అంగరంగ వైభవంగా ఐపీఎల్ ఆరంభోత్సవం, హాజరుకానున్న ప్రముఖులు

Posted By:
IPL 2018 Has Confirmed Its Star Casting
IPL 2018 Opening Ceremony, Start Date, Time, Venue; List of Bollywood performers

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ ఐపీఎల్. ఏప్రిల్ 7న చెన్నై, ముంబై జట్ల మధ్య జరగనున్న తొలిపోరుతో ఈ సంరంభం మొదలుకానుంది. దీనిని పురస్కరించుకొని తారాస్థాయిలో వేడుకలను నిర్వహించాలని బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. కెప్టెన్లతో పాటు, బాలీవుడ్ నుంచి టాప్ హీరో, హీరోయిన్లు కూడా వేడుకకు హాజరుకానున్నారు.

ఆకర్షిణీయంగానూ ఉండేలా బీసీసీఐ:

ఆకర్షిణీయంగానూ ఉండేలా బీసీసీఐ:

ఈ సారి ఐపీఎల్‌కు ప్రత్యేకతేంటంటే.. రెండేళ్ల నిషేదం అనంతరం చెన్నై, రాజస్థాన్ జట్లు తిరిగి ఆడుతుండటం. ఇప్పటివరకు పాత జట్లతో కలిసి ఆడుతున్న ఆటగాళ్లు జనవరిలో జరిగిన వేలంతో కొత్త జట్లకి మారిపోవడం. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలను ఘనంగానూ అత్యంత ఆకర్షిణీయంగానూ ఉండేలా బీసీసీఐ తీర్చిదిద్దుతోంది. తొలి మ్యాచ్ జరగనున్న ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ వేడుకకు వేదికకానుంది.

వేడుకలో అలరించనున్న సినీ తారలు;

వేడుకలో అలరించనున్న సినీ తారలు;

బాలీవుడ్ నుంచి పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ డ్యాన్స్‌లతో అలరించనున్నారు. అంతకుముందు అనుకున్నట్లు రణవీర్ సింగ్ భుజానికి గాయం కారణంగా హాజరుకాలేకపోతున్నాడు. ఆయన స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్వహకులు హృతిక్ రోషన్‌ను ఆహ్వానించినట్లు సమాచారం.

ఎప్పుడు, ఎంతసేపు జరుగుతుందో:

ఎప్పుడు, ఎంతసేపు జరుగుతుందో:

ఈ వేడుక 90నిమిషాల పాటు జరగనుంది. దాదాపు సాయంత్రం 7:15నిమిషాలకు ముగిసేలా ఏర్పాటు చేశారు. అంటే సరిగ్గా మొదటి మ్యాచ్‌ టాస్ పడటానికి 15నిమిషాల ముందు ముగిసిపోతాయన్నమాట.

ఆరంభ సమయం: ఏప్రిల్ 7, సాయంత్రం 5:30 గంటలకు

ప్రసారం చేయనున్న ఛానెళ్లు: స్టార్ స్పోర్ట్స్ 1, హెచ్‌డీ 1, స్టార్ స్పోర్ట్స్ 3, హెచ్‌డీ 3, స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఇలా 12 ఛానెళ్ల వరకూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
అందరికీ అలవాటైన 'హాట్ స్టార్' ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో చూపించనుంది.

వేడుక: ముంబైలోని వాంఖడే స్టేడియం

ప్రతి జట్టు 14మ్యాచ్‌లు ఆడనుంది:

ప్రతి జట్టు 14మ్యాచ్‌లు ఆడనుంది:

ఏటా జరిగేదానికి విరుద్ధంగా ఈ సారి ఇద్దరు కెప్టెన్లు మాత్రమే హాజరుకానున్నారు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మలు మినహాయించి మిగిలిన వారెవ్వరూ హాజరుకాలేరు. ప్రతి జట్టు మిగిలిన జట్లతో కలిపి 14మ్యాచ్‌ల వరకూ ఆడనుంది. ఒక్కో జట్టు తమ సొంత నేలపై ఏడు మ్యాచ్‌లు వరకూ ఆడుతోంది. ఏ రోజుకారోజు లీగ్ మ్యాచ్ పూర్తి అయిన వెంటనే.. పాయింట్ల ఆధారంగా టాప్ 4 స్థానాల్లో ఉండాల్సిన జట్టును ప్రకటిస్తారు. ఈ లీగ్ 51 రోజుల పాటు జరగనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 3, 2018, 14:55 [IST]
Other articles published on Apr 3, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి