చెపాక్‌లో కోల్‌కతాతో మ్యాచ్: ఉత్కంఠ పోరులో చెన్నై ఘన విజయం

Posted By:
Chennai Super Kings win the toss and elect to field

హైదరాబాద్: సొంతగడ్డపై మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి చెన్నై చేధించింది. శామ్ బిల్లింగ్స్(23 బంతుల్లో 56), వాట్సన్(19 బంతుల్లో 42), రాయుడు(26 బంతుల్లో 39) రాణించడంతో 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

వినయ్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని బ్రావో సిక్స్‌గా మలిచాడు. ఇక ఐదో బంతిని రవీంద్ర జడేజా సిక్స్‌గా మలిచి మ్యాచ్‌ని లాంఛనాన్ని ముగించాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 202 పరుగుల చేసింది.

చెన్నై విజయానికి 30 బంతుల్లో 58 పరుగులు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. 203 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ధోని సేన 15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. చివరి 30 బంతుల్లో 58 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. ధోని (23), శామ్‌ బిల్లింగ్స్‌ (24) పరుగులతో క్రీజులో ఉన్నారు.

చెన్నై విజయానికి 60 బంతుల్లో 113 పరుగులు
చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. కోల్‌కతా నిర్దేశించిన 203 పరుగుల లక్ష్య ఛేదనలో 10 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సురేశ్‌ రైనా (6), ఎంఎస్‌ ధోనీ (3) ఆడుతున్నారు. చెన్నై జట్టు గెలవాలంటే 60 బంతుల్లో 113 పరుగులు చేయాలి.

6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 75 పరుగులు
చెన్నైసూపర్‌ కింగ్స్‌ దూకుడుగా ఆడుతోంది. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 75 పరుగులు చేసింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (4), అంబటి రాయుడు (33) చెలరేగారు. వీరి ధాటికి చెన్నై 22 బంతుల్లోనే 50 పరుగులు మైలురాయి దాటేసింది. అయితే కరణ్‌ వేసిన 5.5వ బంతికి వాట్సన్‌ రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

దూకుడుగా ఆడుతోన్న వాట్సన్
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ (29) మెరుపులు మెరిపించాడు. అంబటి రాయుడు (7) క్రీజులో ఉన్నాడు.


చెన్నై విజయ లక్ష్యం 203
చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆండ్రూ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు.

దీంతో కోల్‌కతా జట్టు చెన్నైకి 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ సునీల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలి ఓవర్‌లోనే కోల్‌కతా 18 పరుగులు రాబట్టింది. అయితే భజ్జీ వేసిన రెండో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన నరైన్.. సురేశ్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Russel

ఆ తరవాత మరో ఓపెనర్ లిన్, ఉతప్ప కలసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే జడేజా వేసిన ఐదో ఓవర్‌లో లిన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరవాత షేన్ వాట్సన్ వేసిన 9వ ఓవర్‌లో నితీష్ రానా(16) ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇదే ఓవర్‌లో సురేష్ రైనా విసిరిన సూపర్ త్రోకు రాబిన్ ఉతప్ప (29) రనౌటయ్యాడు. ఆ తర్వాత బ్రావో అద్భుత క్యాచ్‌తో రింకు సింగ్ (2) పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు మిడిలార్డర్‌లో వచ్చిన ఆండ్రూ రసెల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అదే ఓవర్‌లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా ఔటయ్యాడు.

చెన్నై బౌలర్లలో షేన్ వాట్సన్‌ రెండు వికెట్లు తీయగా... హర్భజన్ సింగ్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.


15 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 123/5
చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పరుగుల వేగం తగ్గింది. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు వెంటవెంటనే వికెట్లు చేజార్చుకోవడంతో ఆ జట్టు బ్యాట్స్‌మన్ దూకుడుగా ఆడలేకపోతున్నారు. దినేశ్‌ కార్తీక్‌ (19), ఆండ్రూ రసెల్‌ (20) పోరాడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.


కోల్‌కతా 10 ఓవర్లకు 89/5
చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా 10 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య చెపాక్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతోన్న రాబిన్‌ ఉతప్ప (29; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు)ను సురేశ్‌ రైనా అద్భుతంగా రనౌట్‌ చేశాడు. వాట్సన్‌ వేసిన 8.2వ బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి ఉతప్ప ఔటయ్యాడు. పదో ఓవర్‌ చివరి బంతికి రింకూ సింగ్‌ ((2)ను శార్దూల్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు పంపించాడు.

