ఐపీఎల్ ఆరంభం అదిరింది: అట్టహాసంగా ఐపీఎల్‌ 11వ సీజన్ ఆరంభ వేడుకలు

Posted By:
IPL 2018 Opening Ceremony : ప్రారంభమైన ఐపీఎల్ 11వ సీజన్
IPL 2018 Opening Ceremony, Live updates from Wankhede Stadium, Mumbai

ఐపీఎల్ 11వ సీజన్‌కు అట్టహాసంగా తెరలేచింది. శనివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో లేజర్‌ కాంతుల మధ్య ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్లు తమన్నా, జాక్వెలిన్ తమ డ్యాన్స్‌లతో అలరించారు.

ముందుగా ఏబీసీడీ సినిమాలోని పాటకు వరుణ్‌ ధావన్‌ డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులతో అలరించగా, అనంతరం ప్రభుదేవా తన డ్యాన్స్‌తో అభిమానుల్లో మంచి జోష్‌ను తీసుకొచ్చాడు. ఈ క‍్రమంలోనే వరుణ్‌ ధావన్‌తో కలిసి ముక్కాములా పాటకు ప్రభుదేవా చేసిన స్టేడియంలోని డ్యాన్స్‌ వీక్షకుల్ని అమితంగా ఆకర్షించింది.

ఆ తర్వాత డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర‍్మ ఐపీఎల్‌ ట్రోఫీని వేదికపైకి తీసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఆరంభ వేడుకలను ఎంజాయ్ చేశారు. కిక్కిరిసిన అభిమానుల మధ్య ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభమైంది. గంట పాటు సాగిన ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు అలరించారు.


ఐపీఎల్ ఆరంభ వేడుకలు సాగాయి ఇలా:

ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో చివరి ప్రదర్శన హృతిక్ రోషన్‌దే
ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో చివరి ప్రదర్శన హృతిక్ రోషన్‌ ఇచ్చాడు. తన సినిమాల్లో ఆల్ టైమ్ హిట్ సాంగ్ 'ధూమ్ ధూమ్' పాటకు స్టెప్పులు ఇరగదీశాడు. బాలీవుడ్ తారలు చేసిన డ్యాన్స్‌లు వాంఖడెలోని అభిమానులను ఎంతగానో అలరించాయి. ఐపీఎల్ ఆరంభ వేడుకలు ముగియడంతో ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభమైంది.


జాక్వలిన్‌తో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్

వాంఖడె స్టేడియంలో జాక్వలిస్ తన సూపర్ డ్యాన్స్‌‌తో అలరించింది. జాక్వలిన్ డ్యాన్స్‌ స్టేడియంలోని అభిమానులను ఎంతగానో అలరించింది.

తమన్నా ప్రదర్శన తర్వాత స్టేజిపైకి మికా
తమన్నా డ్యాన్స్ అభిమానులను ఎంతగానో అలరించింది. తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ మెడ్లీకి డ్యాన్సులు చేసింది. ఐపీఎల్ వేదికపై పది నిమిషాలపాటు ప్రదర్శన ఇచ్చేందుకు తమన్నా రూ.50 లక్షలు పారితోషికం తీసుకుంది. అనంతరం స్టేజిపైకి వచ్చిన మికా తన పాటలతో అలరించాడు.

ముంబై క్రికెట్ ఫ్యాన్స్‌ని రోహిత్ శర్మ
'ఇక్కడికి వచ్చిన అభిమానుల కోసం మేము మూడు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గాం. ఈ ఏడాది జరిగే టోర్నీలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం' అనగానే వాంఖడెలోని అభిమానులు తమ కెప్టెన్‌కు మద్దతుగా గట్టిగా కేకలు వేశారు.

కెప్టెన్ల ప్రమాణ స్వీకారం
ఐపీఎల్ నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తామని, న్యాయంగా ఆడుతామని ఎనిమిది జట్లకు చెందిన కెప్టెన్లు ప్రమాణం చేశారు. ఈ ప్రమాణాన్ని డిజిటల్ సంతకాల ద్వారా ఐపీఎల్ నిర్వాహకులు నిర్వహించారు. కొన్ని అనుకోని కారణాల ఐపీఎల్ ఆరంభ వేడుకలకు ముంబై, చెన్నై జట్లకు చెందిన ఇద్దరు కెప్టెన్లు మాత్రమే హాజరైన సంగతి తెలిసిందే.

రంగంలోకి ప్రభుదేవా
ప్రభుదేవా ఇప్పుడే స్టేజిపైకి వచ్చాడు. వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీశాడు. వీరిద్దరూ కలిసి స్టేజిపై అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ప్రభుదేవా 'ముకాబులా' పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేశాడు. అనంతరం ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు.

బాల్ రోలింగ్ డ్యాన్స్‌తో అదరగొట్టిన వరుణ్ ధావన్:
ఐపీఎల్ 11వ సీజన్‌లో తొలి ప్రదర్శనను బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఇచ్చాడు. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశాడు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తుంటే అభిమానులంతా పూనకం వచ్చిన వారిలాగా ఊగిపోయారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.

ఐపీఎల్ ప్రారంభమైనట్లు ప్రకటించిన చైర్మన్ రాజీవ్ శుక్లా
ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఐపీఎల్ స్టేజిపైకి సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పరిపాలనా కమిటీ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జి స్టేజి పైకి వచ్చారు. వీరితో పాటు బీసీసీఐ తాత్కాలిక ఛైర్మన్ సీకే ఖన్నా, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలు కూడా ఉన్నారు. అనంతరం ఐపీఎల్ 11వ సీజన్‌ ప్రారంభమైనట్లు రాజీవ్ శుక్లా ప్రకటించారు.

ఐపీఎల్ 11వ సీజన్ ప్రైజ్ మనీ వివరాలివే:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ విన్నర్‌గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 12.5 కోట్లుగా ప్రైజ్ మనీని నిర్వాహకులు నిర్ణయించారు. ఇక 3వ స్ధానంలో నిలిచిన జట్టుకు రూ. 8.75 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 8.75 కోట్లు ఇవ్వనున్నారు. ప్రతి మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌, అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్లకు ఇచ్చే బహుమతులకు ఇది అదనం.

నిబంధనలు:
ఎనిమిది జట్లు లీగ్ దశలో మొత్తం కలిపి 56 మ్యాచ్‌లు ఆడుతాయి.
ప్రతీ రెండు టీంలు హోం-అవే పద్దతిలో తలో రెండు మ్యాచ్లు ఆడుతాయి.
లీగ్ దశలో టాప్‌లో ఉన్న నాలుగు జట్లు ప్లేఆఫ్‌లకి అర్హత పొందుతాయి.

పాయింట్స్‌ పద్దతి:
మ్యాచ్ గెలిస్తే: 2 పాయింట్స్
ఫలితం తేలకుంటే: 1 పాయింట్
ఓడిపోతే: 0 పాయింట్స్
మ్యాచ్ టై అయితే.. సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

క్రికెట్‌ మహోత్సవం ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ అంటేనే హోరెత్తించే పాటలు.. చీర్‌ లీడర్ల నృత్యాలు.. సూపర్‌ ఓవర్లు.. ఇలా ఎన్నెన్నో.. అలాంటి ఐపీఎల్ మళ్లీ శనివారం ప్రారంభమైంది. ఇందుకు ముంబైలోని వాంఖడె స్టేడియం వేదికైంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

మొత్తం 51 రోజులు పాటు జరిగే ఈ ఐపీఎల్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. 9 ప్రధాన నగరాల్లో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.

గత పదేళ్ల ఐపీఎల్ సీజన్‌లో ముంబై మూడు సార్లు (2013, 2015, 2017) ఐపీఎల్ విజేతగా నిలవగా... చెన్నై రెండు సార్లు(2010, 2011) ఐపీఎల్ విజేతగా నిలిచింది. అలాంటి రెండు జట్ల మధ్య ఐపీఎల్‌ 11వ సీజన్‌ ఆరంభం కాబోతోంది. ఈ రెండు జట్లు వేటికవే సాటి.

అయితే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ జట్టు రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి లీగ్‌లోకి అడుగుపెడుతోంది కాబట్టి. ఇక, తొలి మ్యాచ్‌కి గంటన్నర ముందే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఐపీఎల్ 11వ సీజన్‌కు అట్టహాసంగా తెరలేవనుంది. కిక్కిరిసిన అభిమానుల మధ్య లీగ్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ తారలు అదనపు ఆకర్షణగా నిలువనున్నారు. గంటల పాటు సాగే ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు హృతిక్‌ రోషన్‌, తమన్నా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తళుక్కుమనబోతున్నారు.


ఆరంభ వేడుకల్లో టాప్ ఫెర్పామెన్స్:
ఐపీఎల్ ఆరంభ వేడకల్లో బాలీవుడ్ తారలు పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రణవీర్ సింగ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా రణవీర్ సింగ్, పరిణీతి చోప్రా ఆరంభ వేడుకల నుంచి తప్పుకున్నారు. దీంతో వారిద్దరి స్థానంలో హృతిక్‌ రోషన్‌, తమన్నాలు ప్రదర్శన ఇవ్వనున్నారు.


ఆరంభ వేడుకల సమయం:
ఐపీఎల్ ఆరంభ వేడుకలు శనివారం (ఏప్రిల్ 7)న సాయంత్రం 6:15 గంటలకు ప్రారంభం కానున్నాయి.


ఐపీఎల్ ఆరంభ వేడుకలను ప్రసారం చేసే ఛానళ్లు:
StarSports 1/HD1, StarSports 3/HD3. Starsports Tamil
మొత్తం 12 ఛానళ్లు ఐపీఎల్ ఆరంభ వేడుకలను ప్రత్యశ్ర ప్రసారం చేయనున్నాయి.
డిజిటల్ మాద్యమం: HotStar.com


వేదిక:
ముంబైలోని వాంఖడె స్టేడియం

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 7, 2018, 17:24 [IST]
Other articles published on Apr 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి