చివరివరకు ఉత్కంఠ: ముంబైపై సన్‌రైజర్స్‌ ఘన విజయం

Posted By:
SRH

హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం ముంబై ఇండియన్స్‌తో చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వికెట్ తేడాతో విజయం సాధించింది.

148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. హైదరాబాద్ బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌(45) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, దీపక్‌ హుడా(32 నాటౌట్‌) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

హైదరాబాద్ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన​ సాహాలు ఆరంభించారు. వీరిద్దరి జోడి తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలో 62 పరుగులు జోడించిన తర్వాత సాహా(22) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కేన్‌ విలియమ్సన్‌(6) పెవిలియన్‌కు చేరాడు. అదే సమయంలో దూకుడుగా ఆడుతోన్న శిఖర్‌ ధావన్‌ కూడా పెవిలియన్‌ చేరాడు.

దీంతో హైదరాబాద్‌ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత మనీష్‌ పాండే(11), షకిబుల్‌ హసన్‌(12)లు ఔటయ్యారు. ఈ క్రమంలో దీపక్‌ హుడా, యూసఫ్‌ పఠాన్‌లు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఈ సమయంలో పఠాన్‌(14) పరుగుల వద్ద ఔటయ్యాడు.

ఆ తర్వాతి బంతికే రషీద్‌ ఖాన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. 19 ఓవర్‌లో సిద్ధార్ధ్‌ కౌల్‌, సందీప్‌ శర్మలు సైతం పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ 137 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి.

ఈ సమయంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్‌ను బెన్ కటింగ్ చేతికి ఇచ్చాడు. తొలి బంతిని దీపక్ హుడా తొలి బంతిని సిక్స్‌ కొట్టగా, రెండో బంతి వైడ్‌ అయ్యింది. ఆ తర్వాత రెండో బంతికి పరుగు రాకపోగా, మూడో బంతికి పరుగు వచ్చింది. నాలుగో బంతిని స్టాన్‌లేక్‌ సింగిల్‌ తీసి హుడాకు స్టైకింగ్‌ ఇచ్చాడు.

ఇక ఐదో బంతికి మరో సింగిల్‌ రాగా, చివరి బంతిని స్టాన్‌ లేక్‌ ఫోర్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో మార్కండే నాలుగు వికెట్లు తీయగా, రెహమాన్ మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు తీశారు,


18 ఓవర్లకు సన్‌రైజర్స్ 136/7
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరుసగా వికెట్లు కోల్పోతూ సన్‌రైజర్స్‌ కష్టాల్లో పడింది. 18వ ఓవర్‌లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి రెండు వికెట్లు తీశాడు. ముందుగా యూసఫ్‌ పఠాన్‌(14)ను ఔట్‌ చేయగా, ఆ తర్వాత రషీద్‌ ఖాన్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 18ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ ఏడు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ప్రస్తుతం దీపక్ హుడా(14), సిద్ధార్ధ కౌల్‌ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

15 ఓవర్లకు సన్‌రైజర్స్ 121/5
ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. పవర్‌ ప్లే ఓవర్లు ముగిసే వరకూ 56 పరుగులతో పటిష్ఠంగా కనిపించిన సన్‌రైజర్స్‌ ఆ తర్వాత నుంచి వరుసగా వికెట్లు కోల్పోతుంది. మార్కండే వేసిన ఏడో చివరి బంతికి ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా(22) ఎల్బీగా వెనుదిరిగాడు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(6) ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో కీపర్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌కు చేరాడు. శిఖర్‌ ధావన్‌(45) హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో మార్కండే బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద బుమ్రా చేతికి చిక్కాడు. ఆ తర్వాత మార్కండే 11వ ఓవర్‌లో మనీష్ పాండే(11) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

దీంతో స్కోరు బోర్డు కాస్త మందగించింది. ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో షకీబ్ ఉల్ హాసన్(12) పరుగుల వద్ద మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ ముంబై కంట్రోల్‌లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. 15 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ ఐదు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దీపక్ హుడా(15), యూసఫ్ పఠాన్(7) ఉన్నారు.


10 ఓవర్లకు సన్‌రైజర్స్ 87/3
148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆ జట్టు వరుస ఓవర్లలో ఓపెనర్లు శిఖర్ ధావన్ (45), వృద్ధిమాన్ సాహా (22)‌తో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (6) వికెట్లని కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మనీష్ పాండే (9), షకీబ్ ఉల్ హాసన్(2) పరుగులతో ఉన్నారు.


పవర్ ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ 56/0
ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ వికెట్లేమీ కోల్పోకుండా 56 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (21), శిఖర్‌ ధావన్‌ (34) పరుగులతో ఉన్నారు.


Sunrisers Hyderabad

సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 148

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్‌కు 148 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆది నుంచి తడబాటుకు గురైంది.

సన్‌రైజర్స్‌ బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేయడంతో ముంబై ఇండియన్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(29), కీరోన్‌ పొలార్డ్‌(28), సూర్యకుమార్‌ యాదవ్‌(28)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, రోహిత్‌ శర్మ(11), కృనాల్‌ పాండ్యా(15)లు నిరాశపరిచారు.

మ్యాచ్‌ రెండో ఓవర్‌లోనే స్టాన్‌లేక్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ పెవిలియన్‌కు చేరాడు. వన్ డౌన్‌ వచ్చిన ఆటగాడు ఇషాన్‌ కిషాన్‌(9) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కాసేపు లూయిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మూడు ఫోర్లు, రెండు సిక‍్సర్లతో ముంబై అభిమానుల్ని అలరించాడు.

