ముంబై Vs ఢిల్లీ: కాబోయే భార్యతో వాంఖడెలో ఆకాశ్‌ అంబానీ

Posted By:
IPL 2018, MI vs DD, Match 9: Akash Ambani, Shloka Mehta Enjoying MIs Fireworks At Wankhede

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముంబై-ఢిల్లీ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌కి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ముంబై ఇండియన్స్‌ జట్టు యజమాని అనిల్‌ అంబానీ తనయుడు ఆకాశ్‌ తనకు కాబోయే భార్య శ్లోక మెహతాతో కలిసి ఈ మ్యాచ్‌కు హాజరయ్యాడు.

 ఈ ఏడాది డిసెంబరులో వీరి వివాహం

ఈ ఏడాది డిసెంబరులో వీరి వివాహం

ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులో వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో శ్లోకాతో కలిసి ఆకాశ్‌ అంబానీ మ్యాచ్‌ తిలకిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరితో పాటు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక, క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ తనయుడు అర్జున్ కూడా హాజరయ్యాడు.

ఎటు చూసినా చిన్నారులే

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఎటు చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. నీలం రంగు జెర్సీలో వేసుకుని ముంబై ఇండియన్స్ జెండాలతో స్డేడియంలో సందడి చేస్తున్నారు. సుమారు 21వేల మంది చిన్నారులు ఈ రోజు మ్యాచ్‌కు హాజరయ్యారు. జెండాలు ఊపుతూ ముంబై ఇండియన్స్ జట్టుకు మద్దతు తెలుపుతున్నారు.

ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం

రిలయన్స్‌ ఫౌండేషన్‌-ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ నిర్వాహకులు చిన్నారులందరికీ ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించింది. నిజానికి ఈరోజును ఈఎస్ఏ డేగా రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. అంటే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్. ఇందులో భాగంగా ముంబైలోని పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన 21వేల మంది చిన్నారులను స్టేడియానికి తీసుకొచ్చారు.

స్వచ్ఛంద సంస్థలతో కలసి నిరుపేద పిల్లలకు విద్య

మొత్తం 33వేల సామర్థ్యం కలిగి ఉన్న వాంఖడే స్టేడియంలో ఈరోజు ఎటు చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. పిల్లలకు చదువు, క్రీడల్లో సమగ్ర అభివృద్ధితో పాటు సమాన అవకాశాలను ఈఎస్ఏ కల్పిస్తోంది. స్వచ్ఛంద సంస్థలతో కలసి నిరుపేద పిల్లలకు విద్యను అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే కోటి 30 లక్షల మంది పిల్లలకు సాయం చేస్తున్నారు.

ట్విట్టర్‌లో ముంబై ఆటగాళ్లు

కాగా, చిన్న పిల్లలకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించడంపై పలువురు ముంబై ఆటగాళ్లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 21వేల మంది పిల్లల మధ్య ఆడటం అద్భుతమైన అనుభూతి అని హార్దిక్ పాండ్యా ట్వీట్ చేశాడు. అలాగే బెన్ కట్టింగ్, ఆదిత్య తారే కూడా ట్వీట్లు చేశారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 14, 2018, 19:00 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి