న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018: RR vs KKR: రాజస్థాన్‌పై సునాయాసంగా గెలిచేసిన కోల్‌కతా

ipl-2018-match-15-rajasthan-royals-vs-kolkata-knight-riders-match-report-at-jaipur-stadium

హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా రాజస్థాన్, కోల్‌కతా జట్లు రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా సమరానికి సిద్ధమైయ్యాయి. కోల్‌కతా జట్టు టార్గెట్ 161ను ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే గెలిచేసింది. లక్ష్యం చిన్నదే అయినా ప్రత్యర్థి జట్టు పరవాలేదనిపించుకున్న బౌలింగ్‌తో చివరి వరకు పొడిగించింది. ఎట్టకేలకు మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీంతో ఇదే ఐపీఎల్ లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుని.. ఆరు పాయింట్లతో అన్ని జట్ల కంటే మెరుగైన స్థానంలో ఉంది.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యే సరికి కోల్‌కతా: 87/2

ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టి 161 టార్గెట్‌తో ఛేదనకు దిగిన కోల్‌కతా నిదానంగా పరుగులు చేస్తోంది. ఇప్పటికే సునీల్ నరైన్ 25 బంతుల్లో (35) పరుగులు, క్రిస్ లిన్ 2 బంతుల్లో అస్సలు పరుగులేమీ చేయకుండా వెనుదిరిగారు. ఈ రెండు వికెట్లను కృష్ణప్ప గౌతం తీయడం గమనార్హం.


రాజస్థాన్ ఇన్నింగ్స్:

ఫీల్డింగ్, బౌలింగ్‌తో దాడి చేసి రాజస్థాన్ జట్టును కట్టడి చేసింది. రహానె సేన మొత్తంలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేయలేకపోవడం గమనార్హం. 18 బౌండరీలను మాత్రమే చేయగలిగిన రాజస్థాన్ ఫీల్డింగ్ లోనైనా కోల్‌కతా సరిగ్గా ఎదుర్కోలేకపోతే ఓటమి తప్పదు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి 99/3

గత మ్యాచ్ విజయం అనంతరం భారీ అంచనాలతో క్రీజులోకి దిగిన రాజస్థాన్ జట్టు స్కోరు నత్తనడకన సాగిస్తోంది. కోల్‌కతా ఫీల్డింగ్ ధాటికి పరుగులు చేసేందుకు తటాపటాయిస్తోన్న రహానె సేన మూడు వికెట్ల నష్టానికి కేవలం 99 పరుగుల మాత్రమే చేసింది.



దినేశ్ కార్తీక్ చేతిలో రహానే రనౌట్:

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మరోసారి వికెట్ల వెనుక మ్యాజిక్ చేశాడు. అద్భుతమైన త్రో ద్వారా రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానేను రనౌట్ చేశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను కోల్‌కతా స్పిన్నర్లు ఇబ్బంది పెట్టారు. మొదటి మూడు ఓవర్లలో రాయల్స్ 9 పరుగులు మాత్రమే చేసింది. ఒత్తిడి పెరిగిపోతున్న దశలో సునీల్ నరైన్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు ఫోర్లు బాదిన రహానే.. స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు.

రహానే దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. మరుసటి ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయిన రహానే.. బంతి వికెట్ల దగ్గరే ఉన్నప్పటికీ అనవసర పరుగు కోసం ప్రయత్నించాడు. వికెట్ల వెనుకే పొంచి ఉన్న కార్తీక్ డైరెక్ట్ త్రో ద్వారా రహానేను అవుట్ చేశాడు. దీంతో రహానే (19 బంతుల్లో 36) రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా జట్టు

ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

టోర్నీలో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లాడిన కోల్‌కతా 2 గెలుపొందగా.. రాజస్థాన్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. తమ చివరి మ్యాచ్‌లో సాధించిన విజయోత్సాహంతో బరిలోకి దిగాయి. ఇరు జట్లూ ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీపైనే గెలిచాయి.


గత మ్యాచ్ ఫలితాలు:
రాజస్థాన్ రాయల్స్:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ (92)బాదడంతో రాజస్థాన్ రాయల్స్ 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ మెరుగ్గా రాణించి.. బెంగళూరు జట్టుని 198/6కి కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో సొంతగడ్డపై రాజస్థాన్ బరిలోకి దిగుతోంది. అంతేకాకుండా జైపూర్‌లో గత బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 10 పరుగుల తేడాతో గెలుపొందడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్:
కోల్‌కతా జట్టుకు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్.. ఆండ్రీ రసెల్‌ ప్రధాన బలంగా మారాడు. టోర్నీ ఆరంభం నుంచి భీకర హిట్టింగ్‌తో అమాంతంగా జట్టు స్కోరుని పెంచేస్తున్నాడు. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే 6 సిక్సర్లు బాదేసి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతని జోరుతో ఆ మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన కోల్‌కతా.. అనంతరం ఢిల్లీని 129 పరుగులకే కుప్పకూల్చింది. స్పిన్నర్లు సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెడుతున్నారు.


ఇరు జట్ల ఆటగాళ్లు:

రాజస్థాన్ జట్టు: Ajinkya Rahane (c), D'Arcy Short, Sanju Samson, Ben Stokes, Jos Buttler (wk), Rahul Tripathi, Krishnappa Gowtham, Shreyas Gopal, Dhawal Kulkarni, Jaydev Unadkat, Ben Laughlin

కోల్‌కతా జట్టు: Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik (c) (wk), Andre Russell, Shubman Gill, Tom Curran, Piyush Chawla, Shivam Mavi, Kuldeep Yadav

Story first published: Wednesday, April 18, 2018, 23:36 [IST]
Other articles published on Apr 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X