న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018, MI vs RCB: బెంగళూరు ఓటమికి ఐదు కారణాలివే

By Nageshwara Rao
IPL 2018, MI vs RCB: 5 reasons why Royal Challengers Bangalore lost to Mumbai Indians

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై జట్టు మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

కెప్టెన్ రోహిత్ శర్మ (94: 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులు), ఓపెనర్ ఎవిన్ లూయిస్ (65: 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సలు) దూకుడుగా ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో చేధన ఆరంభించిన బెంగళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (92 నాటౌట్: 62 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులు) చివరి వరకూ ఒంటరి పోరాటం చేసినా ఆ జట్టుని ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఈ క్రమంలో బెంగళూరు ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తే...

#1 ఫామ్‌లోకి ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ

#1 ఫామ్‌లోకి ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ

సఫారీ పర్యటన నుంచి కూడా పరుగులు రాబట్టడంలో రోహిత్ శర్మ తీవ్రంగా విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్ ఇన్నింగ్స్ స్లోగా ఉన్న కారణంగానే ఓటమి పాలైంది. అయితే, బెంగళూరు మ్యాచ్ మాత్రం రోహిత్ శర్మ జూలు విదిల్చాడు. అసలైన టీ20 పోరు ఎలా ఉంటుందో అభిమానులకు రుచి చూపించాడు. ఓపెనర్ ఎవిన్ లూయిస్‌తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ-లూయిస్ జోడి మూడో వికెట్‌కి అభేద్యంగా 108 పరుగుల భాగస్వామ్యంతో జట్టుని తిరుగులేని స్థితిలో నిలిపారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. 52 బంతుల్లో 10 పోర్లు, 5 సిక్సులతో 94 పరుగులు నమోదు చేశాడు.

#2 బెంగళూరు స్పిన్నర్లు విఫలం

#2 బెంగళూరు స్పిన్నర్లు విఫలం

ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లపై ఎంతో నమ్మకముంచింది. అయితే ఇప్పటివరకు ఈ సీజన్‌లో వీరిద్దరూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించలేదు. వాషింగ్టన్ సుందర్‌పై విరాట్ కోహ్లీ నమ్మకముంచి పవర్ ప్లేలో అతడికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరచుకోలేకపోయాడు. పవర్ ప్లేలో సుందర్ వేసిన తొలి ఓవర్‌లోనే 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక చాహల్ బౌలింగ్‌లో అయితే ముంబై ఓపెనర్ ఎవిన్ లూయిస్ వరుసగా రెండు సిక్సులు బాదాడు. వీరిద్దరూ కలిసి వేసిన 5 ఓవర్లకు గాను 64 పరుగులు సమర్పించుకున్నారు.

#3 డెత్ ఓవర్లలో చెత్త బౌలింగ్

#3 డెత్ ఓవర్లలో చెత్త బౌలింగ్

చివరి 5 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు 70 పరుగులు సమర్పించుకున్నారు. 15వ ఓవర్‌లో వరుసగా 6,4తో అతడు 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 19వ ఓవర్‌లో హార్దిక్‌ కీపర్‌ క్యాచ్‌ను అంపైర్‌ ఔగా ప్రకటించినా రివ్యూలో నాటౌట్‌గా తేలింది. ఆ తర్వాత వరుస బంతుల్లో తను రెండు సిక్సర్లు బాదాడు. అయితే థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోవైపు రోహిత్‌ శర్మ ఆఖరి ఓవర్‌లో వరుసగా 4,6,4తో హోరెత్తించి మరో బంతి మిగిలి ఉండగా ఔటయ్యాడు. ఇక చివరి బంతిని హార్దిక్‌ పాండ్యా (5 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 17 నాటౌట్‌) ఫోర్‌గా మలిచాడు.

#4 మెక్లెన్‌గన్ డబుల్ వికెట్ ఓవర్

#4 మెక్లెన్‌గన్ డబుల్ వికెట్ ఓవర్

214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకి చక్కటి శుభారంభం దక్కాలి. దీంతో ఓపెనర్ డీకాక్-విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడటంతో తొలి నాలుగు ఓవర్లకు గాను బెంగళూరు 40 పరుగులు చేసింది. ఈ సమయంలో బెంగళూరు బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్ మిచెల్ మెక్లెన్‌‌గన్‌ను రంగంలోకి దించాడు. మెక్లెన్‌గన్ వేసిన ఓవర్‌లో నాలుగో బంతికి బెంగళూరు బిగ్ ఫిష్ ఏబీ డివిలియర్స్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. డివిలియర్స్ ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

#5 కోహ్లీ చేసిన పొరపాటు

#5 కోహ్లీ చేసిన పొరపాటు

బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్‌ని ఎంచుకునే విధానంలోనూ కోహ్లీ పొరపాటు చేసినట్లు కనిపిస్తోంది. విధ్వంసక ఓపెనర్‌ మెక్‌కలమ్‌ని పక్కన పెట్టి అతని స్థానంలో ఆల్‌రౌండర్ కోరె అండర్సన్‌‌కి తుది జట్టులో స్థానం కల్పించాడు. మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అండర్సన్ 47 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే తొలి బంతికే డకౌటయ్యాడు. టోర్నీ ఆరంభం నుంచి మెక్‌కలమ్ ఫామ్‌లో లేని మాట వాస్తవమే కానీ.. అతను జట్టులో ఉండింటే జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా ఉండేది. డికాక్ (19), డివిలియర్స్ (1) ఔటవగానే కోహ్లీ మినహా జట్టు‌లో గెలిపించే సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ ఎవరూ కనిపించలేదు. 0/2తో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై జట్టు చివరికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో 4.1 ఓవర్లకి 40/1తో నిలిచిన బెంగళూరు జట్టు ఓడిపోవడానికి కారణం బ్యాటింగ్ వైఫల్యమే.

Story first published: Wednesday, April 18, 2018, 10:23 [IST]
Other articles published on Apr 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X