రాబిన్ ఊతప్ప రనౌట్: నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
సునీల్ నరేన్ ఔటైన ఓపెనర్ లిన్, ఉతప్ప కలసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే జడేజా వేసిన ఐదో ఓవర్‌లో లిన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరవాత షేన్ వాట్సన్ వేసిన 9వ ఓవర్‌లో నితీష్ రానా(16) ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌లో సురేష్ రైనా విసిరిన సూపర్ త్రోకు ఉతప్ప (29) రనౌట్ అయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.


రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
చెపాక్ స్టేడియంలో కోల్ కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ వినూత్నంగా ఆలోచించాడు. మొదటి ఆరు ఓవర్లను ఐదురుగు బౌలర్లతో వేయించాడు. స్పిన్నర్లతో ఓపెనర్లు ఇద్దరినీ పెవిలిన్‌ పంపించాడు. రాబిన్‌ ఉతప్ప (28) దూకుడుగా ఆడటంతో 6 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. నితిష్‌ రాణా (1) క్రీజులోకి వచ్చాడు.


తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా సునీల్ నరైన్ మెరుపులతో తొలి ఓవర్‌లో 18 పరుగులు రాబట్టింది. అయితే హర్భజన్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన నరైన్.. సురేశ్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండు ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
కావేరీ నిరసనల మధ్యే ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

 IPL 2018: Match 5: Chennai Super Kings win the toss and elect to field

టాస్ గెలిచిన అనతంరం ధోని మాట్లాడుతూ 'రెండేళ్లుగా చెన్నై అభిమానులు తమ కోసం ఎదురుచూస్తున్నారని.. తాము కూడా మ్యాచ్ ఆడటానికి ఎంతో ఆత్రుతగా ఉన్నాం' అని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. మార్క్ వుడ్, కేదార్ జాదవ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్, సామ్ బిల్లింగ్స్‌ను తీసుకున్నట్లు ధోని చెప్పాడు.

ఇక, కోల్‌కతా జట్టులో ఒక మార్పు చేసింది. మిచెల్ జాన్సన్ స్థానంలో టామ్ కర్రన్‌ను తీసుకున్నట్లు కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ చెప్పాడు. ఈ సీజన్‌లో రెండు జట్లు ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించాయి. అయితే ఆ విజయోత్సాహాన్ని అలాగే కొనసాగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.


15 నిమిషాలు టాస్ ఆలస్యం:
కావేరీ సెగల నేపథ్యంలో మ్యాచ్‌కు రావాల్సిన ఆటగాళ్లు గ్రౌండ్‌కు ఆలస్యంగా చేరుకున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అంపైర్లను హోటల్‌ గదిలోనే వదిలే వచ్చేశారు. అంపైర్లు హోటల్‌ గదిలోనే ఉండిపోయిన విషయాన్ని వెంటనే గ్రహించిన అధికారులు వారిని ఆగమేఘాల మీద స్టేడియానికి తీసుకొచ్చారు. దీంతో 15 నిమిషాలు టాస్ ఆలస్యమైంది. చెపాక్‌ మైదానంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 75 శాతం విజయాలు నమోదు చేయడం విశేషం.


చెపాక్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరిగి 1095 రోజులు..:
చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో 2015 మే 10న చివరిసారిగా చెన్నై జట్టు ఐపీఎల్ మ్యాచ్ ఆడింది. అంటే 1095 రోజుల తరువాత ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధమయ్యారు. రెండేళ్ల తరువాత లీగ్‌లోకి పునరాగమనం చేసి సొంత అభిమానుల మధ్య మ్యాచ్ ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ధోని అన్నాడు.

ఇదిలా ఉంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు చెన్నైలోని చెపాక్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌ను అడ్డుకుంటామని ఆందోళనకారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది ఆందోళనకారులు భద్రతా వలయాన్ని ఛేదించుకొని స్టేడియం స్టేడియం లోపలకు దూసుకొస్తున్నారు.

దీంతో అక్కడ ప్రస్తుతం గందగోళ వాతావరణం నెలకొంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభంకానున్న నేపథ్యంలో మరోవైపు టికెట్‌ను కొనుగోలు చేసిన అభిమానులు చెపాక్ స్టేడియానికి చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు. స్టేడియం దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పాసులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తున్నారు.

జట్ల వివరాలు:

చెన్నై సూపర్ కింగ్స్:

షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, సామ్ బిల్లింగ్స్, ఎంఎస్ ధోనీ (కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, శార్దూల్ ఠాకూర్

కోల్‌కతా నైట్ రైడర్స్:

సునీల్ నరైన్, క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (కీపర్/కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రూ రసెల్, వినయ్ కుమార్, పియూష్ చావ్లా, టామ్ కరన్, కుల్దీప్ యాదవ్

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 19:53 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి