IPL 2018: KKR vs RR: ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయభేరి మోగించిన కోల్‌కతా

 ipl 2018 match 49 kkr vs rr match report from eden gardens stadium

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్, కోల్‌కతా జట్లు మంగళవారం తలపడ్డాయి.ఐపీఎల్ 2018 సీజన్‌‌లో ప్లేఆఫ్ ఆశల్ని అద్భుత విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ క్రిస్‌లిన్ (45), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (41) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కి జోస్ బట్లర్ (39) రాహుల్ త్రిపాఠి (27) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిల్ ఓవర్లలో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 19 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులకే కుప్పకూలిపోయింది.

ఛేదనలో ఓపెనర్ సునీల్ నరైన్ (21) తొలి ఓవర్‌లోనే 21 పరుగులు బాది శుభారంభమివ్వగా.. మధ్య ఓవర్లలో నితీశ్ రాణా (21) సందర్భానుసారంగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఆఖర్లో క్రిస్‌లిన్ ఔటైనా.. ఆండ్రీ రసెల్ (11) భాగస్వామ్యంతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే దినేశ్ కార్తీక్ సిక్స్‌తో గెలుపు లాంఛనాన్ని 145/4గా పూర్తి చేశాడు. తాజా విజయంతో (14 పాయింట్లు) పట్టికలో కోల్‌కతా తన మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రాజస్థాన్ ప్లేఆఫ్‌ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 80/3

తొలి బంతికే సిక్సుతో ఆరంభించిన ఇన్నింగ్స్‌ను నిలుపుకునేందుకు కష్టపడాల్సి వచ్చింది. అక్కడికీ రన్ రేట్ 8తో మూడు వికెట్ల నష్టానికి బాగానే లాక్కొచ్చింది. ఓపెనర్‌గా దిగిన సునీల్ నరేన్(21) ఆడిన 7బంతుల్లోనే మంచి స్కోరును చేశాడు. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప(4), నితీశ్ రానా(21)పరుగులకే వెనుదిరిగారు. మరో ఎండ్‌లో దిగిన ఓపెనర్ క్రిస్ లిన్(25), దినేశ్ కార్తీక్ (8)క్రీజులో ఉన్నారు.


కోల్‌కతా టార్గెట్ 143

ధాటిగా ఆడుతూ వచ్చిన రాజస్థాన్ జట్టును కోల్‌కతా ఫీల్డింగ్‌తోనూ బౌలింగ్ తోనూ మంచి బందోబస్తుతో కట్టడిచేసింది. ఆరంభంలో వరుసపెట్టి బాదుడు అందుకున్న కోల్‌కతా ఓపెనర్లు అవుటవడంతో స్కోరు వేగం తగ్గింది. ఈ నేపథ్యంలో జోస్ బట్లర్(39) స్కోరే జట్టులో అత్యధిక స్కోరుగా నమోదైంది. స్టువర్ట్ బిన్నీ, కృష్ణప్ప గౌతం, ఇషసోడి, జోఫ్రా ఆర్చర్‌లు సింగిల్ డిజిట్ స్కోరుతోనే వెనుదిరిగారు.

రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లను భారీ ఎత్తుగడలతో పెవిలియన్ పంపారు కోల్‌కతా బౌలర్లు. శివమ్ మావి 1, ప్రసాద్ కృష్ణన్ 2, సునీల్ నరైన్ 1, ఆండ్రీ రస్సెల్ 2, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశారు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 92/3

దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కోల్‌కతా పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో కేవలం 2పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్లు తర్వాతి 2,3 ఓవర్లలో బౌండరీల వర్షం కురిపించారు. ఆ రెండు ఓవర్లలోనే 47పరుగులను సాధించింది కోల్‌కతా. ఆ తర్వాత సూర్య నారాయణ బౌలింగ్‌తో కాస్త కట్టడి అయింది. మ్యాచ్ ఆరంభంలో కాస్తంత ఫీల్డింగ్ లోపం కనిపించింది. 4.5 ఓవర్లకు తొలి వికెట్‌గా రాహుల్ త్రిపాఠి(27) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింకా రహానె తటాపటాస్తూ ఆడుతూనే 7.2ఓవర్లకు పెవిలియన్‌కు చేరుకున్నాడు. మూడో వికెట్‌గా జోస్ బట్లర్ (39)ను కోల్పోవాల్సి వచ్చింది.


టాస్ రిపోర్టు:

ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఇప్పటికే ఐపీఎల్ 2018 సీజన్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నాకౌట్ బెర్తుని ఖాయం చేసుకున్నాయి. దీంతో మిగిలిన రెండు స్థానాల కోసం రేసు రసవత్తరంగా మారింది.
కోల్‌కతా, రాజస్థాన్, పంజాబ్, ముంబై, బెంగళూరు జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకి జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌తో చావోరేవో పోరుకి సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని రెండు జట్లూ ఆశిస్తున్నాయి. టోర్నీలో భాగంగా శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 245 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా.. అలవోక విజయంతో ప్రస్తుతం పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ కూడా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ని చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరుమీదుంది.

ముఖ్యంగా.. ఓపెనర్ జోస్ బట్లర్ వరుసగా ఐదు హాఫ్ సెంచరీలతో రాజస్థాన్‌ జట్టులో నూతన ఉత్తేజాన్ని నింపుతూ జట్టుకి విజయాల్ని అందిస్తున్నాడు. కోల్‌కతా జట్టులోనూ ఓపెనర్ సునీల్ నరైన్, కెప్టెన్ దినేశ్ కార్తీక్, హిట్టర్ ఆండ్రీ రసెల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో.. పోరు ఆసక్తికరంగా జరగనుంది.

ఇరు జట్ల అంచనా:

కోల్‌కతా నైట్ రైడర్స్:
Dinesh Karthik (c), Sunil Narine, Andre Russell, Chris Lynn, Robin Uthappa, Kuldeep Yadav, Piyush Chawla, Nitish Rana, Prasidh Krishna, Shivam Mavi, Mitchell Johnson, Shubman Gill, R. Vinay Kumar, Rinku Singh, Cameron Delport, Javon Searless, Apoorv Wankhade, Ishank Jaggi, Tom Curran.

రాజస్థాన్ రాయల్స్:
Ajinkya Rahane (C), Ben Stokes, Stuart Binny, Sanju Samson, Jos Buttler, Rahul Tripathi, D Arcy Short, Krishnappa Gowtham, Jofra Archer, Dhawal Kulkarni, Jaydev Unadkat, Ankit Sharma, Anureet Singh, Shreyas Gopal, Prashant Chopra, Sudhesan Midhun, Ben Laughlin, Mahipal Lomror, Aryaman Birla, Jatin Saxena, Dushmantha Chameera, Heinrich Klaasen, Ish Sodhi.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Tuesday, May 15, 2018, 17:40 [IST]
  Other articles published on May 15, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more