జట్టు స్కోరు 54 పరుగుల వద్ద లూయిస్‌ అవుట్‌ కావడంతో ముంబై స్కోరులో వేగం తగ్గింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కీరోన్‌ పొలార్డ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు దూకుడుగా ఆడే క్రమంలో ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, స్టాన్‌లేక్, సిద్ధార్ తలో రెండు వికెట్లు తీసుకోగా... రషీద్, షకీబ్ తలో వికెట్ తీసుకున్నారు.


ఐదో వికెట్ కోల్పోయిన ముంబై
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లలోపే నాలుగు వికెట్ల కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబైని పొలార్డ్‌ (23, 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) ఆదుకునే ప్రయ్నతం చేశాడు. అయితే స్టాన్‌లేక్‌ వేసిన 14 ఓవర్‌ ఐదో బంతిని భారీ షాట్‌ ఆడబోయిన పొలార్డ్‌ బౌండరీ లైన్‌ వద్ద ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌ (12), బెన్‌ కట్టింగ్‌ (1) పరుగుతో ఉన్నారు.


నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై తొలుత బ్యాటింగ్‌కి దిగింది. స్టాన్‌లేక్ వేసిన రెండో ఓవర్‌లో ఒక సిక్సు, ఒక ఫోర్ బాదిన రోహిత్ ఆఖరి బంతికి ఆన్ సైడ్ మీదుగా షాట్ ఆడగా దానిని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్ అందుకున్నాడు.

Sunrisers Hyderabad

ఆ తర్వాత మరో ఓపెనర్ ఎవిన్ లివీస్, ఇశాన్ కిషన్‌తో కలిసి స్కోర్‌బోర్డ్‌ని పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. కానీ సిద్ధార్ కౌల్ వేసిన ఆరో ఓవర్‌లో కిషన్(9), లివీస్(29) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కొద్ది సేపటికేకృనాల్ పాండ్యా షకీబ్ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పొలార్డ్ (1), సూర్యకుమార్ యాదవ్(7) పరుగులతో ఉన్నారు.


8 ఓవర్లకు ముంబై ఇండియన్స్ 59/3
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవిన్ లూయిస్ (29) పరుగుల వద్ద సిద్దార్ధ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కౌల్ బౌలింగ్‌లోనే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (9) పరుగుల వద్ద పఠాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (2), కృనాల్ పాండ్యా (3) పరుగులతో ఉన్నారు.


ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్: రోహిత్ శర్మ ఔట్
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. అంతకముందు తొలి ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మన్‌కు రెండు ఛాన్స్‌లొచ్చాయి. సందీప్ శర్మ వేసిన మొదటి ఓవర్‌ నాలుగో బంతిని రోహిత్ భారీ షాట్ కొట్టాడు. అయితే దానిని అందుకోవడంలో ఫీల్డర్ దీపక్ హుడా విఫలమయ్యాడు.

అదే ఓవర్ అఖరి బంతికి మరో ఓపనర్ ఎవిన్ లూయిస్ పరుగు తీసేందుకు పిచ్ మధ్య వరకూ వచ్చాడు. అదే సమయంలో బంతిని వికెట్లకు తగిలేలా విసరలేకపోయాడు. స్టాన్‌లేక్ వేసిన రెండో ఓవర్‌లో ఒక సిక్సు, ఒక ఫోర్ బాదిన రోహిత్ ఆఖరి బంతికి ఆన్ సైడ్ మీదుగా షాట్ ఆడగా దానిని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్ అల్ హసన్ అందుకున్నాడు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లూయిస్ (8), ఇషాన్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

SRH vs MI

హైదరాబాద్ v ముంబై లైవ్ స్కోరు కార్డు

ఇరు జట్లు చెరో మార్పులతో బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భువనేశ్వర్ స్థానంలో సందీప్ శర్మని జట్టులోకి తీసుకోగా.. ముంబై ఇండియన్ మిషెల్ మెక్‌క్లాగాన్ స్థానంలో బెన్ కట్టింగ్‌కు చోటు కల్పించింది. రెండు జట్ల బలాబాలాలు సమంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వెన్నునొప్పి కారణంగా గురువారం ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైనట్లు కెప్టెన్ విలియమ్సన్ తెలిపాడు. భువి స్థానంలో స్పీడ్‌స్టర్ సందీప్ శర్శ జట్టులోకి వచ్చాడు. గత సీజన్ల వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సందీప్ సన్‌రైజర్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.

ఇదిలా ఉంటే గాయం కారణంగా తమ జట్టుకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడని ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ వెల్లడించాడు. అతని స్థానంలో ప్రదీప్ సంగ్వాన్ తుది జట్టులోకి ఎంపిక చేసినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు.

ఐపీఎల్ 11వ సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో మొదలుపెట్టగా.. సన్‌రైజర్స్‌ విజయంతో బోణీకొట్టింది. ఇప్పుడు ఇరు జట్లు రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో జోరు కొనసాగించాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఊవిళ్లూరుతుండగా.... రెండో మ్యాచ్‌లోనైనా బోణీ చేయాలని ముంబై పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), సాహా (వికెట్‌ కీపర్‌), శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, రషీద్‌ఖాన్‌, స్టాన్‌లేక్‌, సిద్ధార్థ్‌ కౌల్‌

ముంబై ఇండియన్స్‌:
రోహిత్‌శర్మ (కెప్టెన్‌), లూయిస్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా, పొలార్డ్‌, బుమ్రా, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, మార్కండే, బెన్ కటింగ్

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 19:36 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి