న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ సమిష్టిగా రాణించిన వేళ: కోట్లాలో కోల్‌కతాపై ఘన విజయం

By Nageshwara Rao
DD

హైదరాబాద్: ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆడిన మూడో మ్యాచ్లో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే, ఢిల్లీ జట్టు సమిష్టిగా రాణిస్తే ఫలితం ఎలా ఉంటుందో అభిమానులకు ఒకసారి రుచి చూపించింది.

కోట్లా వేదికగా శుక్రవారం రాత్రి కోల్ కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీ ఆరంభం నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఏడో స్థానానికి ఎగబాకింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్‌(44)కు తోడు శుభ్‌మాన్‌ గిల్‌(37), నరైన్‌(26)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు.

మిగతా వారంతా స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత మళ్లీ ఢిల్లీ గెలుపొందగా.. కోల్‌కతాకి వరుసగా ఇది రెండో ఓటమి.


15 ఓవర్లకు ఢిల్లీ 140/5
ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 220 లక్ష్య చేధనలో కోల్‌కతా 15 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌ (37), ఆండ్రూ రసెల్‌ (43) ఉన్నారు. కష్టాల్లో పడిన జట్టును గెలిపించాలని రసెల్‌ దూకుడుగా ఆడుతున్నాడు. కోల్‌కతా జట్టు గెలవాలంటే 30 బంతుల్లో 80 పరుగులు చేయాలి.


10 ఓవర్లకు ఢిల్లీ 83/4
ఢిల్లీ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో 10 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. భారీగా పరుగులు సాధించాలన్న ఒత్తిడిలో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుతున్నారు. అమిత్‌ మిశ్రా వేసిన 9.3వ బంతికి కోల్‌కతా కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ (18) ఔటయ్యాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ (24), ఆండ్రూ రసెల్‌ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.


మూడు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా
ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్దేశించిన 220 లక్ష్య చేధనలో కోల్‌కతా జట్టు తడబడుతోంది. మ్యాక్స్‌వెల్ వేసిన రెండో ఓవర్‌లో క్రీస్ లిన్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బౌల్ట్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లోనే రాబిన్ ఊతప్ప కేవలం 1 పరుగులు మాత్రమే చేసి పృథ్వీ షాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో కీలక ఆటగాడు నరైన్(26) భారీ షాట్‌కు ప్రయత్నించి అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ 4 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కార్తీక్(2), రానా(6) ఉన్నారు.


కోల్‌కతా విజయ లక్ష్యం 220

ఐపీఎల్ 11వ సీజన్‌లో తొలిసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ సత్తా చాటారు. కోట్లా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (93 నాటౌట్: 40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్లులు), యువ ఓపెనర్ పృథ్వీ షా (62: 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు)లతో రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

దీంతో కోల్‌కతాకు 220 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కొలిన్ మున్రో (33; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) చక్కటి శుభారంభమిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే దూకుడుగా ఆడటంతో వీరిద్దరూ ఏడు ఓవర్లు ముగిసే సమయానికి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆ తర్వాత మున్రో(33) ఔటయ్యాడు. ఆ తర్వాత కెరీర్‌లో రెండో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 38 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయ్యర్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత పృథ్వీ షారెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

దాంతో ఢిల్లీ 129 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి దిగిన గ్లెన్ మ్యాక్స్ వెల్‌తో కళ్లు చెదిరే రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్ర​మంలోనే అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి 73 పరుగులు జత చేశాడు. చివర్లో కోల్‌కతా బౌలర్ శివమ్ మావీపై అయ్యర్‌ విరుచుకుపడ్డాడు.

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన శివమ్ మావి బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ సంచలన రీతిలో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాది ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.


15 ఓవర్లకు ఢిల్లీ 140/3
ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 15 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. శుభమ్ మావీ బౌలింగ్‌లో ఓపెనర్ కొలిన్ మున్రో (33) పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత మరో ఓపెనర్ పృథ్వీ షా (62) పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్(43), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1) పరుగుతో ఉన్నారు.


10 ఓవర్లకు ఢిల్లీ 83/1
ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ దూకుడుగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీషా (45; 34 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సు) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ శ్రేయాస్‌ అయ్యర్‌ (6) పరుగులతో క్రీజులో ఉన్నాడు.


తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతోన్న ఢిల్లీ ఓపెనర్లను కోల్‌కతా బౌలర్ శుభమ్ మావీ విడదీశాడు. శుభమ్ మావీ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఆరో బంతికి ఢిల్లీ ఓపెనర్ కొలిన్ మున్రో (33) పరుగుల వద్ద బౌల్డయ్యాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది.


దూకుడుగా ఆడుతోన్న ఢిల్లీ ఓపెనర్లు
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పృథ్వీ షా (20), కొలిన్ మున్రో (31) పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తుది జట్టులో రెండు మార్పులు చేసింది.

పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న గౌతమ్ గంభీర్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి రాగా.. క్రిస్టియాన్ స్థానంలో కొలిన్ మున్రో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కోల్‌కతా జట్టులోనూ ఒక మార్పు జరిగింది. టామ్ కుర్రన్ స్థానంలో మిచెల్ జాన్సన్ జట్టులోకి వచ్చాడు.

ఢిల్లీ Vs కోల్‌కతా మ్యాచ్ లైవ్ స్కోరు కార్డు

ఈ సీజన్‌లో ఢిల్లీ చివరిగా ఆడినా నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో వరుస ఓటములకి బాధ్యత వహిస్తూ బుధవారం జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ తప్పుకోగా.. యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కి నాయకత్వ బాధ్యతలను ఢిల్లీ ఫ్రాంఛైజీ అప్పగించింది. శ్రేయాస్ కెప్టెన్సీలో ఈ సీజన్‌లో మరో విజయాన్ని అందుకోవాలని ఢిల్లీ అనుకుంటుంది.

రెండు జట్లూ టోర్నీలో తాము ఆడిన చివరి మ్యాచ్‌లో ఓడి ఒత్తిడిలో బరిలోకి దిగుతున్నాయి. హిట్టర్లతో నిండిన కోల్‌కతా జట్టుది కాస్త పైచేయిగా కనిపిస్తుండగా.. సొంతమైదానం ఫిరోజ్ షా కోట్లలో ఆడుతుండటం ఢిల్లీకి జట్టుకి లాభించే అంశం. ఇప్పటికే మూడు జట్లు పది పాయింట్లతో ప్లేఆఫ్‌కి చేరువవుతుండగా.. ఢిల్లీ జట్టు ప్లేఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే.. ప్రతి మ్యాచ్‌లో సత్తాచాటాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు టోర్నీ ఆరంభం నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

జట్ల వివరాలు:
కోల్‌కతా నైట్‌రైడర్స్:

క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రానా, దినేశ్ కార్తీక్(కెప్టెన్/కీపర్), శుభ్‌మాన్ గిల్, ఆండ్రే రస్సెల్, మిషెల్ జాన్సన్, పియూష్ చావ్లా, శివం మావీ, కుల్దీప్ యాదవ్.

ఢిల్లీ డేర్ డెవిల్స్:
పృథ్వీ షా, కోలిన్ మున్రో, శ్రేయస్ అయ్యార్(కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిషబ్ పంత్(కీపర్), రాహుల్ టెవాటియా, విజయ్ శంకర్, అమిత్ విశ్రా, లైమ్ ప్లంకెట్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.

Story first published: Friday, April 27, 2018, 23:53 [IST]
Other articles published on Apr 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X