌతమ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి ఓపెనర్ నరైన్(4) స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప(3), రానా(3), క్రిస్ లిన్(18) స్వల్ప పరుగుల తేడాతో పెవిలియన్ చేరారు.

అనతంరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ దినేశ్ కార్తీక్ జట్టుని ఆదుకున్నాడు. శభ్‌మాన్ గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే జోఫ్రా ఆర్చర్ వేసిన 15వ ఓవర్ రెండో బంతికి గిల్(28) కీపర్ క్లాసెన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా సరే, దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

లాఫ్లిన్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి రహానేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రస్సెల్ విజృంభించాడు. 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 49 పరుగులు చేసి కోల్‌కతాకు భారీ స్కోరు అందించాడు.

రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు 170 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బౌలర్లలో గౌతమ్ కృష్ణప్ప, జోప్రా ఆర్చర్, లాఫ్లిన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా... శ్రేయాస్ గోపాల్‌కు ఒక వికెట్ తీశారు.


15 ఓవర్లకు కోల్‌కతా 114/5
ఈడెన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి శుభ్‌మన్‌ గిల్‌ (28) ఔటయ్యాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి నైట్‌రైడర్స్‌ 5 వికెట్లుకోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజులో దినేశ్‌ కార్తీక్‌ (43), రసెల్‌ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు.


సత్తా చాటుతోన్న రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్లు
ఈడెన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు. సరైన సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. జట్టు స్కోరు 51 వద్ద శ్రేయాస్ గోపాల్‌ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (18) బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌ (26), శుభ్‌మన్‌ గిల్‌‌ (2) పరుగులతో ఉన్నారు.


నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఈడెన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లు చెలరేగుతున్నారు. శ్రేయాస్ గోపాల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్(18) పరుగుల వద్ద అతడికే నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 8 ఓవర్లకు గాను కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దినేశ్ కార్తీక్(16) పరుగులతో ఉన్నాడు.


5 ఓవర్లకు కోల్‌కతా 32/3
ఈడెన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్పిన్నర్ గౌతమ్ రెండో బంతికి ఓపెనర్ నరైన్(4) పరుగుల వద్ద స్టంప్ ఔట్ కాగా, ఆ తర్వాత మూడో ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన గౌతమ్.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప (3)ని కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత నితీష్ రానా (3) పరుగుల వద్ద జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఉనాద్కత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో దినేశ్ కార్తీక్(5), క్రిస్ లిన్(10) పరుగులతో ఉన్నారు.


రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఈడెన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. కృష్ణప్ప గౌతమ్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి రాబిన్ ఉతప్ప(3) పరుగుల వద్ద అతడికే నేరుగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రిస్ లిన్ (7), నితీష్ రాణా(1) పరుగుతో ఉన్నారు.


రెండో బంతికే వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ఈడెన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టుకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణప్ప గౌతమ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి ఓపెనర్ నరైన్(4) పరుగుల వద్ద స్టంప్ ఔటయ్యాడు. దీంతో ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో క్రిస్ లిన్ (3), రాబిన్ ఊతప్ప(3) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కారణం.. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌పై కోల్‌కతానే విజయం సాధించింది కాబట్టి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సమతౌల్యంగా ఉంది.

లీగ్ దశలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించన కోల్‌కతా ఎటువంటి సమీకరణలకు తావులేకుండా ఫ్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్లేఆఫ్స్‌కు చేరిన మిగతా 3 జట్లకు లేని అదనపు బలం (సొంతగడ్డపై ఆడనుండటం) కోల్‌కతాకు బాగా కలిసి రానుంది.

క్వాలిఫయర్‌-2 కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ జట్టుతో ఇదే వేదికగా తలపడాల్సి ఉంటుంది.

1
43468

జట్ల వివరాలు:
కోల్‌కతా నైట్ రైడర్స్:

క్రిస్‌లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, శుభమన్ గిల్, జవాన్ సియర్లాస్, పీయూస్ చావ్లా, ప్రసీద్, కుల్దీప్ యాదవ్

రాజస్థాన్ రాయల్స్:
రాహుల్ త్రిపాఠి, అజింక్య రహానె, సంజు శాంసన్, హెన్రిచ్ క్లాసెన్, గౌతమ్, స్టువర్ట్ బిన్నీ, జోప్రా ఆర్చర్, ఇస్ సోధి, జయదేవ్ ఉనద్కత్, శ్రేయాస్ గోపాల్, బెన్ లాలిన్

Story first published: Wednesday, May 23, 2018, 23:03 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X