న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్‌పై విజయం: ప్లే‌ఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా

By Nageshwara Rao
IPL 2018, Match 54: SRH vs KKR Live Match Report from Rajiv Gandhi International Stadium, Hyderabad

హైదరాబాద్: ప్లే‌ఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తర్వాత ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది.

సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా విజయంలో క్రిస్‌ లిన్‌(55), రాబిన్‌ ఉతప్ప(45) కీలక పాత్ర పోషించగా, సునీల్‌ నరైన్‌(29), దినేశ్‌ కార్తీక్‌(25 నాటౌట్‌) తమవంతు బాధ్యతను పోషించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలర్లలో కార్లోస్ బ్రాత్ వైట్ 2, సిద్దార్థ్ కౌల్ 2 వికెట్లు తీసుకోగా... షకీబ్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.


15 ఓవర్లకు కోల్‌కతా 132/2
173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మెరుగ్గా ఆడుతోంది. ఆరంభంలోనే ఓపెనర్ సునీల్ నరైన్ (29) ఔటైనా.. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప (17)తో కలిసి మరో ఓపెనర్ క్రిస్‌లిన్ (50) నిలకడగా ఆడి హఫ్ సెంచరీని నమోదు చేశాడు. సిద్ధార్ద్ కౌల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి క్రిస్ లిన్ (55) పరుగుల వద్ద మనీష్ పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. క్రీజులో రాబిన్ ఊతప్ప(33), దినేశ్ కార్తీక్ (11) పరుగులతో ఉన్నారు.


నరైన్ ఔట్: 10 ఓవర్లకు కోల్‌కతా 90/1
173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. జట్టు స్కోరు 52 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించిన ఓపెనర్ సునీల్ నరైన్ (10 బంతుల్లో 29; 4 ఫోర్లు, 2 సిక్సులు) బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్ మనీశ్ పాండే చేతికి చిక్కాడు.

సునీల్ నరైన్ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో పాటు ఓ సిక్స్ బాది మొత్తం 20 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను కోల్‌కతా వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. క్రీజులో క్రిస్‌లిన్‌ (43), రాబిన్‌ ఉతప్ప (14) పరుగులతో ఉన్నారు.


కోల్‌కతా విజయ లక్ష్యం 173
ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (50: 39 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సు) హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. శ్రీవత్స్ గోస్వామి, శిఖర్ ధావన్‌లు కలిసి తొలి వికెట్‌కి 79 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్ నాలుగో బంతికి గోస్వామి(35) భారీ షాట్‌కు ప్రయత్నించి రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి ఓపెనర్ ధావన్ ఇన్నింగ్స్ చక్కబెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 48 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే సీర్‌లెస్ వేసిన 13వ ఓవర్‌లో రెండు భారీ సిక్సులు బాది విలియమ్‌సన్(36) మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తర్వాత శిఖర్ ధావన్ (50) పరుగుల వద్ద ప్రశిద్ధ్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ, మిడిల్ ఓవర్లలో యూసఫ్ పఠాన్ (2), బ్రాత్‌వైట్ (3) తక్కువ స్కోరుకే పరిమితమవడం.. ఆఖర్లో మనీశ్ పాండే (25) దూకుడుగా ఆడకపోవడం, చివరి ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ 172 పరుగులతోనే సరిపెట్టుకుంది.

దీంతో కోల్‌కతాకు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా బౌలర్లలో ప్రశిద్ధ్ కృష్ణన్ 4 వికెట్లు తీసుకోగా... ఆండ్రి రస్సెల్, సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, సీర్‌లెస్ తలో వికెట్ పడగొట్టారు.


16 ఓవర్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 146/3
ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. శ్రీవత్స్ గోస్వామి, శిఖర్ ధావన్‌లు కలిసి తొలి వికెట్‌కి 79 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్ నాలుగో బంతికి గోస్వామి(35) భారీ షాట్‌కు ప్రయత్నించి రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి ఓపెనర్ ధావన్ ఇన్నింగ్స్ చక్కబెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 48 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే సీర్‌లెస్ వేసిన 13వ ఓవర్‌లో రెండు భారీ సిక్సులు బాది విలియమ్‌సన్(36) మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ (50) పరుగుల వద్ద ప్రశిద్ధ్ వేసిన 16వ ఓవర్ మొదటి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 3 వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో మనీశ్ పాండే(12), యూసుఫ్(3) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తొలి వికెట్‌ చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ జట్టుకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 79 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్ నాలుగో బంతికి గోస్వామి(35) భారీ షాట్‌కు ప్రయత్నించి రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్‌ ధావన్‌ (42), కేన్‌ విలియమ్సన్‌ (7) పరుగులతో ఉన్నారు.


దూకుడుగా ఆడుతోన్న హైదరాబాద్‌ ఓపెనర్లు
ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు చెలరేగుతున్నారు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (27), శ్రీవత్స్‌ గోస్వామి (25) దూకుడు కనబరుస్తున్నారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 60 పరుగులు చేసింది.


దూకుడుగా ఆడుతోన్న గోస్వామి
ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (14) దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ శ్రీవత్స్‌ గోస్వామి (15) అతడికి మద్దతు ఇస్తున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ బౌండరీలతో చెలరేగుతున్నారు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

హైదరాబాద్ తుది జట్టులో రెండు మార్పులు చేసుకున్నాయి. ఓపెనర్ అలెక్స్ హేల్స్, ఫాస్ట్ బౌలర్ బసిల్ థంపీ స్థానంలో కార్లోస్ బ్రాత్‌వైట్, భువనేశ్వర్ కుమార్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు కోల్‌కతా జట్టు కూడా ఒక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి స్థానంలో పీయూస్ చావ్లాని తీసుకుంది.

ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోవాలంటే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలువాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లతో పాయింట్ల పట్టకిలో అగ్రస్థానంలో కొనసాగుతుంటే.. కోల్‌కతా 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.

కాగా, సన్‌రైజర్స్ వరుసగా రెండు ఓటములతో ఒకింత ఒత్తిడిలో ఉండగా, రాజస్థాన్‌పై విజయం సాధించి కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని చూస్తోంది. ఒక వేళ మ్యాచ్ ఓడిపోతే మిగతా జట్ల గెలుపు, ఓటములపై కోల్‌కతా భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

1
43464

ఐపీఎల్ 11వ సీజన్ మలి దశకు వచ్చినా... ప్లేఆఫ్ బెర్తులపై ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠరేపుతూ జట్లు అనూహ్య విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై ప్లేఆఫ్ బెర్తులను ఖరారు చేసుకోగా, మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:

శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, షకీబ్ అల్ హసన్, దీపక్ హుడా, గోస్వామి, కార్లోస్ బ్రాత్‌వైట్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ

కోల్‌కతా నైట్ రైడర్స్:
సునీల్ నరైన్, క్రిస్‌లిన్, రాబిన్ ఉతప్ప, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్, శుభమన్ గిల్, జావాన్ సీయర్లెస్, పీయూస్ చావ్లా, ప్రసీద్, కుల్దీప్ యాదవ్

Story first published: Saturday, May 19, 2018, 23:55 [IST]
Other articles published on May 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X