న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీకి వరుణుడి దెబ్బ: సొంతగడ్డపై రాజస్థాన్ తొలి విజయం

By Nageshwara Rao
RR

హైదరాబాద్: రెండేళ్ల తర్వాత సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. జైపూర్ వేదికగా వర్షం ఆటంకం కలిగించిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా రాజస్థాన్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఢిల్లీ లక్ష్యాన్ని 6 ఓవర్లో 71 పరుగులుగా నిర్ణయించారు. 71 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 6 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరారు.

తొలి బంతికే మున్రో రనౌట్ కాగా.. రెండు ఓవర్లలో ఢిల్లీ జట్టు 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉనద్కత్ వేసిన మూడో ఓవర్లో మ్యాక్స్‌వెల్ 14 పరుగులు రాబట్టగలిగాడు. ప్రమాదకరంగా మారుతున్న మ్యాక్స్‌వెల్‌ను తర్వాతి ఓవర్లో లాంగ్లిన్ పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గింది.

ఆరు ఓవర్లలో ఢిల్లీ జట్టు 4 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 17.5 ఓవర్లు ముగిసే సమయానికి 153/5తో ఉన్న దశలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.


ఢిల్లీ టార్గెట్ 6 ఓవర్లలో 71 పరుగులు
జైపూర్‌లో వర్షం కారణంగా నిలిచిపోయిన రాజస్థాన్‌-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో ఢిల్లీ లక్ష్యాన్ని 6 ఓవర్లో 71 పరుగులుగా నిర్ణయించారు. వర్షం కారణంగా సుమారు రెండు గంటల పాటు మ్యాచ్ సమయం వృథా అయిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ను 6 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 17.5 ఓవర్లు ముగిసే సమయానికి 153/5తో నిలిచిన దశలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. వర్షం తగ్గిన తర్వాత అంఫైర్లు 6 ఓవర్లకు గాను ఢిల్లీకి 71 పరుగుల లక్ష్యంగా నిర్దేశించారు.


వర్షంతో నిలిచిన మ్యాచ్
జైపూర్ వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో 17.5 ఓవర్ వద్ద హఠాత్తుగా చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది కవర్లతో పిచ్‌ను కప్పి ఉంచారు. వర్షం వచ్చే సమయానికి 17.5 ఓవర్లు ఆడిన రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్రిష్ణప్ప గౌతమ్‌ (2), రాహుల్‌ (15) పరుగులతో ఉన్నారు. జట్టులో కెప్టెన్ అజింక్య రహానె (45: 40 బంతుల్లో 5x4), సంజు శాంసన్ (37: 22 బంతుల్లో 2x4, 2x6), బట్లర్ (29: 18 బంతుల్లో 2x4, 2x6) దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ మెరుగైన స్కోరు చేయగలిగింది.


రహానే ఔట్: నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
జైపూర్ వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న రహానే (45) పరుగుల వద్ద నదీమ్ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రహానే ఔటైన తర్వాత క్రీజులోకి రాహుల్ త్రిఫాఠి వచ్చాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(8), రాహుల్ త్రిపాఠి(1) పరుగుతో ఉన్నారు.


మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
జైపూర్ వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న సంజూ శాంసన్ (37) పరుగుల వద్ద నదీమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ (7), రహానే (33) పరుగులతో ఉన్నారు.


10 ఓవర్లకు రాజస్థాన్ 84/2
జైపూర్ వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదటి మూడు ఓవర్లలో నెమ్మదిగా ఆడిన రాజస్థాన్ రాయల్స్‌ కాస్త వేగం పెంచింది. యువ ఆటగాడు సంజూ శాంసన్‌ (33) దూకుడుగా ఆడటంతో స్కోరు వేగం పెరిగింది. దీంతో 10 ఓవర్లకు గాను రాజస్థాన్‌ రాయల్స్‌ 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే (29), సంజు శాంసన్(33) పరుగులతో ఉన్నారు. వన్‌డౌన్‌లో వచ్చిన బెన్‌స్టోక్స్‌ (16) ఔటయ్యాడు.


బెన్ స్టోక్స్ ఔట్: రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
జైపూర్ వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ (16) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 5 ఓవర్లకు గాను రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (11), రహానే (10) పరుగులతో ఉన్నారు.


షార్ట్‌ రనౌట్: తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
జైపూర్ వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్‌ డీ ఆర్సీ షార్ట్‌ (6) రెండో ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. రహానె (6) పిలుపు మేరకు అనవసరంగా రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ షార్ట్‌ సమన్వయ లోపంతో ఇలాగే రనౌటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే (6), బెన్ స్టోక్స్ (15) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఢిల్లీ vs రాజస్థాన్ మ్యాచ్ లైవ్ స్కోరు కార్డు

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ రెండు మార్పులతో దిగుతున్నట్లు కెప్టెన్ గంభీర్ చెప్పాడు. డేనియేల్ క్రిస్టెన్ స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, అమిత్ మిశ్రా స్ధానంలో శాబాజ్ నదీమ్‌కు చోటు కల్పించారు. తొలి మ్యాచ్‌కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ జట్టులోకి వచ్చినట్లు గంభీర్ తెలిపాడు.

గత సీజన్లలో తన మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన మాక్స్‌వెల్ లీగ్‌లో అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకొన్న స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో శాబాజ్ నదీమ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసినట్లు గౌతీ చెప్పాడు. ఇక, రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతున్నట్లు రాజస్థాన్ కెప్టెన్ రహానె వివరించాడు.

హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ ఆడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.

దీనికితోడు సొంత అభిమానుల మధ్య ఆడుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కూడా ఈ ఐపీఎల్‌ సీజన్‌ను ఓటమితోనే మొదలుపెట్టింది. మొహాలీ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

అంతకముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడిన చివరి ఆరు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ రాయల్స్ విజయం సాధించింది.

జట్ల వివరాలు:
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌:
గౌతమ్ గంభీర్‌(కెప్టెన్‌), గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌, రిషబ్‌ పంత్‌, క్రిస్‌ మోరిస్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కోలిన్‌ మున్రో, మహ్మద్‌ షమీ, విజయ్‌ శంకర్‌, షాబాజ్ నదీమ్, రాహుల్‌ తెవాటియా

రాజస్థాన్‌ రాయల్స్:
అజింక్యా రహానే(కెప్టెన్‌), శ్రేయాస్‌ గోపాల్‌, రాహుల్‌ త్రిపాఠి, జయదేవ్‌ ఉనాద్కట్‌, బెన్‌ స్టోక్స్‌, సంజూ శాంసన్‌, బెన్‌ లాప్లిన్‌, జోస్‌ బట్లర్‌, ధావల్‌ కులకర్ణి, క్రిష్ణప్పన్‌ గౌతమ్‌, డి'ఆర్సీ షార్ట్

Story first published: Thursday, April 12, 2018, 0:43 [IST]
Other articles published on Apr 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X